Karthika Deepam 25 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 డిసెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 1232 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పు ఎలా తీర్చాలి అని టెన్షన్ పడుతుంటాడు కార్తీక్. అదే విషయం దీపతో చెబుతాడు. నువ్వేం టెన్షన్ పడకు కార్తీక్ బాబు. ఎలాగైనా అప్పు తీర్చుదాం అని అంటుంది. మరోవైపు కార్తీక్ ఒక్కడే బయటికి వస్తాడు. అప్పు ఎలా తీర్చాలి. అంత మొత్తం ఎలా సంపాదించాలి. రుద్రాణి నా పిల్లల మీద కన్నేసింది. 3.20 లక్షలు ఎలా తీర్చాలి అని టెన్షన్ పడుతుంటాడు కార్తీక్. మరోవైపు స్కూల్ అయిపోయాక పిల్లలు ఇంటికి తిరిగి వస్తుంటారు. శౌర్య.. నా కడుపులో ఎలాగో ఉంది అంటుంది. తినకముందు కూడా అలాగే అన్నావు కదా. ఇంటికి వెళ్లాక నాన్నకు చెప్పు అంటుంది శౌర్య. ఇంతలో హిమ రోడ్డు పక్కన వాంతి చేసుకుంటుంది.
ఇంతలో కార్తీక్ వస్తాడు. తన చెవులు మూస్తాడు. ఏం కాదమ్మా భయపడకు. బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా అని అడుగుతాడు. తన మూతి తూడ్చి నోరు కడుక్కో అంటాడు కార్తీక్. తూడ్చుకో అంటాడు. ఏమైంది నాన్న.. హిమ ఎందుకు వాంప్టింగ్ చేసుకుంది అని అడుగుతుంది శౌర్య. ఏం కాలేదు అని సర్ది చెప్పి వాళ్లను ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో రోడ్డు మధ్యలో రుద్రాణి నిలబడుతుంది. ఏంటి సారు పాప వాంతి చేసుకుందా. అమ్మ.. ఏమైందమ్మా. ఈ ఊరు, గాలి.. కొత్త వాతావరణం పడలేదా అని అడుగుతుంది. హాస్పిటల్ కు వెళ్దామా అంటే అక్కర్లేదు అంటుంది శౌర్య. అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను అంటాడు కార్తీక్. దీంతో తప్పుకుంటాను.. ఇంకా నీ దారిలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి అంటుంది రుద్రాణి. నెల రోజుల గడువులో నుంచి రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఎలా అప్పు తీరుస్తావు అని అడుగుతుంది రుద్రాణి.
గడువు తీరేలోపు అప్పు తీరుస్తాను. ఎలా సంపాదిస్తాను అనేది నా ఇష్టం.. అని అంటాడు కార్తీక్. దీంతో ఇదిరా ఆత్మ విశ్వాసం అంటే.. అంటుంది రుద్రాణి. పదమ్మా… అని కార్తీక్ పిల్లలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నాన్నా.. ఆ ఆంటికి, మనకు ఏంటి గొడవ అంటుంది శౌర్య.
మనతో ఏం గొడవ లేదమ్మా.. కోటేశ్ బాబాయి వాళ్లు ఆమెకు డబ్బులు ఇవ్వాలట. దాని గురించే అడుగుతున్నారు అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు. మరోవైపు సౌందర్య.. పిల్లలను గుర్తు చేసుకుంటుంది. ఇంతలో ఆనంద రావు వస్తాడు. ఏమైంది సౌందర్య.. పిల్లలు గుర్తొస్తున్నారా అని అడుగుతాడు.
రత్నసీతను కలిశానని చెబుతుంది సౌందర్య. మోనిత చెబుతున్నట్టుగా పిల్లోడు నిజంగా లేడా.. లేక మోనిత ఎక్కడైనా దాచిందా తెలుసుకొమ్మని చెప్పాను. రత్నసీత ఏదైనా సమాచారం ఇస్తుందేమో చూద్దాం అని ఆనందరావుకు సౌందర్య సర్దిచెబుతుంది.
మరోవైపు శ్రీవల్లి కొడుకును ఎత్తుకుంటాడు కార్తీక్. ఏం పర్వాలేదు.. చుక్కల మందు వేసినప్పుడు జ్వరం రావడం కామన్.. అంటాడు కార్తీక్. రేపు బాబుకు బారసాల చేద్దామనుకుంటున్నాం అంటుంది శ్రీవల్లి. దీంతో పేరు ఏం పెట్టాలని అనుకుంటున్నారు అని అడుగుతుంది దీప. ఆనంద్ అని అనుకుంటున్నాం అంటుంది శ్రీవల్లి. దీంతో షాక్ అవుతారు దీప, కార్తీక్.
ఆ పేరే ఎందుకు అని అడుగుతుంది దీప. అదేంటో కానీ.. బాబును దత్తత తీసుకున్నప్పటి నుంచి కోటేశ్.. ఆనంద్ అనే పేరు పెడదామని అంటున్నాడు.. అని చెబుతుంది శ్రీవల్లి. ఆ తర్వాత కార్తీక్, దీప, పిల్లలు కాసేపు కూర్చొని సరదాగా గడుపుతుంటారు.
నాన్నా.. మనమంతా కలిసి ఒకే చోట ఉంటే అదే సంతోషం అంటుంది శౌర్య. కార్తీక్ బాబు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటుంది దీప. కార్తీక్ కూడా ఒక విషయం చెప్పాలంటాడు. శౌర్య కూడా ఒక విషయం అడగాలి అంటుంది శౌర్య. అమ్మ.. ఇదివరకు నాన్నను డాక్టర్ బాబు అని పిలిచేది కదా.. ఇప్పుడు కార్తీక్ బాబు అని పిలుస్తుంది ఏంటి అని అడుగుతుంది.
నేను ఇక్కడ డాక్టర్ అనే విషయం ఎవరికీ తెలియదు కదా. అందుకే డాక్టర్ బాబు అని కాకుండా.. కార్తీక్ బాబు అని పిలవమని చెప్పా అంటాడు కార్తీక్. మరోవైపు దీప.. నేను పిండివంటలు చేసి అమ్మాలని అనుకుంటున్నా అంటుంది దీప. కార్తీక్.. ట్యూషన్లు చెబుతా అంటాడు.
ఇంతలో రుద్రాణి అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నారు అని అడుగుతుంది. పిల్లలను ముద్దు చేస్తుంది. దీంతో పిల్లలను అటు లాగేస్తుంది దీప. ఒరేయ్ అది ఇలా ఇవ్వరా.. అంటూ బ్యాగులో నుంచి పండ్లు, స్వీట్లు ఇచ్చి.. ఇక నేను వెళ్లి వస్తాను అని అంటుంది రుద్రాణి.
దీంతో.. హలో దయచేసి అది తీసుకెళ్లండి అంటుంది దీప. కాదనకు దీప.. పిల్లల మీద ప్రేమతో తీసుకొచ్చాను. పిల్లలు టాటా. చాలా దోమలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. జాగ్రత్త. వస్తాను సారూ అంటుంది రుద్రాణి. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏంటి నాన్నా ఈవిడ ఇవాళ కొత్తగా మాట్లాడుతోంది అని అంటుంది శౌర్య. అవసరం లేని వాళ్ల గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అంటుంది దీప.
కట్ చేస్తే తెల్లారుతుంది. దీప వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. ఆ రుద్రాణి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను కూడా నీతో పాటు పిండి వంటలను మార్కెటింగ్ చేస్తాను అంటాడు. కానీ.. వద్దు కార్తీక్ బాబు. మీరు ఇక్కడ ప్రజా వైద్యశాల పెట్టండి అంటుంది దీప. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
This website uses cookies.