Karthika Deepam 24 Oct Today Episode : వాల్తేరు వాణి ఎంట్రీ.. కార్తీక్, దీప, దుర్గలకు ఇడ్లీలో విషం పెట్టి చంపేసింది.. కార్తీక్, దీప మళ్లీ చనిపోతారా?

Karthika Deepam 24 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1491 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆటోలో శౌర్య వెళ్లడం చూస్తుంది దీప. దీంతో పదా.. కారులో వెళ్దాం అని తనను కారులో తీసుకెళ్తాడు కార్తీక్. కారులో ఆటోను ఫాలో అవుతారు. కానీ చివరకు ఆటో కనిపించకుండా పోతుంది. ఎక్కడా ఆటో కనిపించదు. మిస్ అయిపోయింది అంటాడు కార్తీక్. ఒకప్పుడు నేను చూసి కూడా శౌర్యను గుర్తుపట్టలేకపోయాను అని అనుకుంటాడు కార్తీక్. నువ్వేం బాధపడకు. శౌర్య ఇదే ఊరిలో ఉంది కదా. ఈరోజు కాకపోతే రేపు అయినా దొరుకుతుంది. పదా వెళ్దాం అంటాడు కార్తీక్. మరోవైపు కావేరితో ఫోన్ లో మాట్లాడుతుంటుంది మోనిత. ఇంకా రాలేదు అంటుంది. ఎవరో ఒక అమ్మాయి వచ్చింది తనే అనుకుంటా. నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటుంది.

karthika deepam 24 october 2022 full episode

నేనే మోనిత అంటుంది. కావేరమ్మ చెప్పి పంపించింది. నేను ఏం చేయాలో చెప్పండి అంటుంది. తన పేరు వాల్తేరు వాణి అంటుంది. చెప్పేది జాగ్రత్తగా విను అని తనకు అసలు ప్లాన్ వివరిస్తుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటుంది. మీకు కావాల్సింది దీపను తప్పించడమే కదా. నేను చూసుకుంటాను అంటుంది. ఈ వాల్తేరు వాణికి ఏది ఒక్కడ ఎలా చక్కబెట్టాలో అన్నీ తెలుసు అంటుంది. దీంతో బిల్డప్ బాగానే ఉంది కానీ.. ఏదైనా తేడా వచ్చిందో అంటుంది మోనిత. రాదు.. ఏదైనా తేడా వచ్చినా అది మీదాకా రాదు. మీరు ఇచ్చిన రెండు లక్షలకు 8 కలిపి 10 లక్షలు ఇస్తాను అంటుంది. దీంతో నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఇక వెంటనే పని మొదలుపెట్టు అంటుంది. వంటలక్క కార్తీక్ జీవితంలో నీ కథను ముగించడానికి వచ్చేస్తుంది వాల్తేరు వాణి అని అనుకుంటుంది మోనిత.

కట్ చేస్తే కారులో తిరిగి ఇంటికి బయలుదేరుతారు కార్తీక్, దీప. నిన్న కాగ మొన్న గతం గుర్తొచ్చిన నాకే ఇలా ఉందంటే.. నువ్వు ఇంకెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని అనుకుంటాడు కార్తీక్.

ఏం ఆలోచిస్తున్నారు డాక్టర్ బాబు అని అడుతుంది దీప. దీంతో శౌర్య గురించే అంటాడు. అయినా శౌర్య ఇక్కడెందుకు ఉంది అంటాడు. దీంతో తెలియదు డాక్టర్ బాబు. మా వాళ్లు అందరూ అమెరికా వెళ్లిపోయారు అంటుంది.

Karthika Deepam 24 Oct Today Episode : తన తల్లిదండ్రులు ఎప్పుడు దొరుకుతారో అని ఎదురు చూస్తున్న శౌర్య

అందరూ అమెరికా వెళ్లిపోతే శౌర్య ఇక్కడెందుకు ఉంది. తనను వదిలేసి అందరూ అమెరికా ఎందుకు వెళ్లిపోయారు అని అంటాడు. దీంతో తెలియదు అని అంటుంది. మేము బతికే ఉన్నామన్న ఆశతో ఇంకా వెతుకుతోందేమో అని అంటుంది దీప.

ఇంకా ఆరోజు మా కారులో లేదనే ఆశతో ఆ పాప నా పాపే అయి ఉంటుందన్న ఆశతో నేను వెతుకుతున్నాను. దొరుకుతుంది కదా డాక్టర్ బాబు అంటుంది దీప. దీంతో దొరుకుతుంది. నీ మనసు మంచిది. నువ్వు ప్రేమించిన వాళ్లంతా తప్పకుండా దగ్గరవుతారు అంటాడు.

మరోవైపు వాల్తేరు మల్లిక తన ప్లాన్ ను స్టార్ట్ చేస్తుంది. అందరి ఫోటోలను ఫోన్ చూసి ఆటో మాట్లాడుకొని ఎక్కడికి వెళ్లాలో చెబుతుంది. మరోవైపు కారులో ఇంటికి వస్తారు కార్తీక్, దీప. వాళ్ల వెనుకే మోనిత కూడా కారులో వస్తుంది.

ఆగు కార్తీక్ అంటుంది. ఎక్కడికి తీసుకెళ్లావు నా మొగుడిని అంటుంది మోనిత. కారు డాక్టర్ బాబుది. కారు నడిపింది కూడా డాక్టర్ బాబే. నేను తీసుకెళ్లడం ఏంటి. ఆయన్నే అడుగు అంటుంది దీప.

నా కార్తీక్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని చెబితే నీకు అర్థం కావడం లేదా అంటుంది మోనిత. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా మోనిత అంటాడు కార్తీక్. దీంతో నేను గొప్ప ప్రేమికురాలిని. భార్యను అంటుంది మోనిత.

నీ బిడ్డను కన్నాను నేను. నీతో ఏ సంబంధం లేని ఒక ఆడది నీ పెళ్లాంలా నీ పక్కనే కారులో కూర్చొని ఊరేగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అంటుంది మోనిత. నేను అలాంటి చేతకాని దాన్ని కాదు అంటుంది మోనిత.

నా భర్తను నేను వదులుకోను అంటుంది మోనిత. రా వెళ్దాం అంటుంది. దీంతో నేను నోరు విప్పకపోవడం వల్ల నీ ఆటలు సాగుతున్నాయి అని అనుకుంటాడు కార్తీక్. వెళ్లండి డాక్టర్ బాబు అంటుంది దీప.

దీంతో నా మొగుడు నాతో రావడానికి నీ పర్మిషన్ ఏంటే అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వాల్తేరు వాణి మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది. నా మీద అరుస్తున్నావేంటి అంటుంది మోనిత. దీంతో అరవాలా.. నీలాంటి దాన్ని అడ్డంగా నరకాలా అంటుంది వాణి.

కార్తీక్ సార్.. మీ ఆవిడ కదా.. ఇది ఏం చేసిందో తెలిస్తే మీరే నాలుగు పీకుతారు అంటుంది వాణి. దీంతో ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అనుకుంటుంది మోనిత. మాది బంగారం లాంటి బొటిక్ సార్.. దీని బిజినెస్ పెరగడం కోసం నా స్టాఫ్ ను కొనేసింది.

దీని వల్ల 20 లక్షలు నష్టం నాకు అంటుంది. ఇదంతా దుర్గ వింటాడు. నవ్వుకుంటాడు. ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూశానే.. ఇప్పుడు దొరికావు నీకు. అవును.. బయట ఏదో రూమర్ నడుస్తోంది. ఈ దీప, కార్తీక్ సార్ భార్యాభర్తలని అంటుంది.

దీంతో అవునా అంటాడు కార్తీక్. దీంతో అవును సార్.. బయట అంతా అదే టాక్. వీళ్లిద్దరూ భార్యాభర్తలు కాకపోయినా సరే నేను కలుపుతాను. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నాకు చేసిన అన్యాయానికి నీకు చుక్కలు చూపిస్తా అంటుంది వాణి.

ఈ దీపకు ఎంతమంది అండగా ఉన్నా దాన్ని విడిచిపెట్టను. నాకు, నా కార్తీక్ కు మధ్యలో వచ్చేవారిని వదిలిపెట్టను అంటుంది మోనిత. ఆ తర్వాత రా కార్తీక్ అని తనను తీసుకెళ్తుంది మోనిత.

ఆ తర్వాత నువ్వేం బాధపడకు వదిన. నిన్ను, కార్తీక్ సార్ ను కలిపేస్తాను. అంత వరకు ఇక్కడి నుంచి వెళ్లను అంటుంది. ఆ తర్వాత దుర్గ వెళ్లి ఇరగదీశారు అంటాడు దుర్గ. ఈ మోనిత తాట తీయాలంటే నేను ఇక్కడే ఉండాలి. దాని తాట తీయాలంటే నాకు ఇక్కడే ఏదైనా ఒక రూమ్ చూడండి అంటుంది.

ఎక్కడో ఎందుకు మా దీపమ్మ ఇంట్లోనే ఉండు అంటాడు దుర్గ. మరోవైపు శౌర్య.. తన అమ్మానాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మానాన్న ఎక్కడున్నారు అని అనుకుంటుంది. ఇంతలో బాబాయి వచ్చి వాళ్లు త్వరలోనే దొరుకుతారు అంటాడు.

అసలు వాళ్లు బతికి ఉన్నారో లేదో అని అనుకుంటాడు బాబాయి. అమ్మానాన్నలు కనిపించరా అంటుంది శౌర్య. దీంతో ఎందుకు కనిపించరు. ఖచ్చితంగా కనిపిస్తారు. కనిపించే వరకు వెతుకుదాం అంటాడు.

కట్ చేస్తే దుర్గ, దీపకు స్పాట్ పెడుతుంది వాణి. ఇద్దరినీ చంపేయాలని ఇడ్లీలో విషం కలుపుతుంది. తను తినమంటే నాకు వద్దు అంటుంది. ఇద్దరూ తినబోతుండగా అప్పుడే కార్తీక్ వస్తాడు.

కార్తీక్, దీప, దుర్గ.. ముగ్గురూ ఆ ఇడ్లీ తిని చనిపోతారా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

9 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

10 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

11 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

13 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

14 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

15 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

16 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

17 hours ago