Devara Movie : దేవర సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ .. గూస్ బంప్స్ రావడం పక్కా..!
Devara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించారు. సత్య, అజయ్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. తాజాగా సత్యం ‘ డెవిల్ ‘ సినిమా టీంను ఇంటర్వ్యూ చేశారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ .. డెవిల్ సినిమా అద్భుతంగా ఉంటుందని, క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుందని అన్నారు. కథలో ప్రతి షార్ట్ డైరెక్టర్ బాగా చూపించారని, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక డెవిల్ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ దర్శక నిర్మాతగా రూపొందించారు. ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ అని కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ అప్డేట్ ఇచ్చారు. తమ్ముడు సినిమా దేవర కోసం చాలా కష్టపడుతున్నామని అన్నారు.
త్వరలోనే దేవర సినిమాకి సంబంధించి గ్లింప్స్ రాబోతుందని అన్నారు. త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్ కి, డైరెక్టర్ కి, ప్రొడక్షన్ హౌస్ కి ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగిన ఎవరు ఊరుకోరు. అందుకే తెలిసి తప్పు చేయను. బాధ్యతగా తీసుకొని దేవర సినిమా కోసం కష్టపడుతున్నామని అన్నారు. రేపు థియేటర్స్ లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నామని, అందుకోసం కాస్త సమయం పడుతుందని, దయచేసి ఓపిక పట్టండి అని, త్వరలోనే ఈ సినిమా డేట్ కూడా అనౌన్స్ చేస్తామని దేవర సినిమా గురించి కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.