karthika deepam 18 october 2021 full episode
Karthika Deepam 18 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 18 అక్టోబర్, 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకోసం ఏం తీసుకురాలేదా.. అని మోనిత.. సౌందర్యను అడుగుతుంది. ఇష్టం ఉన్నట్టు వాగకు. ప్రతిదానికి ఒక అందమైన ముగింపు ఉంటుంది. నువ్వు ఎగిరెగిరిపడకు.. అంటుంది సౌందర్య. నా కొడుకు పేరు ఏంటో తెలుసా? ఆనంద్.. మా మామయ్య గారి పేరు అంటుంది. కృత్రిమంగా, నిబంధనలకు విరుద్ధంగా గర్భం దాల్చిన నీకు ఇవన్నీ వినిపించవు అంటుంది. పేపర్ లో వచ్చిన ఆర్టికల్ చదివావు కదా.. నా కార్యచరణ మొత్తం ఇక్కడి నుంచే నడిపిస్తా అంటుంది మోనిత.
karthika deepam 18 october 2021 full episode
పేరోల్ మీద రావడానికి ప్రయత్నిస్తున్నావు కదా.. నువ్వు చేస్తున్న విషయాన్నీ తెలుసు. నువ్వు ఒక్కటంటే నేను వంద అంటాను. నువ్వు గులకరాయితో కొడితే నేను గుమ్మడికాయతో కొడతా.. అంటుంది సౌందర్య. మీరు చాలా పకడ్బందీగా వచ్చినట్టున్నారు. ఎన్ని చెప్పినా.. ఎన్ని చేసినా నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడు అన్నింటికీ సమాధానాలు చెబుతాడు.. అంటుంది మోనిత. దీంతో పగటి కలలు కనకు మోనిత. నీకు కార్తీక్ మీద ప్రేమ ఉంటే అది నీ ప్రాబ్లమ్. గోడల మీద రాతలు రాసుకుంటావో.. గోడలతో మాట్లాడుకుంటావో అది నీ ఇష్టం. ఒక అసహజమైన ప్రక్రియ ద్వారా గర్భం తెచ్చుకున్నావు. దానికి మా కుటుంబాన్ని బ్లేమ్ చేయకు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులు చాలు. ఇక ఆపు.. అని సలహా ఇస్తుంది సౌందర్య.
నువ్వు ఎంత గింజుకున్నా అమెరికా వెళ్లలేవు. నువ్వు ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా బిడ్డను కన్నావని నేను నిరూపిస్తాను. నువ్వు న్యూస్ పేపర్ ను మాత్రమే వాడావు. నేను అన్నింటినీ వాడుకుంటాను. అన్నింట్లోనూ నిన్ను వాడుకుంటాను. నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్షి. ఆరోగ్యం జాగ్రత్త. అసలే ఆర్టిఫిషియల్ ద్వారా గర్భం తెచ్చుకున్నావు. ఆరోగ్యం పాడవుతుంది. ఎక్కువగా టెన్షన్ పడకు.. అని చెప్పి సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే దీప.. ఆ ప్రియమణి గొడవ ఏంటి.. అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో ఆదిత్య వచ్చి.. అన్నయ్య మమ్మీ మోనితను కలవడానికి వెళ్లింది అని చెబుతాడు. దీంతో షాక్ అవుతాడు కార్తీక్. మమ్మీ అక్కడికి ఎందుకు వెళ్లింది అని అడుగుతాడు. ఇంతలో పిల్లలు వస్తారు. డాక్టర్ బాబు పిల్లలు వచ్చారు అనగానే కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. ఏంటి.. అందరూ సైలెంట్ అయ్యారేంటి అని అడగ్గానే ఆదిత్య పిల్లల మీద సీరియస్ అవుతాడు.
సౌందర్య వచ్చి వెళ్లిన విషయాన్నే ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. ఆ లేడీ హిట్లర్ అన్నట్టుగా అందరూ అమెరికా వెళ్లిపోతే.. నేనేం కావాలి.. నా కొడుకు ఏం కావాలి.. నా బతుకు ఏం కావాలి.. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి వాళ్ల అమెరికా ప్రయాణం ఆపాలి.. అని అనుకుంటుంది మోనిత.
karthika deepam 18 october 2021 full episode
కట్ చేస్తే ఇంటి సభ్యులను అందరిని పిలిచి.. పెద్దోడి ఫ్యామిలీ అమెరికా వెళ్తుందని చెబుతుంది. ఆదిత్య.. వాళ్లకు వీసాలు రెడీ చేయమని చెబుతుంది. నేను అల్లుడితో మాట్లాడాను. నలుగురికి వీసా ప్రాసెసింగ్ చేయి అని అడుగుతుంది. దాని గురించే ఇంట్లో డిస్కషన్ పెడతారు. ఇంత సడెన్ గా అనేసరికి అందూ షాక్ అవుతారు. వీసా అంటే వెంటనే కాదు కానీ.. ఒక రెండు నెలల సమయం పడుతుంది అని చెబుతాడు ఆదిత్య. ఇది నా నిర్ణయం. ఇది ఫైనల్ అని చెబుతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.