Karthika Deepam 19 Sep Today Episode : మోనిత కొడుకుని చూసి గతం గుర్తు తెచ్చుకుంటున్న కార్తీక్… కంగారు పడిపోతున్న మోనిత…

Karthika Deepam 19 Sep Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1461 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… శివ, కార్తీక్ తో సార్ ఈరోజు మేడం లేదు కదా రాత్రికి మందు తెచ్చుకుంటాను అని భయపడుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా నువ్వు మందు తాగుతావా అని అంటూ.. ఎంత తాగుతావు ఏంటి అని అనగానే శివ ఆప్ తాగుతాను సార్ అని అంటాడు. అయితే నువ్వు ఫుల్ తీసుకురా అని అనగానే శివ నేను ఆఫ్ ఏ తాగుతాను సార్ అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఇంకొక ఆఫ్ నాకయ్యా అని అనగానే సార్ మీకు మందు అలవాటు ఉందా అని అంటాడు. అప్పుడు ఏమోనయ్యా నాకు గుర్తు ఉండదు కదా.. తాగితే తెలుస్తుంది గుర్తుందా లేదా అని అంటూ శివాకి డబ్బులు ఇచ్చి తీసుకొని రమ్మని చెప్తాడు. ఇదంతా చూస్తున్న దీప ఆనాటి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే సౌందర్య మోనిత ఎందుకు బాబుని ఇన్నాళ్లు ఇక్కడ ఉంచింది. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లింది. అది ఇప్పుడు ఆస్తిని కూడా వద్దనుకొని బాబుని తీసుకెళ్ళింది అంటే అది కచ్చితంగా బాబుని అడ్డం పెట్టుకొని ఏదో చేయబోతుంది అని ఆనంద్ రావుకి చెప్తూ ఉంటుంది.

అప్పుడు ఆనంద్ రావు తను ఏం చేస్తుందో తెలుసుకోవడం ఎలా సౌందర్య అని అంటుండగా నేనున్నాను కదండీ నేను ఆక్కడికి వెళ్తాను. అంతా తెలుసుకుంటాను అని అంటుంది సౌందర్య. కట్ చేస్తే శివ మందు తీసుకొని వస్తూ దీప వైపు చూడకుండా వస్తాడు. అప్పుడు దీప చికెన్ పకోడీ వేస్తు శివ అని పిలుస్తూ ఉండగా.. తను పలకకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దీప తమ్ముడు శివ.. తమ్ముడు శివ.. అని పిలుస్తూ ఉంటుంది.అప్పుడు శివ ఆశ్చర్యంగా నన్ను అరే పోరా రారా అనే వాళ్లే కానీ తమ్ముడు అనే వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ మళ్లీ మోనిత గురించి ఆలోచించుకుంటూ భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దీప మళ్ళీ తమ్ముడు అని పిలవగానే వస్తాడు. దీప దగ్గరికి వచ్చి నన్ను తమ్ముడు అని ఎందుకు పిలుస్తున్నారు. నేను మీతో మాట్లాడను అని అంటుండగా.. దీప అప్పుడు ఏంటి చేతిలో బాటిలా నాకు అంతా తెలుసులే సరేగాని మందు అయితే తీసుకెళ్తున్నావ్ మరి స్టఫ్ ఏది అని అంటుంది. అప్పుడు శివ ఏం మాట్లాడకపోయేసరికి చికెన్ పకోడీ కావాలా అని అంటుంది. అప్పుడు శివ ఏ వద్దు వంటలక్క అని అంటూ ఉంటాడు. నేను మీ మేడం కి చెప్పనులే నువ్వేం భయపడకు అని అంటుండగా.. శివ చెప్పవా అక్క అయితే చికెన్ పకోడీ ఇవ్వు అని అంటూ ఉంటాడు.

Karthika Deepam 19 september 2022 full episode

అప్పుడు దీప ఇదంతా అయిపోయిన తర్వాత నేనే తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళు అని అంటుండగా.. శివ సంతోషంగా వెళ్లి పోతూ ఉంటాడు. కట్ చేస్తే సౌర్య వారణాసిని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాయనమ్మ వాళ్ళ ఇంటికేనా అని వారణాసిని తిడుతూ నేను అమ్మానాన్నలు దొరికే వరకు ఎక్కడికి రాను నన్ను రమ్మని చెప్పొద్దు అని వారణాసిని అంటూ ఉంటుంది. అప్పుడు వారణాసి సరే అమ్మ ఎక్కడికి రావద్దు నన్ను కూడా వెళ్లమని చెప్పకు అని అంటాడు. కట్ చేస్తే శివ ,కార్తీక్ మందు తాగుతూ ఉంటారు. అప్పుడు కార్తీక్ నువ్వేంటయ్యా మందు అయితే తీసుకొచ్చావు గాని స్టఫ్ ఏది అని అనగానే.. వంటలక్క తీసుకొస్తుంది సార్ అని చెప్పగానే అంతలో దీప చికెన్ పకోడీ తీసుకొచ్చి కార్తీక్ పెట్టగానే. అది తింటూ చాలా బాగుంది వంటలక్క అంటూ ఇంకా యాపిల్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఉంటుంది తీసుకురా పో వంటలక్క అని చెప్పగానే ఇక్కడ ఏమీ లేవు డాక్టర్ బాబు అని అంటూ ఉంటుంది. అంటే గతంలో కార్తీక్ మందు తాగినప్పుడు ఆపిల్ తినేవాడు అదే తనకి గుర్తొస్తూ ఉంటుంది. శివ వంటలక్కని చూసి వంటలక్క చాలా మంచిది అని అనుకుంటూ మౌనిత పై అనుమాన పడుతూ ఉంటాడు.

శివ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తూ ఉండగా.. కార్తీక్ దీప ని ఏమైనా కబుర్లు చెప్పు అని అంటుండగా దీప మీ గురించే చెప్పాలి అని అంటూ ఉండగా.. నా గురించా అని అంటూ ఉంటాడు. అంటే మా డాక్టర్ బాబు గురించి అని మా డాక్టర్ బాబుతో కలిసి నేను మందు తాగేదాన్ని అని అంతా చెబుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మీ డాక్టర్ బాబు చాలా మంచోడు అనుకుంటా.. నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా కదా అని అనగానే దీప ఏడుస్తూ అవును నా డాక్టర్ బాబు నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నేనంటే ప్రాణం అంటూ అంతా చెబుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నిద్రపోతూ ఉంటాడు అది చూసి దీప నా కర్మ ఇలా తగలడింది. నేను మాట్లాడుతుండగా మీకు నిద్ర వచ్చింది అని అంటూ ఏడుస్తూ ఉండగా.. అంతలో శివా వచ్చి సార్ అప్పుడే నిద్రపోయారా కొంచెం సాయం పట్టండి వంటలక్క అని తనని బెడ్ మీద తీసుకెళ్ళి పడుకోబెడతారు.

ఇక శివ కూడా వెళ్లి పడుకో గా.. దీప కార్తీక్ రిపోర్టులను వెతికి తీసుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో వంటలక్క కార్తీక్ కి టీ ఇస్తుండగా.. మౌనిత వచ్చి ఆ టీ ని ఇసిరి కొడుతుంది. అప్పుడు ఒక్కసారిగా కార్తీక్ మోనిత వైపు చూసి ఈ బాబు ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ ఏడుస్తూ ఉండగా… దీప డాక్టర్ బాబు ఆ బాబు మీరు ఎత్తుకుంటే కచ్చితంగా ఏడుపు ఆపుతాడు మీరు ఎత్తుకోండి అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ తనని ఎత్తుకోగానే ఏడుపు ఆపుతాడు. అప్పుడు నిజంగానే బాబు ఏడుపు ఆపేసాడు కదా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు దీప మీకు ఈ బాబును చూస్తుంటే ఏమీ గుర్తుకు రావడం లేదా డాక్టర్ బాబు అని అంటుండగా… కార్తీక్ అప్పుడు జరిగింది మెల్లగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత భయపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

8 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

10 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

12 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

13 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

16 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

19 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago