Karthika Deepam 6 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జనవరి 2023, శుక్రవారం ఎపిసోడ్ 1555 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మోనిత పీడను ఎలా విరగడ చేసుకోవాలి అని అనుకుంటుంది దీప. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి అంత పరధ్యానంగా ఉన్నావేంటి అని అంటాడు. ఏం లేదు అంటుంది దీప. దీంతో మోనిత గురించే కదా నువ్వు ఆలోచించేది. తన గురించి నువ్వు టెన్షన్ పడకు. తన సంగతి నేను చూసుకుంటా అంటాడు కార్తీక్. దీంతో అది మామూలుది కాదు. నేను ఎప్పుడు పోతానా అని ఎదురు చూస్తోంది. నేను పోయాక అది మిమ్మల్ని వదలదు. దెయ్యం పట్టినట్టు పట్టి పీడిస్తుంది అంటుంది దీప. నువ్వు పదే పదే చావు గురించి మాట్లాడుకు అంటాడు కార్తీక్.
చావు కూడా మనల్ని విడదీయలేదు అంటాడు కార్తీక్. నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉన్నానో.. నువ్వు లేనప్పుడు కూడా అలా ఉండటం సాధ్యం కాదు. అసలు నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు కార్తీక్. మీరు లేక, నేను లేక పిల్లలు ఏమైపోతారని అనుకుంటున్నారు అంటుంది దీప. అయినా.. అర్ధాయిష్షు ఉన్న నేను పోతా అంటే తప్పు కానీ.. నిండు నూరేళ్లు ఉన్న మీరు మాత్రం పోతా అనడం కరెక్టా. అయినా ఇదంతా మోనిత వల్లే వచ్చింది. ఈ మాట మరిచిపోయి కాస్త ప్రశాంతంగా ఉందామంటే మళ్లీ మీ చేత ఆ మాట అనేలా చేసింది. అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు డాక్టర్ బాబు. నేను బతికి ఉన్నప్పుడే దాన్ని పైకి పంపిస్తే.. పోయాక నాకు ఆత్మశాంతి. మీకు మనశ్శాంతి. దీప.. మోనిత గురించి ఆలోచించొద్దు అని చెప్పా కదా అంటాడు కార్తీక్.
ఇంతలో కార్తీక్ కు ఫోన్ వస్తుంది. దీంతో ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వెళ్తాడు. వంట అయింది తిని వెళ్లండి అంటే.. వచ్చాక తింటా దీప అంటాడు కార్తీక్. ఆ మోనిత బతికి ఉంటే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం. ఆ మోనిత బతకకూడదు అని అనుకుంటుంది దీప. ఇంతలో కార్తీక్.. మోనిత దగ్గరకి వస్తాడు. నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి మోనిత అంటాడు.
దీంతో ఒక్క నిమిషం ఏంటి కార్తీక్.. ఎంత సేపు అయినా మాట్లాడు అంటుంది మోనిత. సరే.. లోపలికి రా మాట్లాడుకుందాం అంటే.. అవసరం లేదు. ఇక్కడే మాట్లాడుతా అంటాడు కార్తీక్. దీప వచ్చాక వెళ్లిపోయావు కానీ.. అంతకుముందు ఇదే ఇంట్లో నువ్వు ఎంత సంతోషంగా గడిపావు అంటుంది మోనిత.
దీప పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఇంకా అదే పాట పాడుతున్నావు అని అడుగుతాడు కార్తీక్. వదిలేస్తాను కానీ.. ఒక కండిషన్ అంటుంది. నేను నీతోనే ఉంటాను అంటుంది. నిన్ను ఇక డిస్టర్బ్ చేయను. దీప బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉండండి. ఆ సంతోషాన్ని చూస్తూ మీతోనే ఉంటాను. కానీ.. దీప పోయాక నాతో అంతే సంతోషంగా ఉండాలి అని చెబుతుంది మోనిత.
దీంతో ఛీ.. ఛీ అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. ఒక్క అవకాశం ఇవ్వు కార్తీక్ అంటుంది మోనిత. దీంతో దీప పరిస్థితిని చూసి నిన్ను వదిలేస్తున్నాను. కానీ.. ఏదైనా తేడా వచ్చిందో ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు కార్తీక్.
మరోవైపు శౌర్య, హిమ ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ తమ అమ్మానాన్నల గురించి తిరుగుతుంటారు. కానీ.. ఎవ్వరూ చూడలేదు అంటారు. ఇంతలో శౌర్యకు బాగా దాహంగా ఉందని తెలుసుకొని.. శౌర్య బాగా దాహంగా ఉంది అక్కడ వాటర్ బాటిల్ కొందాం అని చెప్పి కొట్టుకు వెళ్తారు.
అక్కడ ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటుంది హిమ. తన వాటర్ బాటిల్ లో నీళ్లు తాగదు. వేరే బాటిల్ కొనుక్కుంటుంది శౌర్య. నా బాటిల్ లో నీళ్లు ఎందుకు తాగలేదు అంటుంది హిమ. దీంతో ఇంకా వెతకాలి కదా.. అందుకే రెండు బాటిల్స్ తీసుకున్నాం అంటుంది శౌర్య.
మరోవైపు మోనిత.. దీప దగ్గరికి వస్తుంది. డాక్టర్ బాబు కోసం ఎదురు చూస్తున్నావా? అంటే ఇంకా ఇంటికి రాలేదా అంటే.. నీకెందుకే.. ముందు బయటికి నడువు అంటుంది దీప. ఎందుకు అంత ఆవేశ పడుతున్నావు. ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది మోనిత.
సరే.. వంట ఏం చేశావు.. తింటూ మాట్లాడుకుందాం అంటుంది. కార్తీక్ నా దగ్గరికి వచ్చాడు అని చెబుతుంది మోనిత. దీంతో నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అని అడుగుతుంది. నా కోసం కాదులే.. నీ కోసమే అంటుంది మోనిత. అందరం కలిసి ఉందాం అని దీపను ఒప్పించబోతుంది మోనిత.
కానీ.. మోనిత మీద కోపం ప్రదర్శిస్తుంది. డాక్టర్ బాబు నిన్ను వదిలేశారు కానీ.. నువ్వు ఇప్పుడు వెళ్లకపోతే నిలువునా చీరేస్తాను అంటుంది దీప. అలా ఇద్దరూ కాసేపు గొడవ పెట్టుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మోనిత వెళ్లిపోతుంది. మరోవైపు శౌర్య, హిమ ఇద్దరూ కార్తీక్, దీప గురించి వెతుకుతూ రోడ్డు మీద వెళ్తుండగా హేమ చంద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.