Home » Entertainment » Karthika Deepam 23 October 2021 Episode
Entertainment

Karthika Deepam 23 Oct Today Episode : మోనిత మాటలకు భయపడి అమెరికా వెళ్లకుండా కార్తీక్ ఆగిపోతాడా?

Authored By
Varun G
The Telugu News | Published on: October 23, 2021, 2:10 pm
Advertisement

Karthika Deepam 23 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ 23 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకే నీ పెళ్లాం మీద అనుమానం వచ్చిందంటే.. రేపు సమాజానికి రాదా.. అప్పుడు పాపం దీపక్కను నలుగురు నానా మాటలు అంటారు కార్తీక్. అసలే లోకులు కాకులు. దీపక్కను పతిత అంటారేమో.. అంటూ మోనిత ఎక్కువగా మాట్లాడుతుంది. దీంతో మోనిత షట్ అప్ అంటాడు కార్తీక్. నా నోరు నువ్వు మూయించగలవేమో కానీ.. బయటికి వాళ్ల నోర్లు మూయించలేవు.. అంటుంది మోనిత.

Advertisement

karthika deepam 23 october 2021 episode

గతంలో నువ్వు దీపతో విడాకులు కోరుకున్నప్పుడు.. జడ్జి గారు ఎందుకు అని అడిగితే.. నా భార్య మీద అనుమానం అని కూడా చెప్పలేకపోయావు. ఇప్పుడు ఎలా దీప మీద అనుమానం గురించి సమాధానం చెప్పుకుంటావు. నువ్వు అమెరికా వెళ్లినా.. ఆఫ్రికా వెళ్లినా నేను నిన్ను వదులుతానా? నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ కుటుంబం ఇక్కడే ఉంటుంది కదా. వాళ్లను సమాజం, మీడియా వదిలిపెట్టదు కదా.. వాళ్లకైనా సమాధానం చెప్పాలి కదా.. వాళ్లంతా తట్టుకోగలరా చెప్పు. ఇంటి ముందుకు వచ్చి టెంట్ పర్మినెంట్ గా వేసుకొని రచ్చ రచ్చ చేస్తాను. అత్తగారికేమో ప్రెస్టేజ్ ఎక్కువ.. మామ గారికేమో రోగాలు ఎక్కువ. గంట గంటకు టీవీలో చెప్పిందే చెప్పి రచ్చ రచ్చ చేస్తారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు. విమానంలో హాయిగా వెళ్లిపోతావా? అంటుంది మోనిత.

Advertisement

మోనిత.. ఇది కరెక్ట్ కాదు.. అంటూ భారతి హెచ్చరించేసరికి.. నీకు అవసరం లేదు అంటుంది మోనిత. ఇది మొగుడు పెళ్లాల విషయం.. నువ్వు ఇన్వాల్వ్ కాకు అంటుంది మోనిత. నాకు అమెరికా కొత్తేమీ కాదు. అక్కడ అందరికీ చెప్పా. నేను పుట్టి పెరిగింది అక్కడే.. అంటుంది మోనిత. ఇప్పుడు చెప్పు.. వెళ్తావా అమెరికా.. అంటూ బెదిరిస్తుంది మోనిత.

arthika Deepam 23 Oct Today Episode : అమెరికా వెళ్లకుండా కార్తీక్ ను ఆపడం కోసం తెగ ట్రై చేసిన మోనిత

భారతి కొన్ని మంచినీళ్లు ఇవ్వవా? అని అడుగుతాడు కార్తీక్. బాటిల్ తెచ్చి ఇస్తుంది భారతి. ఆ బాటిల్ మోనితకు ఇచ్చి.. అప్పటి నుంచి అరిచి అరిచి గొంతు ఎండిపోయి ఉంటుంది. మంచి నీళ్లు తాగు.. అని బాటిల్ ఇస్తాడు. నువ్వు ఏం చేసినా నేను అమెరికా వెళ్తున్నాను.. వెళ్లి తీరుతా అని చెప్తాడు కార్తీక్. భారతి ఇప్పటికైనా నీ ఫ్రెండ్ అసలు స్వరూపం తెలిసిందా? అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.

Advertisement

కట్ చేస్తే.. అన్ని సామాన్లు సర్దుతుంటుంది దీప. కార్తీక్ ఎక్కడున్నాడు అని అంటుంది. వస్తున్నాడా? ఫ్లైట్ టైమ్ అవుతోంది అని అంటుంది సౌందర్య. ఫోన్ చేశా కానీ.. డాక్టర్ బాబు మాటల్లో ఏదో తేడా ఉంది అని అంటుంది దీప. ఇంతలో మాలతి ఏడ్చుకుంటూ వస్తుంది. మాలతి ఏమైంది అని అడుగుతుంది సౌందర్య. ఇంతలో డాక్టర్ బాబు కూడా వస్తాడు.

karthika deepam 23 october 2021 episode

నా మొగుడు అనుమానంతో నాకు నరకం చూపిస్తున్నాడు అని అంటుంది మాలతి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. తన పిల్లలు తనకు పుట్టలేదని అంటున్నాడు అంటుంది. అవన్నీ విని.. కార్తీక్ షాక్ అవుతాడు. కంటికి ఎదురుగా పిల్లలు కనిపిస్తే నాకు పుట్టలేదని కసురుకుంటాడమ్మా అంటుంది దీప. నాన్న సరిగ్గా లేకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు.. అని హిమతో శౌర్య అంటుంది. కొందరు డాడీలే మంచి వాళ్లు.. అందరు డాడీలు మంచి వాళ్లు కాదు అంటుంది హిమ. అమ్మలందరూ మంచోళ్లే కానీ.. నాన్నలే చెడ్డోళ్లు ఉంటారంట.. అంటుంది శౌర్య. మరోవైపు విమానానికి సమయం అవుతున్నా కార్తీక్ రెడీ కాడు. దీంతో అందరూ షాక్ అవతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి