Karthika Deepam 24 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 1308 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య, ప్రేమ్ మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరుగుతుంది. తర్వాత ఆటో స్టార్ట్ చేసి అక్కడి నుంచి శౌర్య.. ఇంద్రుడు, చంద్రమ్మను తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు హిమ.. బాధగా కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. తనకు చిన్నప్పుడు తన తల్లి అన్నం తినిపించడం గుర్తొస్తుంది. హిమ.. ఏంటి భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. నువ్వు డాక్టర్ వు అయి ఉండి ఏదేదో ఆలోచిస్తున్నావు. ఏదో లోకంలో ఉంటున్నావు ఎందుకు అని అడుగుతుంది.
దీంతో నేను బాగానే ఉన్నాను నానమ్మ అంటుంది హిమ. చిక్ మగళూరులో జరిగిన ఘటన తనను ఇప్పటికీ బాధపెడుతోంది అని అంటాడు ఆనంద రావు. శౌర్య ఇప్పుడు ఎలా ఉందో కదా నానమ్మ అంటుంది హిమ. శౌర్య కోసం మనం చేయనటువంటి ప్రయత్నం లేదు. వెతుకుతూనే ఉన్నాం కదా. మన ప్రయత్నం మనం చేశాం. ఇక దేవుడి మీదే భారం అంటుంది సౌందర్య. తను వెళ్లిపోయినప్పటి నుంచి మనం తనను వెతుకుతూనే ఉన్నాం. కానీ.. తను మనల్ని కావాలని తప్పించుకొని తిరుగుతోందని నా అనుమానం అంటాడు ఆనంద రావు.
నాకు కూడా అదే అనిపించిందండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు అంటుంది సౌందర్య. ఇంతలో అన్నం తినకుండా చేయి కడుక్కుంటుంది హిమ. ఏమైంది అంటుంది సౌందర్య. ఆకలిగా లేదు నానమ్మ. పాపం శౌర్య తిన్నదో లేదో.. ఎలా ఉందో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ.
కట్ చేస్తే శౌర్యతో పాటు ఇంద్రుడు, చంద్రమ్మ.. సత్యం ఇంటికి వస్తారు. నాకు వంట చేస్తే చాలు.. మిగితా పనుల కోసం వేరే పనివాళ్లు ఉన్నారు అంటాడు సత్యం. ఇంతలో ప్రేమ్ ఇంట్లోకి వస్తాడు. ఏయ్ ఆటో నువ్వేంది ఇక్కడికి వచ్చావు అంటాడు.
నువ్వేంటి ఇక్కడ ఎక్స్ ట్రా అంటుంది శౌర్య. నేను.. సత్యం కొడుకును అంటాడు. ఆ తర్వాత.. అసలు ఏం జరిగిందో.. ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడిందో సత్యంకు చెబుతుంది శౌర్య. తన ఆటో మీద చేయి వేశావని ఈ అమ్మాయికి కోపం వచ్చింది అంటాడు సత్యం.
ఆ తర్వాత ఇంద్రుడు, చంద్రమ్మను పనిలోకి తీసుకుంటాడు సత్యం. అయితే.. ఇంట్లోనే చేసి ఇక్కడికి తీసుకొస్తాం అని చెబుతారు. మరోవైపు హిమ.. స్వప్న ఇంటికి వెళ్తుంది. నిరుపమ్ తో పాటు వెళ్తుంది. హిమను చూసి స్వప్న షాక్ అవుతుంది.
ఏంట్రా లేట్ అయింది అంటుంది స్వప్న. హిమను కలిసి వచ్చాను అంటాడు నిరుపమ్. వచ్చేటప్పుడు కారు నువ్వు నడిపావా లేక తనతో నడిపించావా అంటుంది స్వప్న. నేనే నడిపాను అంటాడు. ఏం లేదు కానీ.. కొందరు అత్యుత్సాహానికి వెళ్లి ప్రాణాలు తీసిన వాళ్లు ఉన్నారు అంటుంది.
ఏమ్మా హిమ బాగున్నావా అని అడుగుతుంది. బాగనే ఉంటావులే. అందరికీ నీలాంటి అదృష్టం ఉండదు కదా అంటుంది. మమ్మీ ఏంటి.. తనను అలా అంటున్నావు అంటాడు నిరుపమ్. తనను ఏం అనలేదు. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను అంటుంది స్పప్న.
ఏమ్మా.. ఇంకా నీ డ్రైవింగ్ సరదా అలాగే కంటిన్యూ చేస్తున్నావా అని అడుగుతుంది స్వప్న. చేస్తూనే ఉంటావులే. నీకు సరదాగానే ఉంటుంది. బంధాలు పోగొట్టుకున్న మాకు బాధగా ఉంటుంది అంటుంది స్వప్న. అత్తయ్య జరిగిన దానికి నేను ఇప్పటికీ కుమిలిపోతున్నాను. చచ్చిపోవాలనిస్తుంది అప్పుడప్పుడు అంటుంది హిమ.
తప్పు కదమ్మా అలా మాట్లాడకు అంటుంది స్పప్న. నువ్వెందుకమ్మా చావడం.. నీ పని వేరే ఉందిగా అంటంది స్వప్న. నేను చేసిన దానికి ఆరోజు నుంచి ఈరోజు దాకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నా తప్పుకు రోజూ ఏడ్చేలా చేస్తూ శౌర్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంటుంది హిమ.
శౌర్య.. తెలివైనది.. మళ్లీ నువ్వు డ్రైవింగ్ చేస్తావేమోనని పారిపోయింది అంటుంది స్వప్న. టైమ్ చాలా అయింది కానీ.. ఇక వెళ్లు హిమ అంటుంది స్వప్న. జాగ్రత్తగా వెళ్లమ్మా. అయినా నా పిచ్చి కానీ.. నీకు జాగ్రత్తలు చెప్పడం ఏంటి అని అంటుంది స్వప్న.
నాకు మనసులో ఒకటి పెట్టకొని బయటికి ఒకటి మాట్లాడటం నాకు రాదు. మీ నానమ్మలా అంటుంది స్వప్న. హిమ వెళ్తుంది.. గుడ్ నైట్ చెప్పిరా అని నిరుపమ్ తో అంటుంది స్వప్న. హిమ.. సారీ హిమ అంటాడు నిరుపమ్. మమ్మీ ఇలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాను అంటాడు.
ఆ తర్వాత ఆసుపత్రిలో అనుకోకుండా సౌందర్యను చూస్తుంది శౌర్య. చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.