Karthika Deepam 04 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 1553 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్ని రోజులు బతికినా సంతోషంగా బతికితే చాలు. నామీద జాలి చూపించొద్దు అంటుంది దీప. ఆ తర్వాత ఏం చేస్తున్నావు అంటే దోసకాయ పచ్చడి అంటుంది. హిమకు చాలా ఇష్టం కదా అంటుంది. తనకు ఎలా పంపిస్తావు అంటే.. పక్కన హేమ చంద్ర అన్నయ్య ఉన్నారు కదా. ఆయనతో పంపిస్తా అంటుంది దీప. వద్దు దీప.. మన గురించి తెలిసిపోతుంది అంటాడు కార్తీక్. దీంతో ఏం కాదు.. ఎలాగోలా హిమకు దోసకాయ పచ్చడి చేరుతుంది అంటుంది. సరే.. నేను వెళ్లి ముఖం కడుక్కుంటా అంటాడు కార్తీక్. బయటికి రాగానే సౌందర్య, అంజి కారులో రావడం చూస్తాడు కార్తీక్.
అమ్మా, అంజి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటాడు కార్తీక్. వెంటనే ఇంట్లో నుంచి తాళం తీసి బయటికి వచ్చి తాళం వేయబోతాడు కానీ.. అప్పటికే సౌందర్య అటువైపుగా వస్తుంటే బయట ఉన్న డ్రెస్సులు అన్నీ తీసి ఇంట్లో పెట్టి దానికి తాళం వేస్తాడు కార్తీక్. ఇంతలో గేట్ తీసి లోపలికి వస్తుంటుంది సౌందర్య. చూస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఎలా తెలుస్తుంది అని అనుకుంటుంది సౌందర్య. ఇంతలో దోసలు వేసేది ఆపి బయటికి రాబోతుంది దీప. కానీ.. డోర్ లాక్ చేసి ఉండటం చూస్తుంది. డాక్టర్ బాబు అంటూ డోర్ కొడుతుంది దీంతో… వాళ్లు వెళ్లిపోయారా అని చూసి వచ్చి లాక్ తీస్తాడు కార్తీక్.
అమ్మ వచ్చిందని చెబుతాడు. సమయానికి పండరి కూడా లేడు. మంచిపని అయింది అంటాడు కార్తీక్. ఇప్పుడు మన గురించి తెలియకూడదు. అంజి గురించి పండరికి చెప్పొచ్చు కదా. కొడుకు మారాడు అంటే సంతోషిస్తుంది అంటుంది దీప.
అన్ని ఇళ్లు అయిపోయాయి మేడమ్ అంటాడు అంజి. ఇక్కడ కూడా లేరు అంటే ఈ ఊళ్లో లేనట్టేనా. కానీ.. హిమ చూసింది అంజి. మనం ఎక్కడో ఒక చోట మిస్ అయ్యాం. అది మాత్రం బాగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది సౌందర్య.
ఇంతలో చారుశీల అక్కడికి వస్తుంది. సౌందర్యను చూస్తుంది. హాయ్ ఆంటి.. మీరేంటి ఇక్కడ అని అంటుంది. నా కొడుకును వెతుక్కుంటూ వచ్చాను అంటుంది. కనిపించారా అంటే లేరు అంటుంది.
మేము ఉండేది ఇక్కడే.. ఇంతకుముందు మా ఇంటికి వచ్చింది మీరేనా అంటుంది చారుశీల. అవును మేమే అంటుంది సౌందర్య. నువ్వు ఉండేది ఇక్కడే కదా.. కార్తీక్ వాళ్లు కనిపిస్తే నాకు చెప్పు అంటుంది. దీంతో చెబుతా అంటుంది చారుశీల.
దీప పైకి పోయాక… అప్పుడు నేను కార్తీక్ ను పెళ్లి చేసుకుంటా అని మనసులో అనుకుంటుంది చారుశీల. మరోవైపు హేమచంద్రతో మాట్లాడుతుంది దీప. అత్తయ్యతో మాట్లాడుదామని అనుకుంటున్నా అంటుంది దీప.
అత్తయ్యను పిలిచి ఈ విషయం చెబుతాను. నేను ప్రమాదంలోనే పోయానని చెప్పమంటాను. నాన్న మాత్రమే బతికారు అని పిల్లలకు చెప్పమంటాను. అమ్మ లేకపోయినా నాన్న అయినా ఉన్నారని సంతోషిస్తారు.
అందుకే అత్తయ్యకు చెప్పి వెళ్దామని ఆలోచిస్తున్నా. అందుకే అత్తయ్యను తీసుకురా అన్నయ్య అంటుంది దీప. దీంతో కార్తీక్ ఏమంటాడో అంటాడు హేమచంద్ర. దీంతో ఏం కాదు. నా మాట విని పిలుచుకురా అన్నయ్య అంటుంది దీప.
దీంతో సరే అమ్మ అంటూ బయటికి వెళ్లబోతుండగా కార్తీక్ ఎదురొస్తాడు. ఎక్కడికి అని అడుగుతాడు. హిమకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టం.. అన్నయ్యకు ఇస్తానంటే వద్దని చెప్పి ఒంటరిగా బయలుదేరినప్పుడే నాకు అర్థం అయింది అంటాడు కార్తీక్.
నాకు చావు అయినా బతుకు అయినా నీతోనే పదా అంటాడు కార్తీక్. దీప.. ఊరికే గొడవ చేయొద్దు. మన ఉనికినే వాళ్లకు చెప్పొద్దు అంటాడు కార్తీక్. హేమచంద్ర చెప్పినా కూడా వినడు కార్తీక్. మీ అందరి కన్నా నాకు ఎక్కువ బాధ్యత ఉంది అంటాడు కార్తీక్.
ఇంతలో హిమ వెతుక్కుంటూ అక్కడికి వస్తుంటుంది. దీంతో హిమను చూస్తుంది దీప. నీకు దండం పెడతాను. నువ్వు మళ్లీ మా గురించి ఏం చెప్పొద్దు అంటాడు కార్తీక్. అంకుల్ మీరు శౌర్యను తీసుకొని అమ్మానాన్నలను వెతకడానికి వెళ్తా అన్నారట కదా. నేనూ వస్తాను అంటుంది హిమ.
దీంతో సరే.. తీసుకెళ్తా అంటాడు హేమచంద్ర. అవును.. నువ్వు టిఫిన్ చేశావా అంటాడు. దోస, దోసకాయ పచ్చడి చేశా.. రా కలిసి తిందాం అంటాడు. మరోవైపు ఏం చేద్దాం అని సౌందర్య.. ఆనంద రావుతో అంటుంది. అందరం ఇక హైదరాబాద్ వెళ్లిపోదామా అని అడుగుతుంది సౌందర్య.
ఇక్కడ ఉండి వెతికినా కూడా ప్రయోజనం లేదు అంటుంది సౌందర్య. అక్కడ దాదాపు ప్రతి ఇల్లు వెతికాం. ఒక్క ఇల్లు తప్ప. ఆ ఇల్లుకు తాళం వేసి ఉంది అంటుంది సౌందర్య. అంటే.. వాళ్లు ఆ ఇంట్లో ఉంటారా అంటాడు ఆనంద రావు.
ఆ తాళం వేసిన వాళ్లు వచ్చాక వాళ్లను కలిసే వెళ్దాం అంటుంది సౌందర్య. మరోవైపు దోసలు తింటూ పచ్చడి అచ్చం మా అమ్మ చేసినట్టే ఉంది అంటుంది హిమ. మా అమ్మ, డాడీ, శౌర్య, నేను, ఇంట్లో అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆ సంతోషమే వేరు అంకుల్ అంటుంది హిమ.
మళ్లీ ఆరోజు రావాలి అని అనుకుంటుంది హిమ. తర్వాత దోస తిని నేను వెళ్లొస్తాను అంకుల్. నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తారు అని అడుగుతుంది. దీంతో రేపు వెళ్దాం అంటాడు. దీంతో సరే అని వెళ్తుంది హిమ.
బయటికి వచ్చి చూశావా హేమచంద్ర.. ఎంత టెన్షన్ పడ్డామో. దీప నువ్వు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటాడు కార్తీక్. దీంతో ఇక నుంచి మిమ్మల్ని వెళ్లమని బతిమిలాడను అంటుంది దీప.
అన్నయ్య గొడుగు ఉంటే ఇవ్వు. అత్తయ్య వాళ్లకు కనబడకుండా వెళ్లాలి అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.