karate kalyani fight with srikanth
Karate Kalyani :గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ దాడి చేశారు. కరాటే కల్యాణితో పాటు మరి కొంతమంది కలిసి చితకబాదారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరాటే కళ్యాణి కొన్నేళ్లుగా సామాజిక కార్యక్రమాల్లోనే చురుగ్గా పాల్గొంటూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఓ యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి గత కొన్నేళ్లుగా ప్రాంక్‌స్టర్ వీడియోలంటూ మహిళలపై అసభ్యకరమైన వీడియోలను రూపొందిస్తున్నట్టు కరాటే కళ్యాణి ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై అతని ఇంటికి నేరుగా వెళ్లి కరాటే కళ్యాణి నిలదీసింది. అంతేకాదు ప్రాంక్ పేరుతో లేడీస్‌తో అసభ్యకరంగా ప్రవిస్తున్నట్టు కరాటే కళ్యాణి అతన్ని అడిగితే..
సదురు వ్యక్తి సరైన సమాధానం చెప్పుకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసినట్టు అక్కడ ఉన్న వారు చెప్పారు.నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతన్ని చెంపపై కొట్టింది కళ్యాణి. ఆమె అనుచరులు కూడా ఒక్కసారిగా దాడి చేయడంతో శ్రీకాంత్ రెడ్డి తిరగబడ్డాడు. అయితే ఫ్రాంక్ వీడియోలు తీయడం ఇష్టం లేకపోతే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అంతేతప్ప నన్ను కొట్టే హక్కు నీకు ఎక్కడిది అంటూ కరాటే కళ్యాణిని ప్రశ్నించాడు శ్రీకాంత్ రెడ్డి. తనతో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగిందని.. అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేసిందంటూ ఆరోపణలు చేశాడు శ్రీకాంత్ రెడ్డి.
karate kalyani fight with srikanth
ఈ విషయమై శ్రీకాంత్ రెడ్డి సమీపంలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కరాటే కళ్యాణి తనపై దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. మరోవైపు కరాటే కళ్యాణి అతనే తనపై దాడి చేసినందుకే ప్రతిఘటించానంటూ చెప్పుకొచ్చరు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డి పై అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కరాటే కళ్యాణి.. హరికథ కళాకారిణిగా ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు. అలా స్టేజ్‌షోలు చేస్తూనే వినాయక్ కంట పడ్డారు. అంతేకాదు ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘ఆది’ సినిమాతోనే నటిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘లక్ష్మీ నరసింహా’, శంకర్ దాదా ఎంబీబీఎస్, ‘చత్రపతి’, ‘కృష్ణ’, ‘మిరపకాయ్’ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కృష్ణ సినిమా నటిగా ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.