karthika deepam 19 august 2022 full episode
Karthika Deepam 19 Aug Today Episode : కార్తిక దీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1435 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… గండ, చంద్ర సౌర్యాని వాళ్ళింట్లో దింపేయాలని వెళుతూ ఉంటారు. సౌర్య నాకు ఇల్లు దగ్గరికి వస్తుంటేనే నా ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. నాకు అసలు వెళ్లాలనిపించట్లేదు.. నేను మీ దగ్గరే ఉంటానని చెప్పాను కదా నన్నెందుకు బలవంతంగా పంపిస్తున్నారు. మీ దగ్గర నన్ను ఉంచుకోవడం ఇష్టం లేకపోతే నన్ను వదిలేయమని చెప్పాను కదా అని అంటుంది. అప్పుడు గండ ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు తల్లి నీ కోపం తగ్గిన తర్వాత నీ వాళ్ళు నీకు కావాలి అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు శౌర్య నాకు అలా ఏమీ ఉండదు నేను ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాను అని అంటుంది. అప్పుడు చంద్ర ఒక పని చేద్దాం.. నువ్వు మీ నాయనమ్మ తాతయ్యలని చూసి తర్వాత నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపించకపోతే నేను తీసుకెళ్తాను అని అంటారు.
karthika deepam 19 august 2022 full episode
కట్ చేస్తే దీప కూడా ఇంటికి వస్తూ పిల్లల గురించి కార్తీక్ గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శౌర్య గండ, చంద్ర ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు గండ, చంద్ర వెళ్లి వాచ్మెన్ ని అడుగుతారు. అప్పుడు ఆ వాచ్మెన్ వాళ్ళు లేరమ్మ అమెరికా వెళ్లిపోయారు అని అంటాడు. అప్పుడు అదేంటి బంగారాన్ని ఇక్కడ వదిలేసి అమెరికా వెళ్ళిపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. సౌర్య మాత్రం బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో గండ, చంద్ర ఇక నువ్వు మాతోనే ఉందోలే అమ్మ అని తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో పెద్దావిడ దీప కి ఫోన్ చేసావా అని డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు తను హైదరాబాద్ చేరుకొని ఉంటుంది వాళ్ల కుటుంబ సభ్యులు తనని చూసి సంతోషంతో పొంగిపోతూ ఉంటారమ్మ తనే తర్వాత చేస్తుంది లే అని అంటాడు.
అంతలో ఒకాయన అక్కడికి వచ్చి మీరు చెప్పిన అతని అడ్రస్ దొరికింది సార్ ఆయన దెబ్బలతో అదే రోజు హాస్పిటల్ లో చేరాడట ఇప్పుడు బాగానే ఉన్నాడట అని చెప్తాడు. అప్పుడు ఆ పెద్దావిడ దీపకి చెప్పు తన సంతోష పడిపోతుంది అని అంటుంది.
కట్ చేస్తే దీప కూడా ఇంటికి వెళ్లేసరికి వాళ్లు అక్కడ ఉండరు. వాచ్మెన్ జరిగిందంతా చెప్తాడు. దాంతో దీప ఏడుస్తూ ఈయనకి వస్తుండగా డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ బాబు బ్రతికే ఉన్నాడు అన్నట్లుగా చెప్తాడు. అప్పుడు సంతోషంతో మళ్లీ తిరిగి డాక్టర్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది.
అక్కడికి వెళ్లి దేవుడి దగ్గర తన బాధను చెప్పి వేడుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న కుంకుమను తీసి తన తాలికి, తన నుదుటిన పెట్టుకుంటూ ఉండగా.. డాక్టర్ బాబు వచ్చి దీపం పిలిచినట్లుగా తను వెళ్లి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ తన బాధను చెప్తున్నట్లుగా.. దీప భ్రమ పడుతుంది.
దీప భ్రమలో నుంచి బయటికి వచ్చి ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు అని అంటూ ఉండగా.. డాక్టర్ అన్నయ్య పక్కన ఊర్లో ఉన్నారు అని చెప్పారు కదా ఒకవేళ దేవుడు నాకు సంకేతం చూపిస్తున్నాడేమో నేను అక్కడికి వెళ్లాలి అని వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.