
karthika deepam 2 december 2021 full episode
Karthika Deepam 2 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 డిసెంబర్ 2021, గురువారం 1212 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు మీరే న్యాయం చేయాలి. మోనిత బతుకు ఇలా అన్యాయం అయిపోతే.. ఆ అన్యాయం చేసిన వాడిని అందరం ఎక్కిస్తారా? ప్రెసిడెంట్ ను చేస్తారా? అంటూ మోనిత మీటింగ్ లో అందరినీ నిలదీస్తుంది. దీంతో దీప చప్పట్లు కొడుతూ నవ్వుకుంటూ స్టేజ్ మీదకు వస్తుంది. తనను పక్కకు జరిపి దీప మాట్లాడుతుంది.
karthika deepam 2 december 2021 full episode
అందరికీ నమస్కారం. నాపేరు దీప. నేను డాక్టర్ కార్తీక్ గారి భార్యను. తాళికట్టిన భార్యను. కొందరు వారికి వారే తాళి కట్టుకొని భార్యల్లా చలామణి అవుతున్నారు. అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది. అవాకులు చవాకులు పేలుతున్న కొన్ని కాకులకు సమాధానం చెప్పడం కోసమే నేను స్టేజ్ మీదికి వచ్చాను. ఈ మోనిత బాగా మాట్లాడారు. మోనిత గారు చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. కార్తీక్, మోనితకు మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది. ఇద్దరు డాక్టర్లు.. ఆ చనువుతో ఒకటి రెండు సార్లు తన ఇంటికి వెళ్లి ఉంటారు.
మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. భార్యాభర్తల మధ్య అవన్నీ సహజం. అవి కూడా సృష్టించినవే తప్ప.. పెద్దగా పట్టించుకునేవి కావు. ఇప్పుడు మేము కలిసిపోయాం. సంతోషంగా ఉంటున్నాం. కానీ.. తను మాత్రం నీచమైన పని చేసింది. గర్భాన్ని పొందింది. ఇలాంటి పనిచేసేదాన్ని మా ఊర్లో ఏమంటారో తెలుసా? వద్దు లేండి నా నోటితో అది నేను చెప్పలేను.
నువ్వు చేసినవి చెప్పుకుంటూ పోవాలంటే అసలు టైమ్ సరిపోతుందా? ఈవిడ డాక్టర్ కార్తీక్ ను ప్రెసిడెంట్ గా పనికిరారు అంది. కానీ.. ఈవిడ డాక్టర్ వృత్తికే కళంకం. పెద్దలు ఆలోచించండి.. తప్పు ఎవరిదో. తనంతట తానే బురద గుంటలో పడి నాకు బురద అంటింది అంటే ఎవరి వల్ల. మీరే అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటుంది దీప.
దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డాక్టర్ కార్తీక్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం అంటుంది భారతి. వద్దు తల్లి ఇది చాలు.. అంటూ కార్తీక్ వెళ్లబోతాడు. అందరూ వచ్చి ఆపుతారు.
మోనిత బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, దీప అందరూ వస్తుంటారు. మరోసారి కార్తీక్ అని పిలుస్తుంది. కంగ్రాట్స్ కార్తీక్. ప్రెసిడెంట్ అయ్యావు అంటుంది మోనిత. దీంతో కార్తీక్ తనను కొట్టబోతాడు కానీ.. ఆపుతుంది సౌందర్య.
ఆనంద రావు గారు మీ డాడీ ప్రెసిడెంట్ అయ్యాడురా అంటుంది. దీంతో కార్తీక్ కు తీవ్రంగా కోపం వస్తుంది. వదిలేయండి నన్ను.. తనను ఈరోజు చంపేస్తాను అంటాడు కార్తీక్. దీంతో నువ్వు ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టే.. అంటుంది సౌందర్య.
అరెరెరెరే.. కార్తీక్ నీకూ ఆడపిల్లలు ఉన్నారు. నన్ను క్షోభ పెడుతున్నావు. నా శాపం తగులుతుంది. కార్తీక్.. ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను చూస్తాను. నీ పిల్లల బతుకు కూడా నాలాగే అంటూ మోనిత అనబోతుంది. దీంతో దీప వెంటనే మోనిత దగ్గరికి వచ్చి ఇంకో మాట నా పిల్లల గురించి మాట్లాడావో పీక పిసికేస్తాను. వెళ్లు అంటుంది దీప.
వెళ్లడానికి కాదు ఇక్కడికి వచ్చింది. పర్మినెంట్ మీ ఇంట్లో ఉండటానికి. మీ ఇంట్లోనే ఉంటాను.. గుర్తు పెట్టుకొండి అని చెప్పి కారు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ వాళ్లు కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. ఇంతలో ఆదిత్య ఎవరీతోనే ఫోన్ లో మాట్లాడుతాడు.
ఫోన్ కట్ చేసి మమ్మీ అన్నయ్య ప్రెసిడెంట్ అయిపోయాడా.. మీరంతా హ్యాపీనా అంటాడు ఆదిత్య. కానీ.. ఎవ్వరూ మాట్లాడరు. అందరూ డల్ గా ఉన్నారేంటి అని అడుగుతాడు. అక్కడికి మోనిత వచ్చింది ఆదిత్య అంటుంది దీప. వెళ్లిన ఆనందం లేకుండా చేసింది ఆ మోనిత అంటాడు ఆనంద రావు.
ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వస్తారు. అమ్మ మాకు స్వీట్ చేసి పెట్టవా? అంటారు. దీంతో ఆదిత్యకు కోపం వస్తుంది. చెప్పగానే చేస్తారా? అంటూ పిల్లల మీద సీరియస్ అవుతాడు. మరోవైపు మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో లాయర్ సురేశ్ తనకు ఫోన్ చేస్తాడు.
మనం అనుకున్న పని కంప్లీట్ చేస్తున్నాను. ప్రాసెస్ మొత్తం అయిపోయింది. నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. ఫైల్ రెడీ అయిపోయింది అంటుంది. పని తప్పకుండా అయిపోవాలి. నేను ఇప్పుడే డబ్బులు పంపిస్తాను అంటుంది మోనిత. త. ప్రియమణి.. ఈరోజు నేను శుభవార్త విన్నాను.. అంటూ తెగ ఆనందపడిపోతుంది.
కార్తీక్ ఏ తప్పు చేయకుండానే నలిగిపోతున్నాడు అని సౌందర్య.. దీప ముందు కంటతడిపెట్టుకుంటుంది. బయటికి చెప్పలేడు.. మోనితను ఎదిరించలేడు.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. వాడిని అలా చూస్తూ నేను భరించలేకపోతున్నాను దీప అంటుంది సౌందర్య.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.