Samantha : మేం ఎప్పటికీ కలిసే ఉంటాం.. సమంత కామెంట్స్ వైరల్
Samantha సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ఇప్పుడు ఎంతటి హాట్ టాపిక్‌గా మారాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కేశారని కూడా రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఒకరినొకరు విడిచి దూరంగా ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వార్తలను ఎప్పుడూ వెంటనే ఖండించే సమంత మాత్రం ప్రస్తుతం సైలెంట్‌గా ఉండి తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇక్కడే అసలు సమస్య, కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
samantha akkineni with her team at tirumala
శ్రీవారి సేవలో సమంత.. Samantha
పర్సనల్ విషయాల మీద వచ్చే రూమర్లను సమంత ఎప్పుడూ సెటైరికల్‌గా ఖండిస్తుంటుంది.కానీ ఈ సారి మాత్రం అలా చేయడం లేదు. సమంత తన విడాకుల రూమర్ల గురించి పట్టించుకోవడం లేదో.. అది నిజమేనని అలా వదిలేస్తోందో గానీ.. ప్రస్తుతం ఆమె తన పనులతో బిజీగా ఉంది. విచిత్రం ఏంటంటే సమంత ఇప్పుడు తిరుమలలో ప్రత్యక్షమైంది. తన భర్త నాగ చైతన్యతో కాకుండా తన టీంతో కలిసి తిరుమలకు వెళ్లింది. ఇలాంటి వాటి వల్ల విడాకుల రూమర్లపై ఇంకా నమ్మకం కుదురుతోంది.
samantha akkineni with her team at tirumala
మామూలుగా అయితే సమంత, నాగ చైతన్యలు ఈ సమయంలో కలిసి వెళ్తే రూమర్లు చెక్ పడేది. కానీ తన టీంమేట్స్‌తో కలిసి వెళ్లింది. పైగా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కలిసి ప్రార్థనలు చేశాం.. ఎప్పటికీ కలిసి ఉండే సభ్యులం అంటూ తన టీం గురించి సమంత చెప్పింది.కానీ భర్తతో విడిపోతోంది అనే రూమర్లపై మాత్రం నోరు విప్పలేదు. ఈ మౌనం అర్దాంగీకారాన్నే సూచిస్తున్నట్టుంది. మొత్తానికి ఈ విడాకుల వార్తలు, రూమర్లకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
