Karthika Deepam 19 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఫిబ్రవరి 2022 శనివారం ఎపిసోడ్ 1280 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ లేనిది మోనిత ఇప్పుడు నీకు ఎందుకు హెల్ప్ చేసింది. ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తుందేమో అని దాని భయం అంటుంది సౌందర్య. ఇంతలో మోనిత ఫోన్ చేస్తుంది. కార్తీక్.. ఎక్కడున్నావు అంటుంది. విషయం ఏంటో చెప్పు మోనిత అని అంటాడు కార్తీక్. మా బాబాయికి ఆపరేషన్ చేస్తున్నావు కదా అని అడుగుతుంది. దీంతో మోనిత.. మీ బాబాయికి ఆపరేషన్ చేస్తున్నాను.. చేస్తాను. నీ సంగతి ఏంటి మోనిత.. ఇచ్చిన మాట మీద నిలబడతావా అని అడుగుతాడు కార్తీక్. అదేంటి కార్తీక్ అంత స్ట్రాంగ్ గా చెప్పాను కదా. అన్నీ మానేస్తాను.. హాస్పిటల్ తీసేస్తాను అని చెప్పాను కదా అంటుంది. ఈ విషయాన్ని స్పీకర్ పెట్టి సౌందర్య, ఆనంద రావు, ఆదిత్యకు వినిపిస్తాడు. విన్నారు కదా.. నేను చేయలేనిపనిని.. అసాధ్యమైన పనిని అడగలేదు మోనిత. నాకు తెలిసిన పనినే అడిగింది.. అంటాడు కార్తీక్.
ఒక డాక్టర్ గా నా పని నేను చేస్తాను. ఈ సర్జరీ నేను చేస్తున్నాను అంటాడు కార్తీక్. ఇంతలో పిల్లలు వస్తారు. నాన్న అమ్మ తాడికొండ వెళ్లింది తెలుసా. మా టీసీలు అక్కడే ఉన్నాయి కదా. అవన్నీ చూసుకొని వస్తానంది అంటారు పిల్లలు. దీంతో రేపు కాకుంటే ఎల్లుండి అయినా రమ్మనండి అని చెప్పి అక్కడి నుంచి చిరాకుగా వెళ్లిపోతాడు కార్తీక్. మరోవైపు తన బాబాయికి గోళ్లు కట్ చేస్తూ ఉంటుంది మోనిత. నిన్ను ఏ దేవుడు మార్చాడో కానీ.. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు బాబాయి. మిమ్మల్ని కాపాడుకోవడమే నా ప్రథమ కర్తవ్యం అంటుంది మోనిత. ఏంటి బాబాయి.. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు నేను ఉన్నాను కదా బాబాయి అంటుంది. నా ప్లాన్ వింటే మీ గుండె ఇప్పుడే ఆగిపోతుంది అని మనసులో అనుకుంటుంది మోనిత.
నాకు తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తున్నావు. నా ప్రాణం పోస్తున్నావు. నాకు ఇంకేం కావాలమ్మా అంటాడు బాబాయి. మరోవైపు కార్తీక్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది సౌందర్య. మోనిత తనంతట తానుగా ఒప్పుకుంది. తన బాబాయికి ఆపరేషన్ చేస్తే చాలు అని ఇంకేమీ ఇబ్బంది పెట్టను అంటుంది అంటాడు కార్తీక్.
నేనేమో మోనిత పీడను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంటుంటే.. దీపేమో వారణాసికి ఫోన్ చేసి రచ్చ రచ్చ చేసిందట.. అంటాడు కార్తీక్. దీంతో మోనిత చేసిందే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అంటాడు కార్తీక్. పులి బంగారు కడియాన్ని పట్టుకొని రమ్మని పిలిస్తే మనిషి వెళ్లిన కథ నువ్వు చదవలేదా.
బంగారు కడియం కోసం వెళ్లిన మనుషులను మింగేయడం పులి స్వభావం అని చెబుతుంది సౌందర్య. మోనిత మారిందేమో మమ్మీ. నా డాక్టర్ లైసెన్స్ తీసుకొచ్చేందుకు తను ప్రయత్నించిందట కదా.. ఏమో తను మారిందేమో అంటాడు కార్తీక్.
మోనిత అసలు స్వభావం ఏంటో.. తను ఎలాంటి పనులైనా చేయగలదని తన గురించి కార్తీక్ కు క్లారిటీ ఇస్తుంది సౌందర్య. దీంతో కార్తీక్ కారులో ఎక్కడికో బయలుదేరుతాడు. మరోవైపు ఆనంద్ గురించి ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటారు.
ఆనంద్ ఎప్పటికీ మన తమ్ముడే. వాడు వేరే అని మనం ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు అని అనుకుంటారు. మరోవైపు హాస్పిటల్ లో నర్సుతో మోనిత మాట్లాడుతుంది. తను ఏదో పని చెబుతుంది కానీ.. నర్సు మాత్రం నేను చేయను అంటుంది.
అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. మోనిత అని పిలుస్తాడు. తనతో ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఏదో సర్దిచెబుతుంది మోనిత. సరే.. నీతో మాట్లాడాలి మోనిత. నా క్యాబిన్ కు రా అంటాడు కార్తీక్. కార్తీక్ విని ఉండడు అనుకుంటుంది మోనిత.
కానీ.. టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెప్పు అంటాడు కార్తీక్. మోనిత.. నేను మీ బాబాయికి ఆపరేషన్ చేస్తే హాస్పిటల్ తీసేస్తానన్నావు. నన్ను ఇబ్బంది పెట్టను అన్ని మానేస్తా అన్నావు. ఇందులో ఎలాంటి కుట్రలు, ప్లాన్లు లేవు కదా అంటాడు కార్తీక్.
దీంతో వెంటనే కార్తీక్ కాళ్లు పట్టుకుంటుంది మోనిత. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్. నా మీద ఎలాంటి నమ్మకం లేదా. నన్ను ఎంత అవమానించావో తెలుసా. నువ్వు చీకొట్టినా.. పొమ్మన్నా నీ మీద ప్రేమ తగ్గలేదు. నీకు బాబును కని ఇచ్చాను.
నువ్వు దీప.. దీప అని కలవరిస్తున్నా సమాజం అంతా నన్ను ఛీ కొడుతున్నా.. నేను నీ మీద ఇసుమంత ప్రేమైనా తగ్గించుకోలేదు. నువ్వేంటి కార్తీక్ నన్ను నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. నా ప్రేమ నీకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటుంది మోనిత.
దీంతో సారీ మోనిత అంటాడు కార్తీక్. నేను ఊరికే అడిగాను. లే పైకి లే అంటాడు కార్తీక్. కార్తీక్ నా కన్నీళ్లకు పడిపోయినట్టున్నాడు అనుకుంటుంది మోనిత. కార్తీక్.. నిన్నేమీ ఇబ్బంది పెట్టను. ఇంకేమీ కోరను అంటుంది మోనిత. నీ పర్సనల్ లైఫ్ ను నీకు వదిలేస్తాను. నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. బాబాయిని బతికించు చాలు అంటుంది మోనిత.
కానీ.. నువ్వు నన్ను అనుమానించావు. నా ప్రేమను అవమానించావు.. అంటుంది మోనిత. బాబాయిని బతికించు చాలు. ఇంకేం వద్దు అంటుంది మోనిత. ఏడుస్తున్నట్టు యాక్షన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. దీంతో ఇలా అడిగి బాధపెట్టానా.. బాగా హర్ట్ అయినట్టుంది అని అనుకుంటాడు కార్తీక్.
మరోవైపు లక్ష్మణ్, వారణాసిని పిలుస్తుంది సౌందర్య. ఇక్కడి వాళ్లను మార్చే పనిలో ఉందా మోనిత అంటుంది సౌందర్య. అవును మేడమ్.. అందరూ తన ట్రాప్ లో పడిపోతున్నారు మేడమ్. ఇంతలో మోనిత బాబాయి వస్తాడు. నమస్తే మేడమ్ అంటాడు.
మా అబ్బాయి డాక్టర్ కార్తీక్. ఎందరికో ఎన్నో రకాలుగా హెల్ప్ చేశాడు. మీకు కూడా ఆపరేషన్ చేస్తాడు. కానీ.. ఆపరేషన్ తర్వాత మీరు ఒక పని చేయాలి. మోనితను తీసుకొని అమెరికా వెళ్లిపోవాలి అంటుంది సౌందర్య. అప్పుడే మోనిత వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.