Karthika Deepam 16 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1198 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వదిన.. ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అంటాడు ఆదిత్య. అడిగావా.. ఏంటి ఇంకా ఎవరు అడగలేదు అనుకుంటున్నా. నాకు నీలాగా చదువు లేదు కదా. ఇలా ప్రతిక్షణం.. నన్ను నేనే సంతోషంగా ఉంచుకోవాలని కొత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ఎప్పుడూ ఏడుపు మొహం పెట్టుకొని కనిపిస్తే అందరూ ఇంకా ఏడిపిస్తున్నారు అంటుంది దీప.
అమ్మా ఎప్పుడు నువ్వు ఇలాగే ఆనందంగా ఉండొచ్చు కదా అని అడుగుతుంది శౌర్య. దీంతో ఇక నుంచి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను కానీ… నన్ను ఉండనిస్తే అంటుంది. ఇప్పుడు నాకు అందరూ చిన్న సాయం చేయాలి. నేను చేసిన వంటలకు మార్కులు ఇవ్వండి అని అడుగుతుంది. ఏంటమ్మా ఇది నువ్వు వంటలు బ్రహ్మాండంగా చేస్తావు కదా.. అంటే ఏదో నా సంతృప్తి కోసం అని అడుగుతుంది. సరే.. అందరూ వద్దులే.. అత్తయ్య గారు, మామయ్య గారు, డాక్టర్ బాబును అడుగుతాను అంటుంది. ముగ్గురిని ఎన్ని మార్కులు వేస్తారు అని అడుగుతుంది. డాక్టర్ బాబు.. మాత్రం చెప్పడానికి ఆలోచిస్తాడు. చివరకు పదికి పది అంటాడు.
అబద్ధాలు చెబుతున్నారు డాక్టర్ బాబు మీరు. అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. గుత్తి వంకాయ కూర ఈరోజు సరిగ్గా కుదరలేదు. 10కి 10 అంటే అబద్ధమే కదా అంటూ పిచ్చిదానిలా నవ్వుతుంది దీప. సరే.. పాయసం తెస్తాను ఉండండి అంటుంది దీప. వంటల్లో పాస్ చేశారని.. జీవితంలో ఫెయిల్ చేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
కట్ చేస్తే.. మోనిత రెడీ అవుతుంది. ఇంతలో ప్రియమణిని పిలిచి.. తిడుతుంది. బట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశావు. ఇల్లు నీటుగా ఉండాలి కదా… అంటూ క్లాస్ పీకుతుంది. అమ్మా.. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా.. అంటే అవును వస్తున్నారు ప్రియమణి. ముఖ్యమైన గెస్ట్.. ఆ గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతావు అంటుంది మోనిత.
మరోవైపు ఆదిత్య.. మోనిత ఇంటికి వస్తాడు. అన్నయ్య ఎక్కడ అని అడుగుతాడు. అన్నయ్య వస్తాడు అని చెప్పావు అంటాడు. అలా అబద్ధం చెబితే కానీ నువ్వు రావని తెలిసి అలా చెప్పా అంటాడు. ఆగు ఆదిత్య.. నీకు కొన్ని విషయాలు చెప్పాలి.. అంటుంది. నాకు బాబు పుట్టాడు. ఆనంద రావు అని పేరు పెట్టుకున్నా అని చెబుతుంది మోనిత.
పిల్లాడిని ఎత్తుకో అంటూ అవసరం లేదు అంటాడు. దీంతో పిల్లాడని తీసుకొని లోపలికి వెళ్లు ప్రియమణి అంటుంది మోనిత. ఆ తర్వాత ఆదిత్యకు అసలు నిజం చెబుతుంది. మీ అన్నయ్యే నాకు డెలివరీ సమయంలో సంతకం చేశాడు. తర్వాత దోష నివారణ పూజలో కూర్చున్నాడు. నాతో పాటు నా పక్కన కూర్చొని పూజ చేశాడని ఆ ఫోటోలను కూడా చూపిస్తుంది మోనిత.
దీంతో ఆదిత్య షాక్ అవుతాడు. ఆదిత్యకు ఏం చేయాలో అర్థం కాదు. అన్నయ్య ఎందుకిలా చేశాడు అని అనుకుంటాడు. మీ ఇంట్లో వాళ్లకు నువ్వే నచ్చజెప్పు ఆదిత్య. నన్ను కోడలుగా ఇంటికి తీసుకెళ్లమను. కావాలంటే ఆ ఇంట్లో దీపక్కను కూడా ఉండమను. నాకేం ప్రాబ్లమ్ లేదు అని చెబుతుంది మోనిత. దీంతో ఏం మాట్లాడకుండానే ఆదిత్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రోడ్డు మీద కార్తీక్ కనిపించడంతో వెంటనే ఆపి.. అన్నయ్య అసలు నీకు బుద్ధి ఉందా? ఏంటి నువ్వు.. ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా? ఆసుపత్రికి వెళ్లి సంతకం పెడతావు.. మోనితతో కలిసి పూజలో పాల్గొన్నావు.. ఇప్పుడు ఏం మాట్లాడుతావు. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా మోనిత బిడ్డను కన్నదేమో అని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ.. ఇప్పుడు అది కూడా కాదని తెలిసింది.. అంటూ కార్తీక్ పై ఆదిత్య సీరియస్ అవుతాడు.
దీంతో నీకు దండం పెడతాను ఆపరా బాబు అంటాడు కార్తీక్. అవన్నీ అబద్ధాలు. నేను తాగినంత మాత్రాన ఒళ్లు తెలియకుండా ప్రవర్తించలేదు. దీపంటే నాకు ప్రాణంరా.. అంటాడు. అయితే.. హాస్పిటల్ కు వెళ్లి సంతకం ఎందుకు చేశావు అంటే.. మోనిత చావు బతుకుల్లో ఉందని సంతకం పెట్టా అంటాడు. అన్ని నిజాలు చెప్పినా ఆదిత్య వినడు.
Barly Water Benefits : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మరియు ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో తెలియజేయునది ఏమనగా, ఫిబ్రవరి మాసంలో అనేక ఖగోళ యాదృచ్ఛికాలు జరగనున్నాయి. అయితే శని…
RRB Railway Recruitment : రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల్లో 32,438 గ్రూప్-డి…
Tea : మన టీ ప్రియులు, ఉదయం లేవగానే వేడి వేడిగా ఒక కప్పు టీ తాగకపోతే రోజువారి దినచర్య…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి Ysrcp వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలే ఒక్కొక్కరే…
Zodiac Signs : రాబోయే నెలలో ముఖ్యమైన గ్రహాలన్నీ రాశి సంచారం చేయబోతున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన సూర్య భగవానుడు…
Sravanthi Chokarapu : పింక్ శారీలో అందం ఉట్టిపడేలా స్రవంతి చొక్కారపు ఫోటోస్..!
Samantha : సమంత ఈ లుక్స్‌కి ఎవరైనా పడాల్సిందే.. ఫోటోస్..!
This website uses cookies.