kajal aggarwal : పెళ్లైనా కాజల్ అరాచకం మాములుగా లేదు..!
కలువ కళ్ల సుందరి కాజల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందంతో ఇట్టే కట్టిపడేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందరు అగ్ర హీరోల సరసన నటించి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. వెండితెర చందమామగా యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడిన కాజల్.. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. అయితే పెళ్ళైన కొత్త లోనే భర్తతో కలిసి రొమాంటిక్ టూర్స్ వేస్తూ విదేశాలు చుట్టివచ్చిన ఈ భామ.. ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా అందాల బ్లాస్ట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాల్లో సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోయిన్ పోస్ట్ చేసిన ఈ అందాలు చూసి మైకంలో తెలుపుతున్నారు నెటిజన్లు. ఓతో రచ్చ లేపావుగా అంటూ ఈ ముద్దుగుమ్మని ఆకాశానికి ఎత్తుతున్నారు. మీకు 38 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నాం అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు అసలు మీకు పెళ్లయిందా..? ఇంత అందంగా ఉన్నారేంటి అంటూ ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు.
kajal aggarwal : పెళ్లైనా కాజల్ అరాచకం మాములుగా లేదు..!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా టోల్వుడ్ ఆరంగేట్రం చేసిన కాజల్.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ స్టేటస్ పట్టేసింది. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. కాజల్ అగర్వాల్.. సౌత్ ఇండస్ట్రీకి, బాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాజల్ అగర్వాల్ అసలు నార్త్ ఇండియా అయినప్పటికీ నటిగా ఎదిగింది మాత్రం సౌత్ సినిమాలతోనే. ముఖ్యంగా తెలుగుసినిమాల ద్వారా స్టార్ గా మారింది. పెళ్లయిన నటీమణులకు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. దీపికా పదుకొణెకి ‘ఫైటర్’ లాంటి యాక్షన్-రొమాంటిక్ రోల్స్ వస్తున్నాయి. అలాగే ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ వంటి రొమాంటిక్ సినిమాలు అలియా భట్‌కి వస్తున్నాయి. కానీ సౌత్ లో అలా కాదు అని చెప్పుకొచ్చింది.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.