Home » Entertainment » Karthika Deepam 22 March 2022 Full Episode
Entertainment

Karthika Deepam 22 March Today Episode : ఇంద్రుడు, చంద్రమ్మ దగ్గర పెరిగిన శౌర్య.. హిమ మీద పగను ఇంకా పెంచుకొని పేరు జ్వాలగా మార్చుకున్న శౌర్య.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: March 22, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 22 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 1306 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆటో మీద వదిలేదేలే అని రాశాను.. ఎవరిని వదలరు.. నాలాంటి వాళ్లనా అని శౌర్యను అడుగుతాడు ఆ వ్యక్తి. దీంతో తనకు హిమ గుర్తొస్తుంది. అమ్మానాన్నలను చంపేసిన ఆ హిమను వదిలేదేలే అంటాడు. మీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దీంతో జ్వాల అంటుంది. మంచి పేరు.. పేరు నిలబెట్టుకున్నావు అంటాడు. ఆ తర్వాత హిమ ఎక్కడున్నావే.. ఎక్కడున్నావు. నిన్ను వదిలేదేలే అని అనుకొని ఆటో స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య.

Advertisement

karthika deepam 22 march 2022 full episode

మరోవైపు హిమ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. కేక్ కట్ చేయకుండా ఆగుతుంది హిమ. ఇంతలో రావాల్సిన గెస్ట్ వచ్చాడు అంటాడు నిరుపమ్. హిమకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతాడు ప్రేమ్. థాంక్స్ ప్రేమ్ అంటంది హిమ. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కాసేపట్లో వస్తారు. నీ బర్త్ డే ఫోటోషూట్ చేస్తారు అంటాడు ప్రేమ్. మళ్లీ అన్ని గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ ఎందుకు.. గెస్ట్ లను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటాడు ఆనంద రావు. ఇంతలో ఒక బర్త్ డేకు ఇన్ని కేకులు ఉన్నాయేంటి అని గెస్ట్ అడుగుతాడు. అది శౌర్యది. మా రెండో మనవరాలు అని అంటుంది సౌందర్య.

Advertisement

మరోవైపు శౌర్య బర్త్ డే వేడుకలు ఆటో యూనియన్ వాళ్లు ఘనంగా జరపడం కోసం ప్లాన్ చేస్తారు. ఇవన్నీ నాకు నచ్చవు అంటే వినరా అంటుంది శౌర్య. నీకు నచ్చినా నచ్చకపోయినా మాకు నీ పుట్టిన రోజు పండుగ రోజు అంటారు ఆటో డ్రైవర్లు. కానీ.. నాకు  నా పుట్టిన రోజు నచ్చదు అంటుంది శౌర్య.

నేను పుట్టిన రోజే ఆ హిమ కూడా పుట్టింది. అది ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే రోజు. ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు.. అని అనుకుంటుంది. కానీ.. వాళ్లంతా బలవంత పెట్టడంతో తప్పక బర్త్ డే వేడుకలు జరుపుకుంటుంది. సరే సరే.. నేను వెళ్తున్నా. నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

కట్ చేస్తే.. సెంట్రల్ జైలు నుంచి ఇంద్రుడు, చంద్రమ్మ రిలీజ్ అవుతారు. బయటికి రావడమే.. వెంటనే ఎవరి పర్సు కొట్టాలా అని ఎదురు చూస్తుంటారు. కానీ.. అలవాటు పోవడంతో చేయి వణుకుతుంది అంటాడు ఇంద్రుడు. దీంతో దొంగతనం అనేది గొప్ప కల. దానికి అంకితభావం ఉండాలి. నేను చేస్తాను చూడు అంటుంది చంద్రమ్మ.

Karthika Deepam 22 March Today Episode : జైలు నుంచి విడుదల కాగానే జైలర్ పర్సు కొట్టేసిన ఇంద్రుడు, చంద్రమ్మ

ఓ వ్యక్తి దగ్గర పర్సు కొట్టి ఆ పర్సులో కొన్ని డబ్బులు తీసుకొని ఆ పర్సును తిరిగి మళ్లీ తన జేబులోనే పెట్టబోతుంది చంద్రమ్మ. అప్పుడే అక్కడి వచ్చిన శౌర్య తనను పట్టుకుంటుంది. ఇంతలో పర్సు కిందపడింది సార్ అని ఆ వ్యక్తికి చెబుతుంది చంద్రమ్మ.

అతడు ఎవరో కాదు.. జైలులోని పోలీస్ జైలర్. అతడిని చూసి షాక్ అవుతారు. ఇంతలో జ్వాలను చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. పర్సు పడిపోయిందో కొట్టేశారో నాకు బాగా తెలుసు. మీరు మారరా ఇక అంటాడు పోలీస్. పదరా అంటాడు. దీంతో వద్దు సార్.. వీళ్లకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వీళ్లను నేను మారుస్తాను అంటుంది జ్వాల.

సరే.. ఒక పని చేయండి.. నాకు తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడు. వాళ్లకు వంట చేసే భార్యాభర్తలు కావాలంట. వాళ్లను తీసుకెళ్లి అక్కడ పనిలో పెట్టు అని చెబుతాడు. దీంతో మీరు సూపర్ సర్. మంచి మనసుతో ఉద్యోగం ఇప్పిస్తున్నారు. నెంబర్ ఇవ్వండి అంటుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి