
Kajal Aggarwal : షాపింగ్ మాల్ లో సందడి చేసిన కాజల్ అగర్వాల్ .. తల్లి అయిన అందం ఏమాత్రం తగ్గలేదు.. వీడియో
Kajal Aggarwal : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను కాజల్ అగర్వాల్ సంపాదించుకున్నారు. ఇక కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఇక పెళ్ళి తర్వాత సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. తల్లి అయిన తర్వాత కూడా ఆమె లో అందం ఏమాత్రం తగ్గలేనట్లుగా ఉంది. అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్గా కాజల్ అగర్వాల్ హైదరాబాదులో సందడి చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో కల్కి అనే షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి కాజల్ అక్కడికి వచ్చారు. కాజల్ వస్తుందని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు.
ఆమెతో ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక కాజల్ కూడా నవ్వుతూ అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు. ఇక కాజల్ చూసిన వారంతా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదని, తల్లి అయినా కూడా ఆమె అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదని అంటున్నారు. ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం మీడియాతో కాజల్ మాట్లాడారు. అందం మనసుకు సంబంధించినదని, మంచి హృదయం మంచి ఆలోచనలు ఉంటే బాహ్య సౌందర్యం మరింత ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ తో తనకి 20 ఏళ్ల అనుబంధం ఉందని, అభిమానుల ప్రేమాభిమానాలు తనకు ఎప్పుడు ప్రత్యేకం అన్నారు.
దేశవ్యాప్తంగా ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఎప్పుడు ముందుంటుంది అన్నారు. వెడ్డింగ్ వేర్ ప్రత్యేకమైన లెహంగాస్ తదితర ఫ్యాషన్ వేర్ కు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కల్కి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక ఈ ఏడాదిలో సత్యభామ, ఇండియన్ 2 సినిమాలు విడుదల కానున్నాయని మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో తన అభిమానుల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. కాజల్ మీ అభిమానుల గురించి ఏం చెబుతారు అని అడిగిన ప్రశ్నకి ఫ్యాన్స్ అందరికీ ఐ లవ్ యు నా అభిమానులు అంటే వాళ్ళు నా కుటుంబంతో సమానం. మీరంతా నా మనసుకు ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటారు అంటూ కాజల్ చెప్పుకొచ్చారు. ఇకపోతే కాజల్ గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుత కాజల్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ భారతీయుడు సినిమాకి ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.