
neil name fixed for Kajal Aggarwal son
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజల్. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బాద్ షా, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి సౌత్ లో స్ట్రాంగ్ పాపులారిటీని దక్కించుకుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ కూడా మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుందీ స్టార్ హీరోయిన్.కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలు చేస్తూనే వస్తుంది.
అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీగా ఉన్న కాజల్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోంది. అయితే అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ కాజల్ యాక్టివ్ గానే ఉంటోంది. తన గతంలో బాడీ షేమింగ్ పైనా పలువురు చేసిన కామెంట్లను తిప్పికొట్టింది. అదిరిపోయే కౌంటర్లతో స్పందించింది. జీవితంలోని ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే కాజల్ ఇటీవల తన బేబి బంప్ పిక్స్ తెగ షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంది.తాజాగా కాజల్ అగర్వాల్ ట్రెండీ వేర్‌లో బేబి బంప్ చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.ఈ అమ్మడి మెస్మరైజింగ్ లుక్స్ చూసి మతులు పోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ మే నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
kajal aggarwal baby bump pic viral
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలోఇటీవల కాజల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫోటోలను కాజల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ తన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తోంది. కుటుంబ సభ్యులతో సరదా గడుపుతోంది. కేరీర్ విషయానికొస్తే కాజల్ చివరిగా దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన మలయాళ చిత్రం ‘హే సినామిక’. ఈనెల 3న రిలీజ్ అయ్యింది. కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.