
Actress Kajal Aggarwal Introduced Her Son Gautam Kitchlu To Media
Kajal Aggarwal : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా నేషనల్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. తొలి పార్ట్ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు రెండో పార్ట్ కోసం సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్‌లు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. పుష్ప 2 ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణలతో వాయిదా పడుతూ వస్తోంది.
నిజానికి అల్లు అర్జున్ మరో సినిమాకు సైన్ చేయకపోయినప్పటికీ, సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టక పోయినప్పటికీ పుష్ప2 చిత్రీకరణ వాయిదా పడుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సుకుమార్ ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను దింపుతున్నారని సమాచారం. అడవి నేపథ్యంలో అడ్వెంచర్ ఫైట్‌లు ఇందులో ఉండనున్నటాయని టాక్. బాలీవుడ్ నటులను రంగంలోకి దింపనున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది.
kajal aggarwal special song in pushpa2 Movie
తొలి పార్ట్‌లో ఐటెం సాంగ్ చేసిన సమంత పుష్ప 2లో కీలక పాత్ర పోషించనుందని, ఇక ఐటెం సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకురాబోతున్నట్టు టాక్. గతంలో ఈ అమ్మడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 విషయంలో కాజల్ డ్యాన్స్ పై క్లారిటీ రావలసి ఉంది. ఇక మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ చిత్రంలోనూ రష్మికానే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు డాన్‌గా ఎదిగిన పుష్పరాజ్‌కు, పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్‌ల మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా సీక్వెల్ చిత్రం తెరకెక్కనుంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.