
karthika deepam 14 october 2021 full episode
Karthika deepam 15 oct today episode : కార్తీకదీపం దసరా ఎపిసోడ్ సర్వత్రా ఉత్కంఠగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో కార్తీక్.. దీపకు ఓ షాకింగ్ నిజాన్ని చెబుతాడట. అది విని దీప తనను కంట్రోల్ చేసుకోలేనంతగా ఏడుస్తుందని తెలిసింది. అదేంటో మీరూ తెలుసు కోవాలనుకుంటున్నారా.. అయితే ఎందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.. కార్తీకదీపం సీరియల్ దసరా రోజున 1,171వ ఎపిసోడ్‌లో అడుగు పెట్టనుంది. ఎపిసోడ్ ప్రారంభం కాగానే కార్తీక్ తన కూతురు హిమకు పాలు ఇవ్వాలని దీపను ఆమె రూంలోకి పంపించిన విషయం మీకు తెలిసిందే కదా.. ఆ టైంలో హిమ ‘అమ్మా నాన్న నిన్ను మోసం చేశాడు కదా.. అతనో మోసగాడు.. మనందరినీ మోసం చేశాడని’ అనేస్తుంది. అది విన్న కార్తీక్ బాధతో ఏడుస్తూ మెట్లు దిగి కిందకు వెళ్లిపోతాడు. హిమ మాటలు పదే పదే వినిపిస్తుంటంతో చెవులు మూసుకుని ఒక్కసారిగా ‘నో.. నేను మోసగాడిని కాదని, ఎవరినీ మోసం చేయలేదని’ గట్టిగా అరుస్తాడు..
karthika deepam 14 october 2021 full episode
ఆ సౌండ్స్‌కు దీప, హిమ, సౌర్య, సౌందర్య, శ్రావ్య, ఆదిత్య అంతా అక్కడికి వచ్చేస్తారు. దీప వెంటనే మెట్లు దిగి కార్తీక్ దగ్గరకు వస్తుంది. ‘నేను మోసగాడిని కాదు కదా మమ్మీ’ అంటూ కార్తీక్ బాధపడే సన్నివేశం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ‘దీపా నువ్వైనా చెప్పు.. నేను నిన్ను మోసం చేశానా’ అని అడుగుతాడు. దీప లేదన్నట్టుగా తల ఊపుతుంది.కార్తీక్ బాధను చూసిన దీప ‘ఒసేయ్ హిమా ఎందుకే ఇలా మాట్లాడుతావ్’ అని కింద నుంచే పైనున్న కూతురిని తిడుతుంది. సౌందర్య కోపంతో ‘పిల్లలు ఏంటో ఛీ.. ఏం మాట్లాడాలో తెలీదు.. అని తిడుతూనే.. ‘రేయ్ కార్తీక్ నువ్వు బాధపడొద్దురా.. అని సముదాయిస్తుంది. కార్తీక్‌ను తీసుకుని వెళ్లాలని దీపకు చెప్పడంతో ఇద్దరూ రూమ్‌లోకి వెళ్లిపోతారు. దీప కార్తీక్‌ను ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది.
జైలులో ఉన్న మోనిత వెర్షన్.. ‘నన్ను జైలుకు పంపించి మీరు సంతోషంగా ఉందామనుకున్నారా? అది ఎప్పటికీ జరగనివ్వను. కార్తీక్ రోజు టెన్షన్ పడాలి. నా దగ్గరకు రావాలనుకుంటూ నవ్వుకుంటుంది.దీప కార్తీక్‌ను ఓదార్చే ప్రయత్నం చేయగా ‘నాకు తెలుసులే దీపా.. పిల్లలు అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకుంటావ్ అని అంటాడు. దీప మాట్లాడుతూ .. ‘మీకు రోగమేంటో తెలుసు డాక్టర్ బాబు కానీ.. వైద్యం చేయకుండా చూస్తూ ఉండిపోయారని దీప కార్తీక్ చేసిన మిస్టేక్స్‌ను ఎత్తి చూపించే ప్రయత్నం చేయగా.. ‘దీపా.. ఏం చేయాలో నువ్వు నాకు చెబుతావా అని కార్తీక్ దీనంగా చూస్తాడు.
karthika deepam 14 october 2021 full episode
‘డాక్టర్ బాబు.. ఆ మోనిత గురించి తెలిసినా మీరు ఏం చేశారు చెప్పండి.. మీరు జైల్లో ఉండగా టీ అమ్మాయిగా.. ఇప్పుడు కలర్ చీర కట్టుకుని.. హాస్పిటల్లో రీనాగా ఎలా అంటే అలా మిమ్మల్ని కలిసింది. అయినా మీరేం చేయలేదు. ఆమె జైలుకు వెళ్లే రోజున ఇది క్లైమాక్స్ కాదని.. రీ ఎంట్రీ ఇస్తానని చెప్పినా మీరు ఏం మాట్లాడలేదని దీప కార్తీక్‌ను నిలదీస్తుంది. కార్తీక్ బాధపడుతూ.. ‘దీపా నీకు మోనిత గురించి పూర్తిగా తెలియదు..
ఆమె చాలా డేంజర్.. ఆదిత్యకు యాక్సిడెంట్ జరగలేదు.. అది మోనితనే కావాలని చేయించింది.’ అని కార్తీక్ అసలు నిజం చెప్పడంతో దీప షాక్ అవుతుంది. అది విని నాన్‌స్టాప్‌గా ఏడ్చేస్తుంది.‘నిజం బయటకు చెబితే అది మన పిల్లల్ని చంపేస్తానని బెదిరించింది. అందుకే నేను ఏమీ మాట్లాడలేదు. నాకు నువ్వు, మన పిల్లలు కావాలి దీపా.. ఒకసారి మిమ్మల్ని దూరం చేసుకున్నా.. మళ్లీ చేసుకోలేనని కార్తీక్ బాధపడుతూ చెప్పడంతో దీప ఇంకా కన్నీళ్లు ఆపుకోలేదు. తర్వాత ఏం జరుగుతుందో తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం..
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
This website uses cookies.