karthika deepam 7 october 2021 latest episode
Karthika Deepam 12 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదల అయింది. 12 అక్టోబర్, 2021 మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాతో మాట్లాడొద్దు నాన్నా.. నన్ను ముట్టుకోవద్దు నాన్నా అని వార్నింగ్ ఇస్తుంది హిమ. మోనిత ఆంటితో నువ్వు మాట్లాడిన విషయాలు అన్నీ నేను విన్నాను అని చెబుతుంది హిమ. దీంతో హిమ.. నేను ఏం తప్పు చేయలేదురా.. అని చేతులెత్తి వేడుకుంటాడు కార్తీక్. అయినా కూడా హిమ నమ్మదు. మీరే కావాలని అబద్ధాలు చెబుతున్నారు నాన్నా.. నేను మిమ్మల్ని నమ్మను డాడీ అని చెప్పి హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
karthika deepam 12 oct 2021 full episode
కట్ చేస్తే మోనిత జైలులో కూర్చొని తెగ సంతోషపడుతుంది. దీపక్క ఇక నీ ఖేల్ ఖతం దీపక్క. దీప.. నీకు మనశ్శాంతి అడ్రస్ లేకుండా పోతుంది. అందరూ కలిసి గొడవ పడతారో… గొళ్లుమని ఏడుస్తారో మీ ఇష్టం. కానీ.. కార్తీక్ కు నన్ను రెండో భార్యగా ఒప్పుకోవడం తప్ప మీకు ఇంకో దారే లేదు దీపక్క. నువ్వు ఫసక్ దీపక్క.. అని తనలో తాను అనుకుంటుంది మోనిత.
కార్తీక్ ఒంటరిగా కూర్చొని తనలో తానే మథనపడుతుంటాడు. ఇంతలో సౌందర్య, దీప అక్కడికి వస్తారు. నా పిల్లలు పెద్దవాళ్లు అయిపోయారు అని అంటాడు. మోనిత ఆసుపత్రికి వచ్చినట్టు తను చూసినట్టు నాకు తెలియదు.. అంటాడు. కనీసం దీపకు అయినా మోనిత ఆసుపత్రికి వచ్చిన విషయం చెప్పాలి కదా అని సౌందర్య అనగానే.. మళ్లీ ఆ విషయం చెప్పి తనను బాధపెట్టడం ఎందుకు అని అంటాడు కార్తీక్.
దీంతో.. ఆదిత్య ఆవేశపడతాడు. ఇదే నేను చెప్పేది. అందరూ ఎవరి బాధ వాళ్లలో దాచుకుంటే ఇలాగే ఉంటది. ఎవరి మనసులోనిది వాళ్లే దాచుకుంటారా? అన్నీ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇలా హిమ ఇప్పుడు మాట్లాడి ఉండేది కాదు కదా. అందరి ముందు ఓపెన్ గా మాట్లాడుకుంటే.. ఎటువంటి ఇబ్బందులు ఉండవు.. అందరూ కలిసి హ్యాపీగా అమెరికా వెళ్లిపోవచ్చు అని చెబుతాడు ఆదిత్య.
మోనిత ఆసుపత్రికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతుంది దీప. ఇంతలో హిమ వచ్చి అమ్మ మనం ఇక్కడ ఉండొద్దు. బస్తీకి వెళ్లిపోదాం అంటుంది హిమ. ఏమైందమ్మా అంటుంది దీప. ఈ ఇల్లు నాకు నచ్చలేదు అంటుంది దీప. నాకు డాడీ నచ్చడం లేదు అంటుంది. డాడీ బ్యాడ్ బాయ్. అన్నీ అబద్ధాలు చెబుతున్నాడు అంటుంది. ఏంటమ్మా నువ్వు డాడీ గురించి అలా అనొచ్చా.. తప్పు కదా అంటుంది. ఏంటి తప్పు అమ్మా.. డాడీ తప్పు చేస్తున్నా నువ్వు మాకు ఎందుకు చెప్పడం లేదమ్మా అంటుంది హిమ. డాడీ అన్నీ చేస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటుంది.
పేరోల్ మీద విడుదల చేసే అవకాశాలు లేవా? అని జైలర్ ను అడుగుతుంది మోనిత. కష్టం అమ్మా.. చూద్దాం.. ప్రయత్నిద్దాం.. అని చెబుతుంది జైలర్. ఇక.. కార్తీక్ ఇంకా హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సమస్యకు అమెరికా వెళ్లిపోవడం ఒక్కటే మార్గం అంటాడు ఆదిత్య. ఇంతకన్నా మంచి పరిష్కారం మీ దగ్గర ఉందా? లేదు కదా.. ఈ సమస్యకు పరిష్కారం ఇదొక్కటే.. అని అంటాడు ఆదిత్య. ఇలా ప్రతిరోజు పిల్లలు ఏదో అన్నారని.. ఇంకేదో జరిగిందని బాధపడుతూ కూర్చోవడం కన్నా… వెళ్లడమే కరెక్ట్ అంటాడు ఆదిత్య.
karthika deepam 12 oct 2021 full episode
అమెరికాలో స్వప్న అక్క ఇల్లు అలాగే ఉందట. ఇంకా అది అమ్మలేదట. మీరు అందులో ఉండొచ్చు. స్వప్న అక్కతో నేను మాట్లాడుతాను.. అంటాడు ఆదిత్య. మమ్మీ నువ్వేంటి మాట్లాడటం లేదు.. అంటాడు ఆదిత్య. నేనేం మాట్లాడాలి అంటుంది సౌందర్య. ఇంతలో దీప మాట్లాడుతూ… పిల్లలు ఇక్కడ ఉండలేం అంటున్నారు. మళ్లీ బస్తీకి వెళ్దాం అంటున్నారు.. అని చెబుతుంది దీప. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నేనేం పాపం చేశాను.. అని తనలో తానే బాధపడతాడు కార్తీక్.
కట్ చేస్తే.. హిమ, శౌర్య ఇద్దరూ బ్యాగులు సర్దుకొని వెళ్లిపోవడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తారు. నాన్న మాకు వద్దు.. అని దీపతో అంటారు. కార్తీక్ కూడా బ్యాగులు చూసి షాక్ అవుతాడు. నాన్న మీకు వద్దా అనగానే కార్తీక్ నుంచి దూరంగా వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
Farmers : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
Cucumber : మీరు రిఫ్రెషింగ్, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే కీర దోసకాయలు ఒక గొప్ప ఎంపిక. వాటిలో కేలరీలు…
This website uses cookies.