Ap Surveys : ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. మ‌స్తాన్ వ‌ర్సెస్ వేణుస్వామి..!

Advertisement
Advertisement

Ap Surveys  : మ‌రి కొద్ది గంట‌ల‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు, ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలోకి వ‌స్తారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల‌కి ముందు ఎగ్జిట్ పోల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పుట్ట‌గొడుగుల మాదిరిగా ప్ర‌తి సంస్థ స‌ర్వేలు అంటూ ఎగ్జిట్ పోల్ విడుద‌ల చేసింది. అయితే ఏదో తూతూ మంత్రంగా చెప్పుకొస్తే మ‌రి కొంద‌రు మాత్రం బాగా పరిశీల‌న‌లు జ‌రిపి జాత‌కాలు చెప్పారు. అయితే ఆరా సంస్థ మస్తాన్ మీద మాత్రం చాలా మంది ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఆయ‌న ఏం చెబుతారో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూశారు. వరసబెట్టి యూట్యూబ్ చానల్స్ ఆరా మస్తాన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఆయన తన సర్వే నూరు శాతం నిజం తప్పు అయితే మీడియాకే ముఖం చూపించను అంటూ స‌వాల్ కూడా చేశారు.

Advertisement

Ap Surveys  ఎవ‌రు గెలుస్తారు..

అయితే ఆరా మ‌స్తాన్ వైసీపీలో ప‌లువ‌రు నాయ‌కుల‌కి టెన్ష‌న్‌కి కూడా గురి చేశారు.తెలంగాణ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ చేయడం సాధ్యం కాదన్న ఆరా మస్తాన్.. ఇవన్నీ ప్రీ పోల్ సర్వేలే అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఆయన పోలింగ్ సరళిని విశ్లేషించుకొని చెప్పడంలేదని అర్థమవుతోందనంటున్నారు. మస్తాన్ చెప్పినవి వైసీపీలో ఆనందాన్ని నింపితే, 2014 ఎన్నికల్లో ఇదే మస్తాన్ చెప్పినది తప్పైందంటూ టీడీపీ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అయిన తరువాత ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. వీరంతా ఇపుడు సర్వేలు చూసి చెబుతున్నారు తాను నాలుగేళ్ళ క్రితమే జగన్ మరోసారి సీఎం అని చెప్పేశాను అని క్రెడిట్ తీసుకున్నారు.

Advertisement

Ap Surveys : ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. మ‌స్తాన్ వ‌ర్సెస్ వేణుస్వామి..!

జగన్ కి 17 ఏళ్ల పాటు రాజయోగం ఉందని అది 2019 నుంచి స్టార్ట్ అయిందని ఆయన 2029లో కూడా మరో సారి సీఎం అంటూ స‌రికొత్త జోస్యం చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు వేణు స్వామి.సర్వేలు, అందరు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని..కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నారనని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. మ‌రి ఆరా మ‌స్తాన్ స‌ర్వేలు అన్ని సక్సెస్ కాగా, మ‌రోవైపు వేణు స్వామి జాత‌కం కూడా ప‌లుమార్లు నిజ‌మైంది. మ‌రి ఫైన‌ల్‌గా ఎవ‌రి స‌ర్వే స‌త్ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

44 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

10 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

11 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

12 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

13 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

14 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

16 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

17 hours ago

This website uses cookies.