
Karthika Deepam 03 August 2022 Full Episode
Karthika Deepam 03 August 2022 Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 3 బుధవారం ఎపిసోడ్ 14 21 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, హిమ లు నిరూపముకి వాటర్ బాటిల్ ఇచ్చి.. సౌర్యాకు పార్సల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పుడు సౌర్య వచ్చి కూర్చొని తింటూ నిరూపమును ఏంటి చూస్తున్నావ్… నీకు అసలు ఇవ్వను అని అంటుంది. అప్పుడు నిరూపం అదేంటి సౌర్య నిన్ను కాపాడడానికి నేను వచ్చాను కదా.. నువ్వేమో నాకు ఇవ్వను అంటున్నావు అంటాడు. అప్పుడు శౌర్య నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అంతే అని అంటుంది. బయట ప్రేమ్, హిమ సరదాగా ఒకటే పార్సిల్ తింటూ ఉంటారు. సౌర్య కొద్దిసేపటి తర్వాత బావ ఆకలేస్తుందా.. అని పిలిచి పార్సెల్ ని ఒకటే ప్లేట్లు లో సగం చేసి ఇది నువ్వు తిను, ఇది నేను తింటా. అని అంటూ తింటూ ఉంటారు ఇద్దరు. బయట ప్రేమ్ మాత్రం హిమ ప్రేమలో మునిగిపోతూ సరదాగా గడుపుతూ ఉంటాడు. లోపల నిరూపం సౌర్యాలు ఒకరి గురించి ఒకరు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతలో సౌర్యకు పోలమారుతుంది.
అప్పుడు నిరూపం తన తల మీద తడుతూ నీళ్లు తాగిస్తాడు. అప్పుడు శౌర్య జీవితాంతం నీ ప్రేమ కావాలి అనుకున్నాను. అది నేను, దక్కించుకోలేకపోయాను. అని బాధపడుతూ ఉంటుంది. నిరుపం తినడం అయిపోగానే ప్రేమను పిలిచి కారులో బెడ్ షీట్ ఉంది తీసుకొచ్చి ఇవ్వరా అని అంటాడు. అప్పుడు ప్రేమ్ నువ్వేంటి రా బాబు అప్పుడే గబగబా తినేసావ్ సరదాగా నెమ్మదిగా తినొచ్చు కదా… అని అంటాడు. అప్పుడు నిరూపం ఎంజాయ్ చేయడం ఏంట్రా బాబు… ఇక్కడ దోమలు కుడుతున్నాయి అని అంటాడు. బయట ప్రేమ్ హిమ చలి మంట వేసుకొని సరదాగా గడుపుతూ ఉంటారు. ప్రేమ్ హిమ తో ఒక డ్యూయెట్ సాంగ్ ఊహించుకుంటూ తన ప్రేమలో మునిగిపోతాడు. అప్పుడు హిమ బావ అని గట్టిగా పిలుస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఊహల్లో నుంచి బయటికి వస్తాడు ప్రేమ్. అప్పుడు హిమ బావ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ అవును ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఎవరు చెప్పు అని అంటుంది. అప్పుడు ప్రేమ్ టైం వచ్చినప్పుడు చెప్తా అని.. నేను ఇక్కడికి వెళ్ళొస్తానని పక్కకి వెళ్తాడు. అప్పుడు హిమ తన ఫోన్ లో హిమకు ప్రపోజ్ చేసిన వీడియో ఉంటుంది. అది హిమ చూసి ఒక్కసారి గా షాక్ అవుతుంది.
Karthika Deepam 03 August 2022 Full Episode
అంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఏంటి హిమ ఏం చూస్తున్నావ్ అని అడుగుతుండగా… హిమ తన ఫోన్ ని తనకి ఇస్తుంది. అప్పుడు తను ఆ వీడియో చూసినట్లు ప్రేమ్ కి తెలుస్తుంది. అప్పుడు ప్రేమ్ హిమ నీకు ఇది ఎప్పటినుంచో చెప్పాలి అనుకుంటున్నా.. కానీ కుదరలేదు అని అంటాడు. అప్పుడు హిమ జీవితంలో మనం ఎన్నెన్నో అనుకుంటాం. అవన్నీ జరుగుతాయా.. బావ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేమ్ తను అవునన్నట్ల.. కాదన్నట్లా.. అని కంగారు పడుతూ ఉంటాడు. లోపల నిరూపం, సౌర్య పడుకుంటారు. అంతలో సౌర్య చలితో వణుకుపోతూ ఉంటుంది. అప్పుడు సౌర్యకు బెడ్ షీట్ కప్పుతాడు నిరూపం. కానీ సౌర్య బెడ్ షీట్ ను తీసి నిరూపముకి కప్పుతుంది. అదేంటి శౌర్య మళ్ళీ తిరిగి ఇస్తున్నావ్ అని అడగగా.. నాకు ఇలాంటి త్యాగాలు ఏమి అవసరం లేదు.. అని సౌర్య అంటుంది. నిరుపం హిమ గురించి సౌర్యతో మాట్లాడుతాడు. అప్పుడు సౌర్య బాధపడుతూ వెళ్లి పడుకుంటుంది. ఇలా తెల్లారిపోతుంది. నిరూపం ప్రేమ్ వాళ్లను గట్టిగా పిలుస్తాడు. అప్పుడు ప్రేమ్, హిమ అక్కడికి వచ్చి డోర్ తీస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
This website uses cookies.