Karthika Deepam 2 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 జులై 2022, శనివారం ఎపిసోడ్ 1394 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శోభ.. స్వప్నకు అసలు విషయం చెప్పేందుకు ట్రై చేస్తుంది. హిమకు ఒకవేళ క్యాన్సర్ తగ్గిపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది శోభ. దీంతో నువ్వు ఒక డాక్టర్ వే కదా. పెద్ద పెద్ద రోగాలను అలా ఎలా నయం చేయగలుగుతాం. నిరుపమ్ తో కలిసి జీవితాంతం బతకాలని దానికి లేదు. నిరుపమ్ కు హిమ మీద ప్రేమతోనే వాడి జీవితం నాశనం అవుతుందని నా బాధ. దాని రోగం తగ్గుతుందని.. వాళ్లిద్దరూ కలిసి ఉంటారని నేను అనుకోవడం లేదు. వాళ్లిద్దరి పెళ్లికి కేవలం నిరుపమ్ కోసమే ఒప్పుకున్నాను. దాని ఆయుష్షు తీరగానే నిరుపమ్ ను నీకిచ్చి పెళ్లి చేస్తాను సరేనా అంటుంది స్వప్న. దీంతో సరే ఆంటి.. నేను నిరుపమ్ ను పెళ్లి చేసుకోవడం ఎందుకు హిమ ఒప్పుకోవడం లేదు అని అడుగుతుంది శోభ. దీంతో అది ఎవరికో ఇచ్చి కట్టబెట్టాలని అనుకుంటోంది కదా అంటుంది స్వప్న. అదే ఆంటి.. అక్కడే తిరకాసు ఉంది. అక్కడ ఎంగేజ్ మెంట్ జరిగేటప్పుడు లాస్ట్ మినట్ లో ఎందుకు వద్దందో తెలియదు కదా. ఏదో ఉంది ఆంటి. తన ఫ్యామిలీకి సంబంధించి మనకు తెలియనిది ఏదో జరుగుతోంది ఆంటి అంటుంది శోభ.
హిమ మీద తన ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచితే బెటర్ కావచ్చు అంటుంది శోభ. ఆంటీకి చెప్పాల్సింది అంతా ఇన్ డైరెక్ట్ గా చెప్పాను అని మనసులో అనుకుంటుంది శోభ. మరోవైపు శౌర్య కోసం బాక్స్ ను ఇస్తుంది హిమ. నువ్వేమో దాని కోసం ఇంత తాపత్రయపడుతున్నావు. అదేమో నిన్ను ద్వేషిస్తోంది అంటుంది. తను ఎంత ద్వేషించినా నేను తనకోసం ఏదైనా చేయడానికి సిద్ధం. తనకు రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అందుకే తన కోసం ఈ బాక్స్ చేయించా అంటుంది. ఇంతలో ఎవరికి.. ఎక్కడికి అంటుంది అక్కడికొచ్చిన స్వప్న. దీంతో హిమ, సౌందర్య, ఆనందరావు షాక్ అవుతారు. స్వప్న ఎంత అడిగినా ఏం చెప్పరు. ఏం లేదే.. తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్తున్నాం అంటుంది సౌందర్య. దీంతో తెలిసిన వాళ్ల ఇంటికి అయితే అంత ఎగ్జయిట్ అవ్వాలా? మిమ్మల్ని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతోంది అంటుంది స్వప్న. దీంతో డౌటేంటి స్వప్న అంటాడు ఆనంద రావు.
అసలు మీ మైండ్ లో ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదో జరిగింది. అది మాత్రం నాకు అర్థం అవుతోంది అని అంటుంది స్వప్న. ఇంతలో జ్వాల.. సౌందర్యకు ఫోన్ చేస్తుంటుంది. ఫోన్ తీయి మమ్మీ. ఫోన్ వస్తుంటే కూడా తీయకుండా చూస్తావేంటి అని అడుగుతుంది స్వప్న.
దీంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సౌందర్య. ఏమైంది సీసీ వస్తా అన్నారు ఇంకా రాలేదు అని అడుగుతుంది జ్వాల. దీంతో జగదీశ్వరి వస్తున్నాం అంటుంది సౌందర్య. జగదీశ్వరా ఆమె ఎవరు? అని అడుగుతుంది జ్వాల. నేను జ్వాలను మాట్లాడుతున్నాను అంటుంది. సరే.. వస్తున్నాం అంటుంది సౌందర్య.
జగదీశ్వరా.. తను ఎవరు? అసలు ఆ పేరుతో ఎవరున్నారు తెలిసిన వాళ్లు అంటుంది స్వప్న. నాకు డౌట్ వస్తోంది. మీరు ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తోంది అంటుంది స్వప్న. ఎంగేజ్ మెంట్ నుంచి నాకు ఇష్టం లేదని లేచి వెళ్లిపోయిన మీ మనవరాలు.. రేపు పెళ్లి పీటల మీది నుంచి కూడా లేచి వెళ్లిపోతే అప్పుడు మా పరువు ఏం కావాలి అని అంటుంది స్వప్న.
హేయ్ హిమ.. నిన్నే అడిగేది సమాధానం చెప్పు అని అడుగుతుంది స్వప్న. దీంతో స్వప్నత్త బావ పెళ్లి జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. మరోవైపు తన పెళ్లి కార్డు చూసుకొని మురిసిపోతాడు నిరుపమ్.
ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. శోభ ఫోన్ చేస్తుంది. నిరుపమ్ మనం క్లోజ్ ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఏం ఉండవు కదా. సూటిగా నిన్ను ఒక మాట అడగనా అంటుంది శోభ. ఏం లేదు నిరుపమ్.. నీ పెళ్లికి ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. ఏ గిఫ్ట్ ఇద్దామన్నా నచ్చడం లేదు. నిన్నే అడుగుదామని ఫోన్ చేశా అంటుంది శోభ.
దీంతో గిఫ్ట్ ఎవరైనా అడిగి ఇస్తారా? అయినా నువ్వు నా పెళ్లికి రావడమే పెద్ద గిఫ్ట్ అంటాడు నిరుపమ్. నిజానికి నేనే నీకు పెద్ద గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అంటాడు. నీకు మంచి మొగుడిని గిఫ్ట్ గా ఇద్దామనుకుంటున్నాను అంటాడు నిరుపమ్. వర్మ అని కెనెడాలో ఉన్నాడు. ఇక్కడే సెటిల్ అవుదామనుకున్నాడు అని చెబుతాడు.
దీంతో శోభకు తిక్క కోపం వస్తుంది. కానీ.. ఏం మాట్లాడలేకపోతుంది. నాకు కాబోయే మొగుడు నాకు మొగుడిని గిఫ్ట్ గా ఇస్తాడంట. నిరుపమ్ నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ.. నేను అనుకున్నది నిజం చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను అని అనుకుంటుంది శోభ.
కట్ చేస్తే ఆనంద రావు, సౌందర్య.. ఇద్దరూ జ్వాల ఇంటికి వెళ్తారు. మీరు ఇక.. నా ప్రేమ విషయం గురించి.. తింగరి గురించి అస్సలు మాట్లాడకండి. నా మనసు విరిగిపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటుంది జ్వాల. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు.
ఎక్కడికి వెళ్లిపోతావే అని అడుగుతారు. మిమ్మల్ని వదిలేసి వెళ్తావా అని అంటారు. దీంతో మా పిన్నీ బాబాయిలు రాగానే.. వాళ్లకు అంతా చెప్పేసి ఊరు వదిలి వెళ్లిపోతాను అంటుంది జ్వాల. దీంతో అలా ఎలా వదిలి వెళ్లిపోతావు. నువ్వు వెళ్లిపోతే మేము ఏం కావాలి అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.