karthika deepam 2 october 2021 full episode
karthika deepam 2 october 2021 full episode
Karthika Deepam 2 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 2 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జైలులో ఉన్న మోనితను కలవడానికి దీప వెళ్లిన విషయం తెలిసిందే. ఎందుకు ఇదంతా చేస్తున్నావు. నేను ఉండగా కార్తీక్ ను నువ్వు పొందలేవు.. అని వార్నింగ్ ఇస్తుంది దీప.
karthika deepam 2 october 2021 full episode
మనిషి చంద్రుడి మీదికి వెళ్లాడు. ఇంకో మనిషిని కలుసుకోవడం.. కలుపుకోవడం అసాధ్యం అని నువ్వు అంటున్నావా? ఏదీ అసాధ్యం కాదు దీపక్క.. అంటుంది మోనిత. హిమ కేసు అలాగే ఉంది. ఆ కేసును తిరగదోడిస్తాను. సెల్ ఫోన్ లో సాక్ష్యాలు మాయం చేసినంత మాత్రాన నువ్వు ఏదో సాధించినట్టు కాదు. అంజి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అంటుంది దీప.
karthika deepam 2 october 2021 full episode
ఏంటక్కా నువ్వు.. మంగమ్మ శపథంలా.. దీపక్క శపథం చేస్తున్నావా? అది ఏదీ అయ్యే పని కాదు. ఆధారాలే లేకుండా పోయాయి. అసలు అంజి గాడు ఉంటే కదా. మాయం చేసేశా. వాడిని పట్టుకోవడం నీ వల్ల కాదు. నాది క్రిమినల్ బ్రెయిన్ అన్నావు కదా. అదే క్రిమినల్ బ్రెయిన్ తో నేను గానీ ఆలోచిస్తే.. నువ్వు, నీ పిల్లలు అన్యాయం అవుతారు తెలుసా. నేను మానవతా దృక్పథంతో సాటి ఆడదానిగా ఆలోచించి మిమ్మల్ని వదిలేశాను అర్థం అయిందా.. అది నా మంచి తనం.. అంటుంది మోనిత.
karthika deepam 2 october 2021 full episode
చూడు మోనిత.. నేను నీతో గొడవ పడటానికి రాలేదు. నా మాట విను. పేపర్ లో ఆ రాతలు ఆపు.. పిల్లలు వాటిని చూస్తే పాపం డాక్టర్ బాబును నిలదీస్తారు. అపార్థం చేసుకుంటారు అని చెబుతుంది దీప. దీంతో అప్పుడు నిజం చెప్పండి.. అంటుంది మోనిత.
karthika deepam 2 october 2021 full episode
ఇప్పటి వరకు డాక్టర్ బాబు మోసిన నిందలు, అవమానాలు చాలు. ఇకనైనా ఇవన్నీ ఆపేయ్ అంటుంది మోనిత. నిందలు, అవమానాలు.. నేనే ఎక్కువగా మోశా. మన కార్తీక్ మీద ప్రేమ వల్ల నేను అవన్నీ మోశాను. అండర్ లైన్ చేసుకో. మన కార్తీక్.. కార్తీక్ అంటే ప్రేమ. ప్రేమించడంలో తప్పేముంది చెప్పు. కార్తీక్ కు, నాకు మధ్య గ్యాప్ వచ్చింది. రాత్రి అనకా.. పగలు అనకా.. ఎడాపెడా మా ఇంటికి వచ్చేవాడు. అంత మంచి అవకాశం వచ్చినా నేను ఏ తప్పు చేయలేదు కదా. మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు ఆలోచించలేదు. నా క్యారెక్టర్ నే చీప్ గా చేశారు. ఎంత చేసినా నేను నేనులాగే ఉన్నాను. నన్నొక చెడ్డదానిలా లోకానికి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేను చెడ్డదాన్ని కాదు.
karthika deepam 2 october 2021 full episode
గొప్ప ప్రేమికురాలిని. అది నీకు అర్థం కావడం లేదు. న్యూస్ పేపర్ ఇంటర్వ్యూ చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. అదే పేపర్ చూడకపోయి ఉంటే.. నా దగ్గరికి వచ్చేదానివా దీపక్క.. అంటూ ప్రశ్నిస్తుంది మోనిత.
karthika deepam 2 october 2021 full episode
మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మోనిత.. అంటే నేను ఏది చేసినా కొంచెం ఎక్కువే చేస్తాను. ప్రేమించినా కూడా అంటుంది మోనిత. అన్నీ ఆపేస్తాను.. నీ జోలికే రాను.. సరేనా.. పాపం నా కార్తీక్ బాధపడుతున్నాడు కదా. నా మెడలో కార్తీక్ తో తాళి కట్టించు.. అన్నీ ఆపేస్తాను.. ఏంటి దీపక్కా.. నువ్వు ఆపేయ్ అన్నావు.. నేను ఆపేస్తాను.. డీల్ ఓకేనా అంటుంది మోనిత.
karthika deepam 2 october 2021 full episode
ఈ సమస్యకు ఈ ప్రపంచంలో ఇంత కన్నా స్వీట్ సొల్యుషన్ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎప్పుడూ నీ పిల్లలు, నీ మొగుడు.. నీ సంసారం.. ఇదేనా.. మోనిత ఉంది.. దాని బతుకేంది.. అని ఏనాడైనా ఆలోచించావా? స్వార్థం నీకు. నా మొగుడు.. నా కార్తీక్ అనడం కంటే.. మన అని చూడు. మన కార్తీక్ అనడంలో ఒక సమ భావన లేదు. ఉంది కదా. రేపు నాకు పాపో బాబో పుడితే డాడీ ఎక్కడ.. డాడీ మన ఇంటికి రాడేంటి అని అడిగితే నేను ఏం చెప్పాలి.. చెప్పు అంటుంది మోనిత.
karthika deepam 2 october 2021 full episode
నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాను.. డీల్ ఓకే అయితే చెప్పు హ్యాపీ.. డీల్ నచ్చకపోతే కూడా హ్యాపీ. నేను చేసేది నేను చేస్తాను.. అంటుంది. ఇంతలో సుకన్య వస్తుంది. టైమ్ అయింది అని అంటుంది. మా చర్చలు ముగిశాయి. దీపక్క వెళ్తుంది.. అంటుంది మోనిత. బై దీపక్క. మన కార్తీక్ ను అడిగానని చెప్పు. నేను ఇక్కడ బాగానే ఉన్నానని చెప్పు.. మరిచిపోకు.. అని చెప్పి మోనిత వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. హిమ ఇంటి బయట కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఆరోజు షైనీ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. పేపర్ లో చదివింది కూడా గుర్తు తెచ్చుకుంటుంది. షైనీ చెప్పింది నిజమేనా.. అసలు డాడీ గురించి తలుచుకుంటేనే ఒకసారి ఏడుపు వస్తుంది.. ఇంకోసారి భయం వేస్తుంది.. అని అనుకుంటుంది హిమ.
karthika deepam 2 october 2021 full episode
ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంటుంది. షైనీ చెప్పింది నిజమేనా.. అంటే నువ్వేం అడగకు ప్లీజ్. బోలెడన్ని ప్రశ్నలు.. కానీ.. మనం ఏం అడగలేకపోతున్నాం.. అంటుంది శౌర్య. మనం ఇప్పటికి ఏం చేయలేం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు.. సంతోషంగా ఉన్న క్షణాలను గుర్తుతెచ్చుకోవాలి.. అని అంటుంది శౌర్య. అందుకే.. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం కదా. అమ్మా.. నాన్నా.. నానమ్మ.. తాతయ్య.. అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాటి గురించి ఎందుకు.. మనం హ్యాపీగా ఉందాం అని శౌర్య చెప్పినా కూడా వినకుండా హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత షైనీ చెప్పింది నిజమా.. అబద్ధమా అని ఆలోచిస్తుంటుంది శౌర్య. హిమ కూడా చాలా బాధపడుతోంది. ఏం చేయాలో ఏమో.. అని శౌర్య టెన్షన్ పడుతుంది.
కట్ చేస్తే.. సౌందర్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఏంటి ఫోన్ లో అంటే.. మా ఫ్రెండ్ కు ఏదో సమస్య అంటే తీరుస్తా అని చెప్పా అంటాడు ఆదిత్య. మన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా.. మరి ఏమైందిరా.. అని అడుగుతుంది. ఇప్పటికే ఒక్కోటి తీరుతున్నాయి కదా మమ్మీ అంటాడు ఆదిత్య.
karthika deepam 2 october 2021 full episode
పుట్టింటి మీద స్వప్నకు పుట్టెడు కోపం ఉంది. ఎంత సర్ది చెప్పినా అది వినడం లేదు.. అంటుంది సౌందర్య. అన్నయ్య సమస్య ఇప్పటికే తీరింది. ఇక.. స్వప్న సమస్య కూడా త్వరలో తీరుతుంది. అన్నీ సర్దుకుంటాయి అని ఆదిత్య సర్దిచెబుతాడు.
ఇంతలో మమ్మీ.. ఏదో పేపర్ కనిపించడం లేదని వదిన అడిగింది. ఏంటా పేపర్ అని సౌందర్యను అడుగుతాడు ఆదిత్య. దీంతో.. పేపర్ కనిపించడం లేదా.. అంటూ టెన్షన్ పడుతుంది సౌందర్య. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పేపర్ తోనే అన్ని సమస్యలు వస్తున్నాయి అంటుంది. ఏం పేపర్ మమ్మీ అంటాడు. దీంతో మోనిత చేసిన బాగోతం మొత్తం చెబుతుంది సౌందర్య.
ఆ పేపర్ ను పిల్లలు కానీ చదివారంటే.. ఎన్నో సమస్యలు వస్తాయి అంటుంది సౌందర్య. ఎందుకు.. ఆ పిల్లలకు ఉన్న విషయాన్ని చెబితే.. అంతా వాళ్లకు కూడా అర్థం అవుతుంది కదా.. అంటాడు ఆదిత్య. నిజం చెప్పడం బెటర్.. అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అంటాడు ఆదిత్య.
karthika deepam 2 october 2021 full episode
నిజం చెబితే పిల్లలు అపార్థం చేసుకుంటారని పెద్దోడు వద్దంటున్నాడు అని సౌందర్య అంటుంది. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. మమ్మీ పిల్లలు కనిపించడం లేదు అంటాడు కార్తీక్.
ఇంతలో హిమ బాధపడుతూ ఉండటం చూసి దీప అక్కడికి వెళ్తుంది. ఏమైందమ్మా అంటే.. మమ్మీ డాడీ మంచోడే కదా.. మోనితే చెడ్డది కదా అంటుంది హిమ. తర్వాత కిందికి వచ్చి.. మనం దాచిన పేపర్ కనిపించడం లేదు. ఏమైందో అర్థం కావడం లేదు.. అని కార్తీక్ కు చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. కొంపదీసి పిల్లలు చూశారా.. అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.