Karthika Deepam 18 March Today Episode : ఇంద్రుడు, చంద్రమ్మ అరెస్ట్.. హిమను రోడ్డు మీద చూసి సౌందర్య షాక్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

Karthika Deepam 18 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1303 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిన్ని, బాబాయి ఇంకా రావడం లేదేంటని ఎదురుచూస్తూ ఉంటుంది హిమ. ఇంతలో టిఫిన్ తినేస్తుంది. మరోవైపు తన అల్లుడిని స్వప్న ఇంటికి పిలుస్తుంది. కానీ.. స్వప్న మాత్రం అతడితో కలిసి బతకడానికి అస్సలు ఒప్పుకోదు. కార్తీక్, దీప, హిమ.. ఓవైపు మనకు దూరమైతే.. మీరు ఇలా అయిపోవడం ఏంటి.. అసలు మన ఫ్యామిలీ ఇలా విడిపోవడం నాకు నచ్చడం లేదు. మీరూ పిల్లలను పంచుకున్నారు. తండ్రి దగ్గర ఒక్కరు.. తల్లి దగ్గర ఒకరు బతుకుతున్నారు. ఉన్న ఆదిత్య, శ్రావ్య.. అమెరికా వెళ్లిపోతాం అనుకుంటున్నారు అంటుంది. మేము ఇక ఎవరి కోసం బతకాలి అంటుంది సౌందర్య.

karthika deepam 18 march 2022 full episode

మీరు ఒంటరిగా ఉన్నారని.. మా ఇద్దరినీ కలిసిపోవాలని అనడం కరెక్ట్ కాదు. అవసరం లేని ఉచిత సలహాలను ఇవ్వకండి. అసలే పనిమనిషి రాలేదు. ఇంట్లో చాలా పనులు మిగిలిపోయాయి అని.. మీ ఇద్దరికీ దండం పెడతాను. మీరు వెళ్లిపోతే నేను నా ఇంటి పనులు చూసుకుంటాను అంటుంది స్వప్న. నేను ఎవ్వరి సలహాలు వినదలుచుకోలేదు. నాకు.. ఎవ్వరి బంధుత్వం, చుట్టరికం వద్దు అంటుంది స్వప్న. దీంతో నువ్వు ఆవేశంలో ఉన్నావు స్వప్న.. అంటుంది సౌందర్య. కానీ.. స్వప్న మాత్రం అస్సలు వినదు. దీంతో సౌందర్య, తన అల్లుడు ఇద్దరూ బయటికి వచ్చేస్తారు.

ఇంతలో తన పిల్లలు వస్తారు. వాళ్లను చూసి సంతోషిస్తుంది. అమ్మమ్మ మమ్మీని కలిశావా అంటే.. నేను కలిశాను కానీ.. తను మారడం లేదు అంటుంది. అమ్మమ్మ.. హిమతో పరిచయం తక్కువ అయినా కూడా హిమను కలవడం తక్కువ అయినా కూడా హిమ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనిపిస్తోంది అంటాడు నిరుపమ్.

అందరితో కలిసి ఉందామంటే.. మీ అమ్మ పడనివ్వదు అంటుంది. మీరు ఎప్పటికీ మాతోనే ఉండాలి. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను పదండి అంటుంది సౌందర్య. తన ఇద్దరు మనవళ్లను తీసుకొని కారులో వెళ్లిపోతుంది. మరోవైపు డబ్బు కొట్టేయడం కోసం తెగ ఎదురుచూస్తుంటారు.

Karthika Deepam 18 March Today Episode : పర్సు కొట్టబోతూ పోలీసులకు పట్టుబడ్డ ఇంద్రుడు, చంద్రమ్మ

ఇంతలో ఓ వ్యక్తి వెళ్తుంటే… వాడి పర్సు కొట్టబోతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతాడు ఇంద్రుడు. చంద్రమ్మను కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్లను తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతారు ఇంద్రుడు, చంద్రమ్మ. మరోవైపు బాబాయి, పిన్ని ఇంకా రావడం లేదేంటని ఎదురు చూస్తూ ఉంటుంది హిమ.

వాళ్లు మీ సొంత బాబాయి పిన్నినా అని అడుగుతాడు వెయిటర్. దీంతో కాదు అంటుంది హిమ. కదా.. వాళ్లు నిన్ను వదిలించుకొని వెళ్లారు అంటాడు వెయిటర్. నువ్వు ఆకలి మీద ఉన్నావని నాకు అర్థం అయింది. వాళ్లు నిన్ను మోసం చేశారు. ఈ బిల్లు నువ్వు కట్టలేవు. అది కూడా నాకు అర్థం అయింది. మా ఓనర్ గారికి నేను ఏదో ఒకటి చెబుతాను.. నువ్వు వెళ్లిపో అంటాడు వెయిటర్.

దీంతో హిమకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు పిల్లలను తీసుకొని సౌందర్య కారులో ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది హిమ. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటుంది.

శౌర్య అన్నట్టు అమ్మానాన్నలను నేనే చంపేశాను. పిన్ని బాబాయిలు ఎక్కడున్నారో తెలియదు. పోనీ.. బస్తీకి వెళ్తే అని అనుకుంటుంది హిమ. అందరం కలిసి ఒకప్పుడు సంతోషపడ్డాను అంటుంది సౌందర్య. నానమ్మ.. నానమ్మ అంటూ హిమ అస్తమానం ఏదో ఒకటి అడుగుతూనే ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది అని అంటుంది సౌందర్య.

మరోవైపు హిమకు బాగా దాహం వేస్తుంది. ఏం చేయాలో తెలియదు. అక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది. ఆ హోటల్ కు వెళ్లి నీళ్లు తాగుతుంది. హిమ నీళ్లు తాగుతుండటం నిరుపమ్ చూస్తాడు. అమ్మమ్మ కారు ఆపు అంటాడు. ఏమైంది అంటే.. హిమను చూశాను అంటాడు.

దీంతో సౌందర్య షాక్ అవుతాడు. హిమ కనిపించడం ఏంటి.. చనిపోయిన హిమ ఎలా కనిపిస్తుంది అంటుంది సౌందర్య. నువ్వు హిమ గురించి ఆలోచిస్తున్నావు. అందుకే హిమలా కనిపించి ఉండొచ్చు అంటుంది సౌందర్య. వెనక్కి తిప్పు అంటాడు నిరుపమ్. దీంతో కారును వెనక్కి తిప్పుతుంది.

తాను నీళ్లు తాగిన ప్లేస్ దగ్గరికి వచ్చి ఇక్కడే చూశాను అంటాడు నిరుపమ్. ఇందాక ఒక అమ్మాయి నీళ్లు తాగింది కదా అని అడుగుతాడు. దీంతో అవును తాగింది అంటాడు. దీంతో వెంటనే షాక్ అవుతుంది. ఈ అమ్మాయేనా అని తన ఫోన్ లో ఫోటోను చూపిస్తుంది సౌందర్య.

దీంతో అవును అమ్మ అంటాడు ఆ వ్యక్తి. దీంతో హిమ బతికే ఉందని తెలుస్తుంది సౌందర్యకు. ఎటువైపు వెళ్లింది అని అడుగుతుంది సౌందర్య. దీంతో అటువైపు వెళ్లింది అని చెబుతారు. దీంతో తనను వెతికేందుకు వెళ్తారు. మరోవైపు ఆ యాక్సిడెంట్ నే గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది హిమ.

ఇంతలో హిమ కనిపిస్తుంది సౌందర్యకు. తనను చూసి షాక్ అవుతుంది. హిమ కూడా సౌందర్య నుంచి సంతోషిస్తుంది. నువ్వేంటే ఇక్కడ. నిన్ను చూస్తాననుకోలేదు. దేవుడా ఏంటి నీ లీల అంటుంది సౌందర్య. పదండి.. అంటుంది సౌందర్య. హిమను తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

2 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

3 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

3 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

5 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

6 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

7 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

8 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

8 hours ago