Home » Entertainment » Karthika Deepam 22 October 2021 Friday Episode
Entertainment

Karthika Deepam 22 Oct Today Episode : జైలు నుంచి మోనిత విడుదల.. కార్తీక్ అమెరికా వెళ్లకుండా మోనిత మరో ప్లాన్.. కార్తీక్ షాక్

Authored By
Varun G
The Telugu News | Published on: October 22, 2021, 2:10 pm
Advertisement

Karthika Deepam 22 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1177 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పేపర్ లో మోనిత విడుదల ఆర్టికల్ చదివి కార్తీక్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. మోనిత ఏం చేస్తుందోనని అందరూ భయపడతారు. సరిగ్గా కార్తీక్ ఫ్యామిలీ అమెరికా వెళ్లే సమయానికి మోనిత విడుదల కావడం ఏంటి.. అని షాక్ అవుతారు. ఇకనైనా కార్తీక్ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని సౌందర్య అంటుంది. ఒకవేళ వీళ్లు వెళ్లిపోయిన తర్వాత తను ఇంటి మీదికి వస్తుందేమో అని సౌందర్య టెన్షన్ పడుతుంది.

Advertisement

karthika deepam 22 october 2021 friday episode

కట్ చేస్తే కార్తీక్.. భారతి ఇంట్లోకి వెళ్తాడు. రవి, భారతి అని పిలుస్తాడు. భారతి ఇంటికి వచ్చిన మోనిత.. కార్తీక్ మాటలను వింటుంది. నా కార్తీక్ వచ్చాడు.. అని అనుకుంటుంది.. ఫుల్ ఖుషీ అవుతుంది. హాస్పిటల్ లో కలుద్దాం అన్నావు కదా అంటాడు రవి. ఈ టైమ్ కు మీరు ఇంట్లోనే ఉంటారు కదా అని అంటాడు కార్తీక్. మనం హాస్పిటల్ లో కలుద్దామా? అని అంటే అదంతా తర్వాత.. విడుదల అయిందట కదా.. నీ ఫ్రెండ్ కలిస్తే మేము అమెరికా వెళ్తున్నాం అని చెప్పు. తను ఎక్కడికీ రాలేదులే. ఇకనైనా బుద్ధిగా ఉండమని చెప్పు.. అని భారతితో అంటాడు కార్తీక్.

Advertisement

భారతి మీ ఫ్రెండ్ కు చెప్పు.. ఈ దేశాన్ని వదిలేసి వెళ్తున్నాం. హాస్పిటల్ కు సంబంధించిన పేపర్స్ అన్నీ సిద్ధం చేశాను.. అని కార్తీక్ చెబితే రవి, భారతి ఏం మాట్లాడరు. నాకు చాలా పనులు ఉన్నాయి. హాస్పిటల్ కు వెళ్లి డాక్యుమెంట్స్ చదవండి.. సంతకం చేయండి.. ఇక అది మీ హాస్పిటల్ అవుతుంది వస్తాను.. అని కార్తీక్ వెళ్లబోయే సమయానికి మోనిత వచ్చి కార్తీక్ కాళ్ల మీద పడుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు.

Karthika Deepam 22 Oct Today Episode : భారతి ఇంట్లో మోనితను చూసి కార్తీక్ షాక్

ఏయ్.. ఛీ.. ఛీ.. లే.. భారతి ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారా? అని ప్రశ్నిస్తాడు. ఇందాకటి నుంచి అడుగుతుంటే ఏం మాట్లాడటం లేదు. ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకున్నారా? ఇంత ఘోరమా రవి అంటాడు. శభాష్ భారతి.. నువ్వు సూపర్. నీ ఫ్రెండ్ మీద ఎంత జాలి నీకు. ఇన్నాళ్లు నాతో బాగానే మాట్లాడుతూ తనకు హెల్ప్ చేస్తున్నావా? ఏం రవి.. నువ్వు కూడా తక్కువేం కాదు కదా. ఫ్రెండ్ కు మంచి గిఫ్ట్ ఇచ్చావు అంటాడు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది అంటాడు రవి. డైరెక్ట్ గా ఇంటికి వస్తే.. వెళ్లిపోమని డైరెక్ట్ గానే మొహం మీద తలుపేయాలి అని అంటాడు కార్తీక్.

Advertisement

karthika deepam 22 october 2021 friday episode

నన్ను వదిలేసి వెళ్తావా? నువ్వు వెళ్తుంటే నేను చూస్తుంటూ టాటా.. బైబై.. అంటూ సాగనంపుతానని అనుకున్నావా? నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు కార్తీక్. నువ్వు ఎక్కడికి వెళ్లలేవు.. వెళ్లనీయను అంటుంది మోనిత. పద్మవ్యూహంలో బంధించాను నిన్ను. అందులో నుంచి వెళ్లడం అసాధ్యం.. అంటుంది మోనిత. కార్తీక్ నువ్వు అమెరికా ప్లాన్ చేసుకొని హాయిగా వెళ్తున్నానని అనుకుంటున్నావు. నా ప్లాన్స్ ఏవో నాకు ఉంటాయి కదా.. అంటుంది. ఇంతలో కార్తీక్ కు దీప ఫోన్ చేస్తుంది. నేను హాస్పిటల్ కు వెళ్లలేదు. కొందరికి పాత లెక్కలు అప్పజెప్పాలి కదా అంటాడు. ఫోన్ కట్ చేశాక.. కార్తీక్ నీకో చిన్న పాయింట్ చెప్పనా.. ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్లినా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు.. ఉండనీయను.. అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి