karthika deepam 19 march 2022 full episode
Karthika Deepam 19 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 1304 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య.. ఇంకా తన తల్లిదండ్రులను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. దీంతో శ్రావ్య వచ్చి.. నువ్వు పొద్దున నుంచి ఏం తినలేదమ్మా.. అని అడుగుతుంది. దీంతో నాకొద్దు పిన్ని నాకు ఆకలిగా లేదు అంటుంది శౌర్య. దీంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వాళ్ల మీద ఎంత ప్రేమ ఉన్నా ఆకలిని చంపుకోవడం కరెక్ట్ కాదు కదా అంటుంది శౌర్య. నాకొద్దు అంటుంది శౌర్య. నాకు అమ్మ వాళ్లే గుర్తొస్తున్నారు. నా కళ్లముందే కారు లోయలో పడిపోయింది అంటుంది శౌర్య. ఇంతలో హిమ, నిరుపమ్, ప్రేమ్ ను తీసుకొని సౌందర్య ఇంటికి వస్తుంది.
karthika deepam 19 march 2022 full episode
తాతయ్య అంటూ లోపలికి వస్తారు. మీరెప్పుడు వచ్చారు అంటాడు ఆనంద రావు. దీంతో అమ్మమ్మ తీసుకొచ్చింది తాతయ్య అంటారు పిల్లలు. ఇంతలో సౌందర్య లోపలికి వస్తుంది. తన వెనుకే హిమ కూడా వస్తుంది. హిమను చూసి షాక్ అవుతారు అందరూ. శౌర్య కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత తనకు కోపం వస్తుంది. హిమ బతికే ఉంది అని తెలుసుకొని ఆనంద రావు, శౌర్య, ఆదిత్య.. ముగ్గురూ తన దగ్గరికి వెళ్తారు. ఏంటి సౌందర్య ఇది.. హిమ బతికే ఉందా అని అడుగుతాడు. అంతా ఆ దేవుడి దయ అంటుంది సౌందర్య. హిమ.. ఏం జరిగింది అని అడుగుతాడు ఆదిత్య. హిమ.. రా అంటుంది సౌందర్య. దీంతో ఆగు అంటుంది శౌర్య.
అసలెందుకు వచ్చావు అని అడుగుతుంది శౌర్య. అమ్మానాన్నలను చంపేశావు కదా. ఇంకేం చేద్దామని వచ్చావు అని అడుగుతుంది శౌర్య. దీంతో శౌర్య ఏం జరిగిందే నీకు అంటుంది సౌందర్య. దీంతో నానమ్మ తనను లోపలికి తీసుకురావద్దు. అమ్మానాన్నల చావుకు అదే కారణం అంటుంది శౌర్య.
నా కళ్లతో నేను చూశాను అంటుంది శౌర్య. శౌర్య.. ఇక ఆపవే. నీకెంత హక్కు ఉందో.. దానికీ అంతే హక్కు ఉంది అంటుంది సౌందర్య. దాన్ని ఎందుకు ఆపుతావు అంటుంది. దీంతో నాకు తెలుసు. మీరంతా తనకు సపోర్ట్ చేస్తారని అంటుంది శౌర్య.
ఈ ఇంట్లో తనో నేనో ఎవరో ఒకరే ఉండాలి అంటుంది శౌర్య. దీంతో అందరూ షాక్ అవుతారు. నేను వెళ్లిపోతాను అంటుంది హిమ. దీంతో తనను ఆపుతారు అందరూ. నువ్వు పదవే.. దాని మాటలేవీ పట్టించుకోకు పదా అంటుంది సౌందర్య. ఆగండి అంటుంది శౌర్య.
మా ఇద్దరిలో ఎవరో ఒకరే ఈ ఇంట్లో ఉండాలి అంటుంది శౌర్య. శౌర్య.. ప్లీజ్ నన్ను క్షమించవా అని అడుగుతుంది హిమ. దీంతో మాట్లాడొద్దు అంటుంది శౌర్య. అమ్మానాన్నలను చంపేశావు. నువ్వే చంపేశావు అంటుంది శౌర్య. నాతో మాట్లాడొద్దు అంటుంది శౌర్య.
అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత హిమను ఇంట్లోకి తీసుకెళ్తుంది సౌందర్య. నా గదిలోకి మాత్రం నువ్వు రావొద్దు అంటుంది శౌర్య. నువ్వు నాకు ఏం చెప్పొద్దు. నేను ఏం వినను అంటుంది. అమ్మా నాన్నలను నువ్వే చంపేశావు అంటుంది శౌర్య.
ఏం జరిగిందో.. ఏం చేశావో నేను ఊహించగలను. నాకు అర్థం అయింది. అక్కడ ఉన్నది నువ్వే కదా. డ్రైవింగ్ చేస్తాను.. అంటూ అమ్మానాన్నలను చంపేశావు. నువ్వు ఈ రూమ్ లోకి రాకూడదు. వెళ్లిపో అంటుంది శౌర్య. దీంతో దాంట్లో నా తప్పేం లేదు. అనుకోకుండా జరిగిపోయింది అంటుంది హిమ.
ఆ తర్వాత హిమను సౌందర్య భోజనం తినిపిస్తుంది. అయితే.. హిమను ఇంట్లోకి తీసుకొచ్చినందుకు శౌర్య అలుగుతుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. కట్ చేస్తే ఉదయం అవుతుంది. శౌర్య ఇంట్లో కనిపించదు. ఏమైందో అని ఇల్లంతా వెతుకుతుంది సౌందర్య.
శౌర్య కనిపించడం లేదని ఆదిత్యతో చెబుతుంది సౌందర్య. నేను చూస్తాను ఉండండి అని అంటాడు ఆదిత్య. హిమ.. నీతో ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది సౌందర్య. దీంతో నాకు ఏం చెప్పలేదు. తను అసలు నాతో మాట్లాడటం లేదు కదా అంటుంది హిమ.
కట్ చేస్తే శౌర్య ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. బయటికి వెళ్లి బతుకుతుంది. ఆటో డ్రైవర్ అవుతుంది. పెద్దగా అవుతుంది. ఇంతలోనే ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుంటుంది. తనకు అక్కా, చెల్లి అనే బంధాలు అంటే అస్సలు నచ్చవు అని చెబుతుంది. తన ఆటో వెనుక వదిలేదేలే.. అని రాయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.