Karthika Deepam 9 Jan Today Episode : సౌందర్యను కలిసిన దీప.. కార్తీక్ ను కలిసిన హిమ, శౌర్య.. అందరూ ఒక్కచోటుకు.. కథ సుఖాంతం.. సీరియల్ ఎండ్ దశకు

Karthika Deepam 9 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 09 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 1557 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత చూస్తే భయమేస్తోంది అని కార్తీక్ తో చెబుతుంది దీప. దీంతో ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కునే నువ్వు మోనితను చూసి భయపడటం ఏంటి అంటాడు కార్తీక్. దీంతో దీప ఏడవకు. ఏం కాదు అని చెబుతున్నాను కదా అంటాడు కార్తీక్. దీంతో లేదు డాక్టర్ బాబు. నేను పోయాక కూడా ఈ సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే మీ బిడ్డకు తల్లి అయింది. ఇప్పుడు మీరు కలిసిన ఫోటోలను చూపించి మీ వారు అని నిరూపించుకుంటే.. చట్టపరంగా మీ భర్త అని నిరూపించుకొని అది అన్నట్టుగానే ఏ స్విట్జర్లాండ్ కో తీసుకెళ్తే ఎలా అంటుంది దీప. నేను లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలంటే అంటుంది దీప.

karthika deepam 09 january 2023 full episode

దీంతో ఎప్పుడూ అదే మాటా… వద్దు అంటాడు కార్తీక్. కానీ..  నాకేమైనా పోవాలని సరదానా. నాకు బతకాలని ఉంది. నన్ను బతికించండి. మీతో కలిసి వంద సంవత్సరాలు కాదు. వెయ్యి సంవత్సరాలు బతకాలని ఉంది. నన్ను బతికించండి డాక్టర్ బాబు. కానీ.. నాకా అదృష్టం లేదు డాక్టర్ బాబు అంటుంది దీప. నా తలరాత ఇంతే. అది మీ రాతలను మార్చకూడదు. మోనితను మీ జీవితంలోకి వచ్చేలా చేయకూడదు. ఏదో ఒకటి చేయాలి డాక్టర్ బాబు అని అంటుంది దీప. మరోవైపు సౌందర్య నిద్ర లేస్తుంది. ప్రతిక్షణం నేను కోరుకునే కోరికే. నాకొడుకు కోడలు అంటూ ఉంటే.. కనీసం ఈరోజు అయితే కనపడేలా చేయి అని దేవుడిని వేడుకుంటుంది సౌందర్య. పాలు వచ్చాయో లేదో అని బయటికి పాలప్యాకెట్ల కోసం వస్తుంది సౌందర్య.

అక్కడే ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్న దీపను చూస్తుంది సౌందర్య. చూసి షాక్ అవుతుంది. దీప.. అంటుంది. అత్తయ్య అంటుంది. దీప.. వచ్చావా అంటుంది సౌందర్య. ఇన్నాళ్లు ఏమైపోయావే అంటుంది. తనను గట్టిగా హత్తుకుంటుంది సౌందర్య. ఎన్నాళ్లయిందే నిన్ను చూసి. అసలు మళ్లీ చూస్తానా లేదా అనుకున్నాను. కానీ.. ఆ దేవుడు మా మొర ఆలకించాడు. ఇన్నాళ్ల మా నిరీక్షణ వృథా కాలేదు. నువ్వు బతికే ఉన్నావు. తిరిగి వచ్చావు అని సంబుర పడుతుంది సౌందర్య.

అసలు ఇన్నాళ్లు ఎక్కడున్నారు. ఏమైపోయారు అని అడుగుతుంది సౌందర్య. చెప్తాను. మెల్లగా మాట్లాడండి. పిల్లలు లేస్తారు. మళ్లీ నన్ను చూస్తారు అంటుంది. దీంతో ఏం మాట్లాడుతున్నావు. ముందు లోపలికి రా అంటే. మీతో చాలా మాట్లాడాలి. నేను తర్వాత వస్తాను అంటుంది దీప.

శౌర్య ఆరోజు మీకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉంది. హిమ వచ్చాక రోజూ వాళ్లు పిచ్చి వాళ్లలా రోడ్ల మీద పడి వెతుకుతూనే ఉన్నారు అంటుంది సౌందర్య. దీంతో తెలుసు అత్తయ్య అంటుంది. తెలుసా.. ఏం మాట్లాడుతున్నావే అంటుంది సౌందర్య.

Karthika Deepam 9 Jan Today Episode : చారుశీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మోనిత

దీంతో ముందు నేను చెప్పింది వినండి. నేను చెప్పినట్టు చేయండి అంటుంది. నువ్వు చెప్పినట్టు చేస్తా కానీ.. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవే అంటుంది. దీంతో నేను చెబుతాను కానీ.. ముందు నేను చెప్పినట్టు వినండి అంటుంది దీప. తప్పించుకోవడానికి నువ్వు ఏం మాట్లాడొద్దు అంటుంది సౌందర్య.

మీ గురించి మాకు తెలియకూడదా? అని అంటుంది సౌందర్య. నాకు నిజంగా భయమేస్తోంది దీప. ఏం జరిగిందో చెప్పవే అంటుంది. దీంతో నాతో రా అంటుంది. మరోవైపు మోనిత.. కార్తీక్ ఫోటోను చూస్తూ ఉంటుంది. ఇంతలో చారుశీల వచ్చి కాఫీ ఇస్తుంది.

ఏంటి మోనిత.. అప్పటి నుంచి తెగ ఫోన్ ను చూస్తున్నావు అని అడుగుతుంది చారుశీల. ఇదిగో కార్తీక్ ఫోటోను అంటుంది. నువ్వు నాకు ఎందుకు కాంపిటిషన్ రావాలని చూస్తున్నావు అని అడుగుతుంది మోనిత. నేను నీకు కాంపిటిషనా? ఏం మాట్లాడుతున్నావు మోనిత అని అంటుంది.

దీంతో మరి నీ ఫోన్ లో కార్తీక్ ఫోటోలు ఎందుకు ఉన్నాయి అని అంటుంది. ఇన్నాళ్లుగా కార్తీక్ వెంట పడుతున్న నా దగ్గర కూడా ఇన్ని ఫోటోలు లేవు. ఇంకో ఆడదాని ఆశను నేను పసిగట్టలేనని అనుకున్నావా? నేను జైలులో ఉన్నప్పుడు నా పనులు చక్కబెట్టడానికి నిన్ను పంపిస్తే.. నువ్వు నా దగ్గరి నుంచి కార్తీక్ ను లాక్కోవాలని అనుకుంటున్నావా? అంటుంది చారుశీల.

దీంతో మోనిత.. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటుంది చారుశీల. ఇక ఇది జైలులోనే ఉంటుంది అని అనుకున్నావా? అంటుంది మోనిత. నన్ను తప్పించడానికి పిచ్చి పిచ్చి ప్లాన్లు ఏమైనా వేశావనుకో.. చచ్చి ఊరుకుంటావు. కార్తీక్ కోసం ఇప్పటికే ఒకరి ప్రాణం తీశా. అందుకే జైలుకు వెళ్లాను అంటుంది మోనిత.

ఒక్కరిని చంపితే హంతకుడు అంటారు. అదే వెయ్యి మందిని చంపితే వీరుడు అంటారు. నన్ను వీరుడు అనిపించుకోవడంలో నాకేం తప్పు లేదు అని చారుశీలకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు కార్తీక్.. దీప గురించి వెతుకుతూ ఉంటాడు.

మోనిత మీద కోపంతో తనను ఏదైనా చేయడానికి వెళ్లిందా? లేక అమ్మ వాళ్ల దగ్గరికి వెళ్లిందా? అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు శౌర్య, హిమ ఇద్దరూ కార్తీక్, దీపను వెతుక్కుంటూ వెళ్తుంటారు. చాక్లెట్లు కొనుక్కుందామా అంటుంది హిమ. డబ్బులు తీస్తుంది. దీంతో ఏం అక్కర్లేదు. నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి అంటుంది శౌర్య.

ఇద్దరి దగ్గర ఉన్న డబ్బులను లాక్కొని ఓ దొంగోడు పరిగెత్తుతూ ఉండగా.. వాడిని ఛేదిస్తూ ఇద్దరూ కార్తీక్ మీద పడతారు. కార్తీక్ ను చూసి సంతోషిస్తారు హిమ, శౌర్య. వాళ్లను దగ్గరికి తీసుకొని ముద్దాడుతారు కార్తీక్. ఆ తర్వాత వాళ్లను ఇంటికి తీసుకెళ్తుండగా సౌందర్య, దీప కూడా కనిపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

51 minutes ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

2 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

3 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

4 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

12 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

13 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

14 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

15 hours ago