Karthika Deepam - 2 : కుబేర కన్నతండ్రి కాదని తెలుసుకున్న దీప.. జ్యోత్స్నతో అందరికీ ప్రమాదమే
Karthika Deepam – 2 : కార్తీక దీపం – 2 సీరియల్ నేటి (మే 28, 2025) ఎపిసోడ్‍లో తాను కుబేర సొంత కూతురినేనా అని అనసూయను దీప అడుగుతుంది. అవును అంటుంది అనసూయ. మా అమ్మకు పురుడు పోసేటప్పుడు అక్కడే ఉన్నావా అంటే అవునంటుంది అనసూయ. పుట్టగానే నిన్ను ఎత్తుకొని మీ నాన్న మురిసిపోయాడని చెబుతుంది. దీంతో కుబేర ఫొటోను తీసుకొచ్చి అనసూయతో ఒట్టు వేయించి తాను తాను కుబేర, అంబుజవల్లి కన్నకూతురినేనా నిజం చెప్పమని గట్టిగా ప్రశ్నిస్తుంది దీప. దీంతో అనసూయ నిజం చెప్పక పరిస్థితి ఏర్పడి కుబేర నీ కన్నతండ్రి కాదు అని చెబుతుంది. నువ్వు నా తమ్ముడి (కుబేర) సొంత కూతురివి కాదు. ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని నా తమ్ముడు నా దగ్గర మాట తీసుకున్నాడు. దీప తన సొంత కూతురిగానే పెరగాలని నాతో చెప్పాడు. అందుకే ఈ నిజం నాకు, మీ నాన్నకు తప్ప ఎవరికీ తెలియదు అని అనసూయ నిజం చెప్పేస్తుంది.
Karthika Deepam – 2 : కుబేర కన్నతండ్రి కాదని తెలుసుకున్న దీప.. జ్యోత్స్నతో అందరికీ ప్రమాదమే
మరి తాను ఎవరి కూతురినో తెలుసా అని దీప అడుగుతుంది. నువ్వు బస్టాండ్‍లో దొరికావంట, నీ అమ్మానాన్నలు ఎవరో తెలియదని అనసూయ అంటుంది. దీప కన్నీరు పెట్టుకుంటుంది. గుడిలో దీపాలు వెలిగిస్తూ బాధపడుతూ కూర్చుంటుంది దీప. నువ్వు మా సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యల కన్నకూతురివి. నా సొంత మరదలివి. ఆ యావదాస్తికి ఏకైక వారసురాలివి అని కార్తీక్ బాబు చెప్పిన నిజాన్ని తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇక్కడికే వచ్చి ఉంటావని అనుకున్నానని కార్తీక్ అంటాడు.
అసలు మీరు నిజం చెప్పకుంటే బాగుండేది అంటుంది దీప.
దానికి నేను చెప్పిన విషయం గురించి అనసూయను అడిగావా అని దీపను ప్రశ్నిస్తాడు కార్తీక్. అడిగానంటుంది దీప. నేను చెప్పిన విషయాలను చెప్పావా అంటే.. లేదంటుంది. ఎందుకు చెప్పుకోవాలి, అసలు మీరు నాకు నిజం చెప్పకుండా ఉంటే బాగుండేదని దీప అంటుంది. ఎందుకు అంటే ఇన్నేళ్లు కుబేర కూతురిగా బతికా.. అలాగే వదిలేయాల్సిందని అంటుంది దీప. ఇలా ఆలోచిస్తావని అనుకోలేదని కార్తీక్ అంటాడు.
మీరు చెబితే నేను ఆ ఇంటి వారసురాలిని అని వాళ్లు నమ్ముతారా? నమ్మినా నాపై ఉన్న ఆసహ్యాన్ని పక్కన పెట్టి కూతురిలా చూస్తారా?, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారా అని దీప ప్రశ్నిస్తుంది. ఇవన్నీ జరగాలంటే మనసు రావాలని కార్తీక్ అంటాడు. తాను దురదృష్టవంతురాలిని అని దీప అంటుంది. అసలైన తల్లిదండ్రులకు దూరమయ్యా. పేరు పెట్టిన అమ్మ ఊహ తెలియక ముందే చనిపోయింది. పెంచిన తండ్రి యాక్సిడెంట్‍లో చనిపోయాడు. ఇప్పుడు మీరేమో సుమిత్ర, దశరథ్ నీ కన్న తల్లిదండ్రులు అంటున్నారు అని దీప అంటుంది.
ఇప్పుడు నా వల్లే సుమిత్ర, దశరథ్ ప్రమాదంలో ఉన్నారని దీప అంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే.. నేనే వాళ్ల కూతురిని అని నాకు తెలిసిందని జ్యోత్స్నకు తెలిస్తే.. నన్నైనా చంపుతుంది లేదా సుమిత్ర, దశరథ్‍లను అయినా లేకుండా చేస్తుందని అంటుంది. నేను ఎటైనా దూరంగా వెళ్లిపోతానని దీప అంటుంది. ఎటు అని కార్తీక్ అడుగుతాడు. కుబేరను బతికించుకునే అవకాశం ఉంటే ప్రయత్నించే దానివా అని దీపను అడుగుతాడు కార్తీక్. అవునంటుంది దీప. మరి వీళ్లను ఎందుకు వదిలేసి దూరంగా పోతానని అంటున్నావని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నీ కంటే ముందే ఆ ఇంట్లో ప్రమాదం పుట్టింది. ఇప్పుడు నీ స్థానంలో ఉన్న జ్యోత్స్నఆ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అంటాడు కార్తీక్. అయితే నిజం చెప్పేయండి, దాసుతో చెప్పించండని దీప అంటుంది. మీ మేనత్త, మేనమామను కాపాడే బాధ్యత మీరు తీసుకోండని అంటుంది.
జ్యోత్స్నను చెడ్డదానిగా నిరూపించినా నమ్మరు. నేరం పారిజాతంపైకి పోతుందని దీప అంటుంది. ఇన్నాళ్లు సొంత కూతురిలా చూసిన జ్యోత్స్నను వాళ్లు వదులుకోరు అంటుంది దీప. అప్పుడు నేను నా తల్లిదండ్రులను ఎలా చూడాలని, నా మీద ప్రేమ ఉండదని బాధపడుతుంది దీప. నాకు, శౌర్యకు కూడా ప్రమాదమే, ఇంక ఏం లాభం ఉంటుందని అంటుంది. అందుకే కదా అత్తయ్య, మామయ్యకు కాకుండా నిజం ముందుగా నీకు చెప్పానంటాడు కార్తీక్.
జ్యోత్స్న ఏ ప్రమాదం తలపెట్టకుండా ఆపలేం. ఎందుకంటే జ్యోకు ఆస్తి కావాలి. ఆ ఇంటి వారసత్వం కావాలి. దాని కోసం ఎంత మందినైనా చంపుతుంది. పారిజాతం అమ్మమ్మ అలా తయారు చేసింది తనను అంటాడు కార్తీక్. మీరు జ్యోత్స్నకు భయపడుతున్నారా అని దీప ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదు అని చెప్పాలంటే ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, నమ్మకపోయినా నమ్మించగలం, కానీ ఇదంతా జరగాలంటే కాస్త సమయం పడుతుందని అంటాడు కార్తీక్.
వాళ్ల పక్కనే ఉన్న ప్రమాదాన్ని కలిసి ఆపాలని, ఇద్దరం కలిసి జోత్స్నకు బుద్ధి చెప్పాలని కార్తీక్ అంటాడు. ఆలోచించకు దీప.. మనకు టైమ్ లేదు అని చెబుతాడు. దాసుకు గతం గుర్తొచ్చిందనే అనుమానంతో జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిందని, ఆయన కూడా ప్రమాదంలో ఉన్నాడని అంటాడు. అందుకే నన్ను ఆ ఇంటికి వెళ్లనివ్వు. అందరికీ నువ్వేంటో తెలిసేలా చేస్తా. కాస్త టైమ్ ఇవ్వు. అందరికీ నిజం చెబుతా అని కార్తీక్ అంటాడు. దీప ఆలోచనలో పడుతుంది.
ఇప్పుడు నీ సపోర్ట్ కావాలి దీప అని కార్తీక్ అడుగుతాడు. మనం ఇద్దరం ఒక మాట మీద ఉంటే జ్యోత్స్నకు బుద్ధి చెప్పి, ఈ రెండు కుటుంబాలను కలపగలమని కార్తీక్ అంటాడు. “దేవుడి సన్నిధిలో ఉండి మాటిస్తున్నా.. నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే బాధ్యత నాది” అని కార్తీక్ అంటాడు. ఎక్కడా రక్తం చుక్క రాకుండా ఇదంతా చేస్తా. నువ్వు మాత్రం ఆవేశం తగ్గించుకోవాలని చెబుతాడు. నీ ఆవేశం వేరే వాళ్లకు అవకాశం కాకుడదు, నువ్వు కొత్త దీపలా కనిపించాలని అంటాడు కార్తీక్. మనం ఇచ్చే షాక్‍కు పారిజాతానికి, జ్యోత్స్నకు తాత కాళ్లు పట్టుకోవడం తప్ప మరో ఆప్షన్ ఉండకూడదంటాడు. ఇంతలో గుడిలో గంట మోగుతుంది. మనకు అండగా ఉన్నానని దేవుడే చెబుతున్నాడని, నా దేవత నాకు సపోర్టుగా లేకపోతే ఎలా అని అంటాడు. దీప, కార్తీక్ ఇద్దరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటారు. దీంతో కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Arjun Reddy Racha Movies : సినిమాల నుంచి కొంతకాలంగా విరామం తీసుకున్న నటుడు మంచు మనోజ్.. తాజాగా ‘భైరవం’…
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ రాజకీయాల్లో భిన్నతలకు నిదర్శనంగా నిలిచాయి. "మా…
Tips To Control Anger : ప్రస్తుత కాలంలో కూడా చాలామంది ఆవేశాలకు పోయి అనర్ధాలను తెచ్చుకుంటున్నారు.క్ష్యనికావేశం క్షణాల్లో శత్రువులను…
Pawan Kalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైన సంగతి తెలిసిందే.…
Toda Gold Price : హైదరాబాద్ Hyderabad City నగరంలో బంగారం మరియు వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. 24…
తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులని ప్రకటించారు. 2014…
Gular Indian Fig : ప్రస్తుత కాలంలో ప్రజలు ఈ పండుని తేలిగ్గా తీసుకొనిస్తున్నారు.పురుగులు ఉంటాయి అని చెప్పి తినడమే…
Chandrababu : తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ…
This website uses cookies.