Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!
Gunde Ninda Gudi Gantalu Today Episode November 21st : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌లో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. శుక్రవారం (నవంబర్ 20) ఎపిసోడ్‌లో రోహిణి వేసిన ప్లాన్‌తో మనోజ్ అసూయపడగా, మరోవైపు రవికి నీతూ బంపరాఫర్ ఇచ్చింది. ఇక తర్వాతి ఎపిసోడ్‌లో సుమతి, అరుణ్ పెళ్లి వ్యవహారం మరోసారి తెరపైకి రానుంది. చెల్లెలి భవిష్యత్తు కోసం మీనా తీసుకోబోయే నిర్ణయంతో బాలు తీవ్ర ఆగ్రహానికి గురికానున్నాడు. అసలు ఏం జరిగిందంటే?అత్తగారి మాటలు విని తనకు దూరంగా ఉంటున్న మనోజ్‌ను మళ్లీ తనవైపు తిప్పుకోవాలని రోహిణి నిర్ణయించుకుంటుంది. ఎలాగైనా భర్త ప్రేమను తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఓ చిన్న ప్లాన్ వేస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!
రోహిణి కొత్త ప్లాన్‌తో మనోజ్‌కు షాక్.. రవికి నీతూ బంపరాఫర్!
తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడితే మనోజ్ తట్టుకోలేడని భావించిన రోహిణి, అతడికి వినిపించేలా మహేశ్ అనే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తుంది. నీతో మాట్లాడుతుంటే సమయమే తెలియడం లేదని, అర్ధరాత్రి అయినా మాట్లాడకుండా ఉండలేకపోతున్నానంటూ రొమాంటిక్‌గా సంభాషిస్తుంది. ఈ మాటలు విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతకీ మహేశ్ ఎవరు? తన భార్య అతడితో ఎందుకు అంత సన్నిహితంగా మాట్లాడుతోందని అసూయతో రగిలిపోతాడు. కాసేపటికి ఫోన్ పెట్టేసిన రోహిణి బెడ్‌రూమ్‌లోకి వస్తుంది. అప్పటికే మనోజ్ ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నట్లు నటిస్తాడు. కానీ అతడి డ్రామాను ముందుగానే పసిగట్టిన రోహిణి మనసులో నవ్వుకుంటుంది. పక్కనే ఉన్న రోహిణి ఫోన్ తీసుకుని మహేశ్‌కు కాల్ చేసి నిలదీయాలని మనోజ్ అనుకుంటాడు. కానీ అర్ధరాత్రి ఫోన్ చేయడం మంచిది కాదని ఆగిపోతాడు. చివరకు రోహిణి తనతో మాట్లాడుతుందేమోనని మనోజ్, భర్త ముందుకొస్తాడేమోనని రోహిణి ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకుంటారు.
రవి ఇంటికి నీతూ.. శృతికి పట్టరాని కోపం
మరుసటి రోజు ఉదయం రవి పనిచేసే రెస్టారెంట్ యజమాని నీతూ ఇంటికి వస్తుంది. హాల్లో ఉన్న సత్యం, ప్రభావతి ఆమెను చూసి ఎవరు కావాలని అడుగుతారు. తాను రవి పనిచేసే రెస్టారెంట్ ఓనర్‌నని నీతూ పరిచయం చేసుకోగానే ప్రభావతి ఆనందానికి అవధులుండవు. ధనవంతురాలైన అమ్మాయి తమ ఇంటికి రావడాన్ని గొప్పగా భావిస్తూ ప్రత్యేక మర్యాదలు చేస్తుంది. అప్పుడే బాలు–మీనా, రవి–శృతి, మనోజ్–రోహిణి కిందికి వస్తారు. నీతూను చూసిన శృతి ఒక్కసారిగా కోపంతో మండిపడుతుంది. రెస్టారెంట్‌లో తన భర్తను అవమానించి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావని నిలదీస్తుంది. జరిగిన తప్పుకు నీతూ క్షమాపణలు చెబుతుంది. పొరపాటు తనదేనని అంగీకరిస్తుంది. అయినా శృతి శాంతించకపోవడంతో సత్యం జోక్యం చేసుకుంటాడు. శత్రువైనా ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలని, అలా చేస్తే సగం శత్రుత్వం తగ్గిపోతుందని నచ్చజెబుతాడు. దీంతో శృతి కాస్త వెనక్కి తగ్గుతుంది.
రవికి ఊహించని బిజినెస్ ఆఫర్.. మనోజ్‌కు నీతూ కౌంటర్!
ఇంతలో అసలు విషయం బయటపెడుతుంది నీతూ. ఇకపై రవి తన రెస్టారెంట్‌లో ఉద్యోగిగా పనిచేయాల్సిన అవసరం లేదని చెబుతుంది. ఈ మాట విన్న శృతి మళ్లీ మండిపడుతుంది. రవిని ఉద్యోగం నుంచి తీసేశావా అని ప్రశ్నిస్తుంది. అయితే నీతూ ఊహించని శుభవార్త చెబుతుంది. రవి ప్రతిభ వల్లే తమ రెస్టారెంట్‌కు మంచి పేరు వచ్చిందని, నగరంలో మరిన్ని రెస్టారెంట్లు ప్రారంభించాలనుకుంటున్నానని వివరిస్తుంది.కొత్తగా ఏర్పాటు చేయబోయే రెస్టారెంట్లలో రవిని బిజినెస్ పార్ట్‌నర్‌గా చేసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతుంది. ఈ విషయం విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు.వెంటనే మనోజ్ కూడా తనను పార్ట్‌నర్‌గా తీసుకోవాలని అడుగుతాడు. కానీ తనకు కావాల్సింది రవిలాంటి ప్రతిభావంతుడైన చెఫ్ అని, వ్యాపారంలో పదేపదే మోసపోయే వ్యక్తి కాదని నీతూ సమాధానమిస్తుంది. దీంతో మనోజ్‌కు మాటలు రావు.ఇక బాలు మాత్రం ఆచితూచి స్పందిస్తాడు. రవి పెట్టుబడి ఎంత? లాభాల్లో వాటా ఎలా ఉంటుంది? రేపు సమస్యలు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తాడు. అన్ని వివరాలను ఒప్పంద పత్రాల్లో పొందుపరిచానని, చదివి అంగీకరిస్తేనే సంతకం చేయాలని నీతూ చెబుతుంది.ఆమె వ్యాపార ఆలోచనలను మెచ్చుకున్న బాలు, నీతూను పెళ్లి చేసుకునే వ్యక్తి అదృష్టవంతుడని వ్యాఖ్యానిస్తాడు. అయితే తనకు ప్రస్తుతం పెళ్లిపై ఆసక్తి లేదని, దేశవ్యాప్తంగా వందకుపైగా రెస్టారెంట్ బ్రాంచీలు ప్రారంభించడమే తన లక్ష్యమని నీతూ వివరిస్తుంది.ఇక నీతూ సంపద గురించి తెలుసుకున్న ప్రభావతి మనసులో మరో ఆలోచన మొదలవుతుంది. ఆమెను మనోజ్‌కు జోడీగా చేస్తే బాగుంటుందనే ఆశ కూడా కలుగుతుంది. అయితే నీతూ మాటలు ఆమె ఊహలకు చెక్ పెడతాయి.
శృతి మాటతో ఒప్పుకున్న రవి.. అగ్రిమెంట్‌పై సంతకం
నీతూ ఇచ్చిన ఆఫర్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలని శృతి రవిని మేడపైకి తీసుకెళ్తుంది. తాను ఇంకా వ్యాపారం నిర్వహించే స్థాయికి ఎదగలేదని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని రవి అంటాడు.కానీ శృతి మాత్రం ఇదొక మంచి అవకాశమని నచ్చజెబుతుంది. బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉంటే వ్యాపారంలో అనుభవం వస్తుందని, భవిష్యత్తులో సొంత రెస్టారెంట్ ప్రారంభించడానికి ఉపయోగపడుతుందని చెబుతుంది.చివరకు భార్య మాటకు అంగీకరించిన రవి కిందికి వచ్చి నీతూ ఆఫర్‌ను స్వీకరిస్తాడు. ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తాడు. దీంతో రవి జీవితంలో కొత్త ప్రయాణానికి తెరలేస్తుంది.
Also Read : Today Horoscope : 21 నవంబర్ 2026 శనివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!
అరుణ్–సుమతి పెళ్లికి మీనా ప్రయత్నం.. పుట్టింటికి దూరం చేస్తానన్న బాలు!
ఇక తదుపరి ఎపిసోడ్‌లో అసలు ఉత్కంఠ మొదలవనుంది. సుమతి దక్కదనే బాధతో కుమిలిపోతున్న అరుణ్‌ను చూసి అతడి తల్లి ఆవేదన చెందుతుంది. ఎలాగైనా కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటుంది.ఈ నేపథ్యంలో నేరుగా మీనాను కలుస్తుంది. సుమతితో పెళ్లి జరగకపోతే తన కొడుకు ఏమైపోతాడోనని భయంగా ఉందని చెబుతుంది. ఇద్దరి సంతోషం మీ చేతుల్లోనే ఉందంటూ మీనా చేతులు పట్టుకుని వేడుకుంటుంది.ఆ తల్లి బాధను చూసిన మీనాకు ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు తన చెల్లెలి ప్రేమ, మరోవైపు భర్త బాలు కోపం.. ఈ రెండింటి మధ్య చిక్కుకుపోతుంది.చివరకు ధైర్యం చేసి బాలు దగ్గరకు వెళ్తుంది. అరుణ్ తన అహాన్ని పక్కనపెట్టి మీకు క్షమాపణ చెబితే సుమతితో పెళ్లికి అంగీకరిస్తారా అని అడుగుతుంది.ఈ మాట వినగానే బాలు కోపంతో ఊగిపోతాడు. అరుణ్ క్షమాపణల వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయో తెలియదని, ఆ పెళ్లికి తాను ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతాడు.అయితే మీనా కూడా ఈసారి వెనక్కి తగ్గదు. మీ అభిప్రాయంతో సంబంధం లేకుండా అరుణ్, సుమతిల పెళ్లి జరిపిస్తే ఏం చేస్తారని నేరుగా ప్రశ్నిస్తుంది.దీంతో బాలు మరింత సీరియస్ అవుతాడు. తన మాట కాదని ఆ పెళ్లి చేస్తే మీనాకు పుట్టింటితో ఉన్న సంబంధాలు కొనసాగవని హెచ్చరిస్తాడు. తల్లి, చెల్లెలే ముఖ్యమని భావిస్తే అత్తారింటిని శాశ్వతంగా మరిచిపోవాల్సి వస్తుందని కఠినంగా మాట్లాడతాడు.భర్త నోటి నుంచి అలాంటి మాటలు వస్తాయని ఊహించని మీనా ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. చెల్లెలి సంతోషం కోసం ముందడుగు వేస్తే తన కాపురమే ప్రమాదంలో పడుతుందనే పరిస్థితి ఎదురవుతుంది.మరి బాలు హెచ్చరికకు మీనా భయపడుతుందా? అరుణ్, సుమతిల ప్రేమను గెలిపించేందుకు భర్తను ఎదిరిస్తుందా? చెల్లెలి పెళ్లి కోసం పుట్టింటికి, అత్తారింటికి దూరమయ్యే నిర్ణయం తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు రాబోయే ఎపిసోడ్‌లో సమాధానం దొరకనుంది.