Home » Entertainment » Karthika Deepam 17 October 2022 Full Episode
Entertainment

Karthika Deepam 17 Oct Today Episode : మౌనితకి చుక్కలు చూపిస్తున్న దీప, దుర్గా… భయపడుతు దుర్గ కాళ్ల మీద పడ్డ మౌనిత…!

Authored By
aruna
The Telugu News | Published on: October 17, 2022, 10:00 am
Advertisement

Karthika Deepam 17 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1485 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దుర్గ, మోనితతో దీపని చంపించడం కోసం మనుషులు పెట్టావ్ అది ఫెయిల్ అయిపోయింది కదా.. అయినా దీప మనకు అడ్డమేంటి కార్తీక్ కదా మనిద్దరికీ అడ్డం అయితే కార్తీక్ కోసం కదా నువ్వు మనుషుల్ని పంపించాల్సింది అని కార్తీక్ అనుమానం వచ్చేలా చేస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత నీకు దండం పెడతాను రా ఇక్కడనుంచి వెళ్ళిపో అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గ ఇంట్లో కార్తీక్ ఉన్నాడా ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా సరే తర్వాత వస్తానులే అని దుర్గా వెళ్ళిపోతాడు. ఇక అంతలో కార్తీక్ మౌనిత దగ్గరికి వస్తాడు. మనుషుల్ని పంపించలేదన్నవు మోనిత ఇప్పుడు దుర్గ అదే చెప్తున్నాడు అయినా అసలు దీప ని ఎందుకు చంపాలి అనుకున్నావ్… నా వెంట ఎవరు పడ్డ ఇలాగే చంపేస్తావా.. అసలు దీప నా భార్య అనగానే… మౌనిత ఇదంతా అబద్ధం కార్తీక్ వాడు కావాలనే చేస్తున్నాడు అని అంటుంది.

Advertisement

అప్పుడు కార్తీక్ పదేపదే అదే చెప్తే నిజం అయిపోదు మోనిత నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మౌనిక భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే డాక్టర్ కి మౌనిత తనని చంపాలనుకుంది అన్న విషయాన్ని చెప్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అవునా అంటూ తనకు ధైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు దీప అది ఇంతకుముందు ఇలా చేసేది కాదు అన్నయ్య ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఇంత దారుణానికి ఓడి కట్టలేదు కానీ ఇప్పుడు ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ నువ్వు ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమి లేదమ్మా కార్తిక్ కి తను చేసిందంతా తెలిసింది కదా ఇక మౌనిత కార్తీక్ దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తూ తన నిరూపించుకోవాలని చూస్తూ ఉంటుంది అని దీపకి ధైర్యం చెబుతూ ఉంటాడు. కట్ చేస్తే కార్తిక్ సౌర్యని ఎతుకుంటూ వచ్చి అక్కడున్న అతన్ని ఇక్కడొక పాప బొమ్మల అమ్ముకునేది కదా ఇప్పుడు లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అతను ఇక్కడ ఎవరు బొమ్మల అమ్మలేదండి అని అంటాడు. అప్పుడు కార్తీక్ వినాయకుడు బొమ్మలు అమ్మారు వాళ్లు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అతను ఇక్కడ అలా వచ్చినవాళ్లు ఎక్కువ రోజులు అమ్మరండి వాళ్లు కొన్ని రోజులు అమ్ముతారు తర్వాత వెళ్ళిపోతారు అని చెప్తాడు.

karthika deepam 17 october 2022 full episode

Advertisement

అప్పుడు బొమ్మల అమ్ముకోవాల్సిన కర్మ నీకు పట్టిందా తల్లి నువ్వు నాయనమ్మ వాళ్ళ దగ్గర ఎందుకు లేవు అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే దుర్గ మళ్లీ మౌనిత దగ్గరికి వచ్చి ఒక ఆట ఆడుకుంటూ ఉండగా… మౌనిత దుర్గ కాలపై పడి నీకేం కావాలో చెప్పురా నీకు ఏ ఏమైనా ఇస్తాను అంటూ ఉంటుంది. అప్పుడు దుర్గ దీప నవ్వుతూ ఏమైనా చేస్తావా అని నవ్వుతూ కార్తిక్ బాబుతో నిజం చెప్పి నిన్ను వదిలేస్తాం అని మాటలతో కుల్లబోడుస్తూ ఉంటారు. అసలు డాక్టర్ బాబు నిన్ను భార్య అనే ఫీల్ అవ్వడం లేదు ఇక నువ్వు ఎన్ని జన్మలెత్తినా డాక్టర్ బాబు ప్రేమని పొందలేవు అను అంటూ ఇద్దరు ఒక ఆట ఆడుకుంటారు మౌనికతో.. ఇక మౌనిత భయపడుతూ ఎన్ని ప్లాన్లు వేసిన నా జీవితం ఇలా అవుతుంది ఏంటి అని మండిపోతు కంగారు పడుతూ ఉంటుంది. ఈ కార్తిక్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో వెళ్లి తీసుకురావాలి అనుకుంటూ ఇప్పుడే వద్దులే మళ్ళీ ఇప్పుడే వెళ్తే అలా ఎందుకు చేసావు అని గోల పెడతాడు గోల పెడతాడు.

ఏంటో కార్తీక్ ఇంటికి వచ్చిన తంటే రాకపోయినా తంటే అని బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కార్తీక్ సౌర్య గురించి ఆలోచిస్తూ దీప నీ చూస్తూ బాధపడుతూ ఎన్ని కష్టాలు పడుతుందో నాకోసం అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ శివాని పిలిచి సార్ ఎక్కడికి వెళ్లారు రా అని అనగానే ఎ సార్ మేడం అంటాడు. అప్పుడు శివాని కొట్టి వే సార్ ఎన్రేంట్రా అని తిడుతూ ఉంటుంది. అప్పుడు సార్ లేడు మేడం ఎక్కడికి వెళ్ళాడో తెలీదు మేడం కానీ వెతికి తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఏమొద్దు ఎప్పుడొస్తాడో అప్పుడు తనని జాగ్రత్తగా రూమ్లో పడుకోబెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శివ మోనీతపై అనుమాన పడుతూ ఉంటాడు. కట్ చేస్తే దీప నిద్ర లేవగానే బయట కార్తిక్ ఉంటాడు. తనను చూసి ఏంటి అనుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప కార్తీక్ కి కాఫీ పెట్టిస్తుంది తాగుతూ ఉండగా మౌనిత వస్తుంది. అక్కడ హల్చల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెచి చూడాల్సిందే..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి