Karthika Deepam 20 Sep Monday Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. కేవలం సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో మాత్రం మనం తెలుసుకుందాం. సోమవారం ఎపిసోడ్ 1149 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోనితే.. హిమను చంపించిందనే విషయాన్ని కోర్టులో దీప, కార్తీక్ రుజువు చేయలేకపోతారు. దానికి కారణం.. దీప, కార్తీక్ సెల్ లో ఉన్న వీడియోలను రత్నసీతతో డిలీట్ చేయిస్తుంది మోనిత. దీంతో తను ఇక ధైర్యంగా ఉంటుంది. తనకు శిక్ష పడాలంటే.. ప్రూఫ్ ఉండాల్సిందేనని భావించి.. ముందే ఆపనిని రత్నసీతతో చేయిస్తుంది.
నేను హిమను చంపించకున్నా.. చంపించానని చెప్పి. నా మీద నింద మోపుతున్నారు. ఆరోజు కార్తీక్ కూడా కారులో ఉన్నాడు. ఇంత పిచ్చిగా ప్రేమించే నా కార్తీక్ ను నేను ఎందుకు చంపుకోవాలని అనుకుంటాను. అసలు.. అంజి అనే డ్రైవర్ ఎవరో కూడా నాకు తెలియదు. అసలు.. ఆ మనిషే లేడు. అంజి అనే వాడు వీళ్లు సృష్టించిన ఒక కల్పితం. నేను హిమను చంపాను అని ముందు అన్నారు. సాక్ష్యం చూపించండి.. అంటూ సాక్ష్యం చూపించలేకపోయారు. వీడియో డిలీట్ అయింది అన్నారు. ఇప్పుడు అంజి పేరు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే నేను హిమను చంపించానని అంటే.. అంజి అనే వ్యక్తిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి.. అని అడుగుతుంది మోనిత.
దీంతో.. ఖచ్చితంగా అంజిని తీసుకొస్తాం.. అంజితోనే సాక్ష్యం చెప్పిస్తాం యువర్ ఆనర్ అని అంటుంది దీప. దీంతో అంజి అనే వ్యక్తి రాడు. మీరు తీసుకురాలేరు.. అంటుంది మోనిత. దీంతో ఎందుకు.. అని అడుగుతారు. ఎందుకంటే.. అంజి అనే వ్యక్తి లేడు. అదంతా వీళ్ల సృష్టి అని చెబుతుంది మోనిత. అంతా కట్టుకథ అంటుంది.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే అని బల్ల గుద్ది మరీ చెబుతుంది మోనిత. దీంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. దీంతో ఇక కార్తీక్ ఆగలేక.. తన ఆగడాలు అన్నింటినీ కోర్టుకు విన్నవిస్తాడు.
ప్రతిసారి నా జీవితంలోకి చొచ్చుకురావాలని ప్రయత్నం చేసింది. నేను మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్న విషయం ఒక్కటే. ఈ మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాదు.. కాదు.. కాదు.. అని గట్టిగా కోర్టులోనే అరిచి చెబుతాడు కార్తీక్.
కార్తీక్ ఈ విషయం చెబుతుండగానే దీపకు తన పాత రోజులు గుర్తొస్తాయి. కార్తీక్ తనను అవమానించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిగొట్టిన విషయం తెలిసిందే. అప్పుడు గర్భవతిగా ఉన్న దీపను ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టే సమయంలో దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాదు.. కాదు.. కాదు.. అంటూ గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఇప్పుడు కోర్టులో కూడా సేమ్ మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను కాదు.. కాదు.. కాదు.. అంటాడు. అదే విషయాన్ని దీప గుర్తుకు తెచ్చుకుంటుంది.
ఇదే విషయాన్ని మోనిత కూడా తీస్తుంది. అప్పుడు దీపను కూడా కార్తీక్ అలాగే అన్నాడు. దీప నా భార్యే కాదన్నాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని తాను కాదన్నాడు. కానీ.. ఇప్పుడు దీపను మళ్లీ చేరదీశాడు. దీపకు పుట్టిన పిల్లలను తన పిల్లలే అని చేరదీశాడు.. అని మోనిత అంటుంది.
కొన్నాళ్లు పోతే.. నన్ను కూడా ఆదరిస్తాడేమో.. అని ఆశపడుతుంది మోనిత. ఆయన కాదన్నా.. ప్రపంచమంతా అవునన్నా కాదన్నా.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మాత్రం కార్తీకే.. అని స్పష్టంగా కోర్టులో చెప్పేస్తుంది మోనిత.
దీంతో కార్తీక్ కు తీవ్రంగా కోపం వస్తుంది. దీప, నువ్వు ఒక్కటా. దీప.. నేను పెళ్లి చేసుకున్న భార్య. నా సొంత భార్య. నువ్వు, ఆమె ఎప్పుడూ ఒక్కటి కాలేరు. అప్పుడు మా మధ్య మనస్పర్థలు రావడానికి కారణం కూడా నువ్వే. నీ వల్లనే మా కాపురం ఇలా అయింది. మమ్మల్ని విడదీయడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. దీపకు వేరే సంబంధం అంటగట్టావు. ఇలా నువ్వు చేసిన చాలా పనుల వల్లనే నేను దీపను అనుమానించాల్సి వచ్చింది. నేను అనుమానించినా.. ఏం చేసినా.. ఆమె నా భార్య.. ఎఫ్పటికైనా నేను చేరదీయాల్సిందే. తన కడుపులో పుట్టిన బిడ్డలు కూడా నా బిడ్డలు. కానీ.. నువ్వు.. ఎవరు. అసలు.. నీకు నాకు ఏంటి సంబంధం. కేవలం నన్ను ప్రేమించానన్న ఒకే ఒక్క కారణంతో నా జీవితంలో ఇన్ని ఆటలు ఆడుకుంటున్నావు.. అంటూ కార్తీక్ కూడా మోనితపై సీరియస్ అవుతాడు.
ఏది ఏమైనా.. కోర్టులో సరైన సాక్ష్యాలు ఉంటేనే మోనితకు కేసు పడే అవకాశం ఉంటుంది. కార్తీక్ దగ్గర మోనిత తప్పు చేసింది అని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కేవలం.. మోనిత.. కార్తీక్ ను ప్రేమించింది అని చెప్పడం తప్పితే.. మోనిత వల్ల కార్తీక్ జైలుకు వెళ్లాడు అనే విషయం తప్పితే.. మోనితే హిమను చంపించింది.. అనడానికి కోర్టులో ఏం రుజువు చేయలేకపోయారు కార్తీక్.
అయితే.. మోనితే హిమను చంపింది.. అనడానికి తమ దగ్గర అంజి అనే సాక్షి ఉన్నాడని.. కోర్టు పర్మిషన్ ఇస్తే.. అంజిని తీసుకొచ్చి సాక్ష్యం చెబుతామని కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు కార్తీక్, దీప. ఆ తర్వాత అంజి కోసం వెతుకుతుంటారు కార్తీక్, దీప. ఇద్దరు కలిసి అంజి జాడ కోసం అక్కడా ఇక్కడా తిరుగుతుంటారు. అంజి జాడ కోసం తెలిసిన వాళ్లను అడుగుతారు. దుర్గను కలిస్తే అంజి జాడ తెలుస్తుందేమోనని అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్లకు అంజి దొరుకుతాడా? అంజి వచ్చి సాక్ష్యం చెబుతాడా? అంజి సాక్ష్యం చెబితే.. కోర్టు హిమను చంపినందుకు మోనితతో పాటు అంజికి కూడా శిక్ష వేస్తుందా? ఒకవేళ తనకు కూడా శిక్ష పడుతుందని అంజి.. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకుంటాడా? లేక.. తప్పించుకొని పారిపోతాడా? అనే విషయాలు తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్‌కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.