Karthika Deepam hero and heroine remuneration for serial
Karthika Deepam 12 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జనవరి 2023, గురువారం ఎపిసోడ్ 1560 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంద్రుడు, చంద్రమ్మ.. ఇద్దరూ శౌర్యను చూడటానికి వస్తారు. రండి బాబాయి, పిన్ని.. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది శౌర్య. దీంతో మేము పాత ఇంటికి వెళ్లాం అంటారు. ఆ తర్వాత అమ్మానాన్నలు దొరికారు అని చెబుతుంది శౌర్య. దీంతో ఇంద్రుడు, చంద్రమ్మ ఇద్దరూ టెన్షన్ పడతారు. అదేంటి అమ్మానాన్నలు దొరికారు అంటే సంతోషించాలి కానీ.. ఇలా టెన్షన్ పడుతున్నారేంటి అని అడుగుతుంది శౌర్య. దీంతో అదేం లేదమ్మా.. నాకు కూడా సంతోషంగా ఉంది అంటాడు ఇంద్రుడు.
karthika deepam 12 january 2023 full episode
పైన ఉన్నారు పదా అని చెప్పి ఇంద్రుడు, చంద్రమ్మ ఇద్దరినీ లోపలికి తీసుకెళ్తుంది శౌర్య. సౌందర్యతో మాట్లాడుతారు. ఆ తర్వాత కార్తీక్, దీప కూడా వస్తారు. ఇంద్రుడు, చంద్రమ్మను పరిచయం చేస్తుంది శౌర్య. అంతా కలిసిపోతారు. ఇప్పటి నుంచి పిన్ని, బాబాయి కూడా ఇద్దరూ మాతోనే ఉంటారు అంటుంది శౌర్య. దీంతో అయ్యో.. ఇక్కడ ఎందుకు ఉండటం అని అంటారు కానీ.. శౌర్య అస్సలు వినదు. ఖచ్చితంగా మాతో పాటే ఉండాల్సిందే అంటుంది శౌర్య. దీంతో అందరూ కలిసిపోతారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఈసందర్భంలో అందరం ఇక్కడే సంక్రాంతి పండుగ చేసుకుందాం. ఆ తర్వాతే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దాం అంటుంది శౌర్య. దీంతో అందరూ సంక్రాంతి సంబురాలు స్టార్ట్ చేస్తారు.
ఆ తర్వాత హేమచంద్ర కూడా అక్కడికి వచ్చి దీపను అక్కడ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కారులో కార్తీక్ వెళ్తూ అందరూ కలిసిపోయారు సంతోషంగా ఉన్నాం కానీ.. అసలు దీప పరిస్థితి ఎలా చెప్పాలి అని అనుకుంటాడు.
ఇంతలో తన కారుకు అడ్డంగా మోనిత కారు పెడుతుంది. నువ్వు రోడ్డుకు అడ్డంగా కారు ఎందుకు పెట్టావు అని కారు దిగి అడుగుతాడు. దీంతో నేను నీతో మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు నాతో కలిసి రెస్టారెంట్ కు రా అంటుంది.
దీంతో.. నేను రాను అంటాడు. దీంతో వెంటనే ఆంటీకి ఫోన్ చేసి నీ కోడలు త్వరలో చచ్చిపోతుంది అని చెబుతా అంటూ కార్తీక్ ను బెదిరిస్తుంది. దీంతో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇక్కడే చెప్పు. లేకపోతే వెళ్లిపో అంటాడు కార్తీక్.
నువ్వు నాతో రెస్టారెంట్ కు రావాల్సిందే. అది కూడా నా కారులో. లేదంటే నేను ఇప్పుడే ఆంటికి ఫోన్ చేసి చెప్తా అంటుంది మోనిత. దీంతో అక్కర్లేదు వస్తా అని చెప్పి మోనితతో కలిసి కారులో వెళ్తాడు కార్తీక్.
కట్ చేస్తే చంద్రమ్మ.. దీపకు కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తుంది. సార్ ఇచ్చి వెళ్లారు. ఇవి వేసుకోండి దీపమ్మ. మిమ్మల్ని కాపాడుకోవడానికి సార్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో తెలుసు కదా. మీరే మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటుంది చంద్రమ్మ.
మీరు పొద్దున లేచినప్పటి నుంచి వంట గదిలోనే ఉంటున్నారు. వేడి పడదు అంటుంది చంద్రమ్మ. దీంతో అయితే ఏంటి.. నా పిల్లల కోసం నేను ఇదంతా చేస్తున్నా అంటుంది దీప. వద్దమ్మ.. మీరు దూరం ఉండండి. నేను వంట చేస్తా అంటుంది.
కట్ చేస్తే కార్తీక్, దీప ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్తారు. చెప్పు అంటాడు. సారీ కార్తీక్. నాతో ప్రేమగా ఉండు కార్తీక్. దానికి ఎందుకు చిరాకు పడతావు అంటుంది మోనిత. దీంతో మోనిత.. పాయింట్ కు రా అంటాడు.
నువ్వు నాకు దక్కేలా లేవు. రేపు దీప ప్రాణాలు పోయినా సరే నన్ను దగ్గరకు రానివ్వవు అని తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను కార్తీక్ అంటుంది మోనిత. దీప చనిపోదు. నేను చనిపోతాను అంటుంది మోనిత.
నా గుండెను దీపకు ఇచ్చేస్తా. కానీ.. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.