Home » News » Karthika Deepam 2 March 13th 2026 Today Friday Episode Highlights In Telugu
News

Karthika Deepam 2 March 13th 2026 Today Episode : తనపై నింద వేసుకున్న దీప.. డాక్టర్ వాయిస్ రికార్డ్‌తో జ్యోత్స్న బిగ్ స్కెచ్, అంతా షాక్!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 13, 2026, 8:51 am
Advertisement

Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ ‘కార్తీక దీపం 2’ (Karthika Deepam 2) రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసేలా సరికొత్త మలుపులతో కథనం సాగుతోంది. ఈరోజు (మార్చి 13) ఎపిసోడ్‌లో ఊహించని షాకింగ్ ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. దీపను రక్షించడానికి దశరథ మౌనంగా ఉండిపోవడం, తన భర్త కార్తీక్ మీదకు నింద వెళ్లకుండా దీప ఆ తప్పును తన నెత్తిమీద వేసుకోవడం, దానికి తోడు జ్యోత్స్న ఆడిన మైండ్ గేమ్.. ఈ ఎపిసోడ్‌ను హైలైట్‌గా నిలబెట్టాయి. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

Advertisement

Karthika Deepam 2 March 13th 2026 Today Episode : తనపై నింద వేసుకున్న దీప.. డాక్టర్ వాయిస్ రికార్డ్‌తో జ్యోత్స్న బిగ్ స్కెచ్, అంతా షాక్!

Karthika Deepam 2 March 13th 2026 Today Episode భయంతో వణికిపోయిన దశరథ.. దీప ప్రాణాల కోసం మౌనం

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. దశరథ అందరి ముందు నిజం చెప్పేస్తాడేమో అని అంతా అనుకుంటారు. కానీ, తన కళ్ల ముందే జ్యోత్స్న తుపాకీతో దీపను కాల్చి చంపేసినట్లు దశరథ ఊహించుకుంటాడు. ‘దీపను బతకనివ్వను, చంపేస్తాను’ అని గతంలో దాసుతో జ్యోత్స్న అన్న మాటలు దశరథ చెవుల్లో మార్మోగుతాయి. ఒకవేళ ఇప్పుడు తను నిజం చెప్తే, జ్యోత్స్న ఏ క్షణంలోనైనా దీప ప్రాణాలు తీస్తుందేమో అన్న భయం దశరథను వెంటాడుతుంది. దీంతో ‘నో’ అని గట్టిగా అరుస్తూ, నిజం చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. దీప ప్రాణాలను కాపాడటానికే దశరథ మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు జ్యోత్స్న.. “నువ్వెందుకు దీపను నిజం చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నావు? చూస్తుంటే నాకు నీ మీదే అనుమానం వస్తోంది” అని దశరథను ఉద్దేశించి అంటుంది.

Advertisement

Karthika Deepam 2 March 13th 2026 Today Episode కార్తీక్‌పై కాంచన, శివన్నారాయణల ఫైర్

దీప, కార్తీక్‌లు అబద్ధం చెబుతున్నారని ఇంట్లో వాళ్లందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో పారిజాతం తనదైన శైలిలో కాంచనను రెచ్చగొడుతుంది. “నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని నీకు స్పష్టంగా అర్థమైంది. అందుకు నీ కొడుకు కూడా సపోర్ట్ చేశాడని కూడా తెలుస్తోంది. అసలు నిజాలు బయటపడాలంటే దీపనే అడగాలి” అని పారిజాతం అంటుంది. అప్పుడు శివన్నారాయణ కూడా కలుగజేసుకుని, “డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూశాక మీపై (దీప, కార్తీక్) నాకు పూర్తిగా నమ్మకం పోయింది” అని తేల్చి చెబుతాడు. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని కార్తీక్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కాంచన వినదు. “అసలు ఈ తప్పు జరగడానికి మూలకారణం దీప కాదు, కార్తీక్” అని కాంచన బాంబ్ పేలుస్తుంది. “కడుపులో బిడ్డకు సమస్య ఉందని కన్నతల్లికే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిన్ను అన్ని విషయాల్లో వెనకేసుకొచ్చి తప్పంతా చేసింది వీడే” అంటూ కొడుకు కార్తీక్‌పై కాంచన తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. “నిజం చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి కదిలావో, నన్ను చంపినంత ఒట్టే” అని కాంచన అనడంతో కార్తీక్, దీప ఇద్దరూ షాక్ అవుతారు.

కార్తీక్ కోసం నిందను తనపై వేసుకున్న దీప

తన అత్త కాంచన తన బావ (కార్తీక్)ను నిలదీస్తుండటం దీప చూడలేకపోతుంది. అత్తయ్య ఆవేదనను అర్థం చేసుకున్న దీప.. కార్తీక్‌ను రక్షించడం కోసం ఒక పెద్ద అబద్ధం చెబుతుంది. “బావ ఏం చెప్పలేడు అత్తయ్యా.. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డను నేనే వద్దనుకుంటున్నాను. ఈ బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు” అని దీప చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. దీప లాంటి ఒక తల్లి ఇలాంటి మాట మాట్లాడిందని విని పారిజాతం ఎకసెక్కాలు ఆడుతుంది. “ఆడ పుట్టుక పుట్టిన ఏ ఆడకూతురైనా బిడ్డను వద్దనుకుంటుందా?” అని పారిజాతం అంటుంది. అయినా సరే దీప వెనక్కి తగ్గకుండా, “నేను బిడ్డను కనలేను, అందుకే బిడ్డ వల్ల నాకు సమస్య ఉందని బావతో అబద్ధం చెప్పించాను” అని తప్పు మొత్తం తనపైనే వేసుకుంటుంది. దీప త్యాగానికి కార్తీక్ మనసులో ఎంతో మథనపడతాడు.

Advertisement

సింధూరం చెరిపేయమన్న కావేరి.. స్వప్న ఆవేదన

సీరియల్‌లో మరోవైపు కాశీ, స్వప్నల మధ్య కూడా తీవ్రమైన ఎమోషనల్ డ్రామా నడుస్తోంది. దాసు వాళ్ళిద్దరినీ కలిసి “మీకు ఈరోజు పెళ్లి రోజు అని గుర్తుందా?” అని అడుగుతాడు. దానికి స్వప్న “ఇది గుర్తుంచుకునేంత గొప్ప రోజు కాదు” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది. దీంతో ఆగ్రహించిన కావేరి.. “నీకు భర్త అనే పదమే బరువైనప్పుడు పాపిట్లో సింధూరం ఎందుకు? ఆ సింధూరాన్ని చెరిపేయ్.. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడం కంటే ఇది తేలికైన పనే కదా” అని ఫైర్ అవుతుంది. అప్పుడు స్వప్న స్పందిస్తూ, “ఈ పరిస్థితికి కాశీ కూడా కారణమే. నమ్మకాన్ని సంపాదించుకోవడం కష్టం, పోగొట్టుకోవడం చాలా సులువు. ఆ విషయం మీరే ఆలోచించండి. మీకు ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను” అని తెగేసి చెబుతుంది. ఇద్దరి మధ్య దూరం తగ్గించడానికి దాసు వాళ్ళిద్దరినీ కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్తాడు.

డాక్టర్ వాయిస్ మెసేజ్‌తో జ్యోత్స్న బిగ్ ట్విస్ట్!

మళ్లీ మెయిన్ ట్రాక్‌లోకి వస్తే.. “బిడ్డను వద్దనుకోవడానికి కారణం ఏంటి? నా కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెడతానని నాకు ఎందుకు మాట ఇచ్చావు?” అని కాంచన దీపను కన్నీళ్లతో నిలదీస్తుంది. సరిగ్గా అదే సమయానికి జ్యోత్స్న అసలు ఆట మొదలుపెడుతుంది. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి డాక్టర్ పంపిన వాయిస్ మెసేజ్‌ను అందరి ముందు ప్లే చేస్తుంది. “దీప ఈ బిడ్డను వద్దనుకుంటే, ఆమె తన జీవితంలో మళ్లీ ఎప్పటికీ తల్లి కాలేదు” అని ఆ డాక్టర్ చెప్పిన వాయిస్ మెసేజ్ వినగానే ఇల్లంతా నిశ్శబ్దం ఆవహిస్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. “ఇంత బుద్ధిలేని నిర్ణయం ఎలా తీసుకున్నావు దీప?” అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు.

నిర్ణయం నాదే అన్న కార్తీక్.. పారిజాతం వేసిన చివరి బాంబ్!

అందరూ దీపను తప్పుబడుతున్న సమయంలో కార్తీక్ రంగంలోకి దిగుతాడు. “నింద నీ ఒక్కదాని మీదే వేసుకోకు దీప. మేం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అసలు నిర్ణయం నాదే, దీపది కాదు” అని తేల్చి చెబుతాడు. కార్తీక్ మాటలకు అందరూ మరింత షాక్ అవుతారు. అప్పుడు శివన్నారాయణ కలుగజేసుకుని, “ఏదో వస్తువును వదిలేసుకున్నంత తేలికగా బిడ్డను వదిలేసుకుంటారా? అది ప్రాణం. ఈ ఇంటి నాలుగో తరం. మీ అత్తకు బ్లడ్ క్యాన్సర్. ఇక్కడ ఓ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఇంతలా పరితపిస్తుంటే, ఒక ప్రాణాన్ని ఎలా వద్దనుకుంటారు?” అని ఎమోషనల్ అవుతాడు. అదే సమయంలో జ్యోత్స్న, శివన్నారాయణను రెచ్చగొడుతూ.. దశరథను ప్రశ్నించమని అడుగుతుంది. “దీప కడుపులో పెరుగుతున్నది మా అమ్మ అని చెప్పావు కదా, మరి ఇప్పుడు నీ కూతురు, అల్లుడు కలిసి ఆ అమ్మను చంపుతాం అంటుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు?” అని కాంచన, శివన్నారాయణలు దశరథను నిలదీస్తారు.

ఎపిసోడ్ చివరలో పారిజాతం ఎవరూ ఊహించని ఒక బాంబ్ పేలుస్తుంది. “మీరు ఎంత అడిగినా వాడు (దశరథ) ఏమీ మాట్లాడలేడు. ఎందుకంటే దీప తన బిడ్డను వదులుకుంటున్నదనే విషయం మీ అన్నయ్యకు ముందే తెలుసు” అని పారిజాతం అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఈ మాటతో కాంచనతో సహా అందరూ బిత్తరపోతారు. “ఈ నిజం ఎప్పుడో తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకు దాచావు?” అని శివన్నారాయణ దశరథపై తీవ్ర స్థాయిలో మండిపడతాడు.

Advertisement

ఈ ఉత్కంఠభరితమైన సీన్‌తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తదుపరి ఎపిసోడ్‌లో దశరథ తన మౌనం వీడి జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయటపెడతాడా? కార్తీక్, దీపల ఈ నిర్ణయాన్ని కాంచన అంగీకరిస్తుందా? అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి