Karthika Deepam 27 Aug Today Episode : కార్తీకదీపం 27 ఆగస్టు 2021, శుక్రవారం 1129 ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య, హిమ.. ఇద్దరూ మరోసారి సౌందర్యను బెదిరిస్తారు. ఏంటి.. రెచ్చిపోయి మాట్లాడుతున్నారు నా కోడలు అంటే ఊరుకునేది లేదని సౌందర్య చెప్పి వెళ్లబోయి.. మళ్లీ వాళ్లను దగ్గరకు తీసుకొని.. కొన్ని విషయాలు పిల్లలకు అర్థం కావని చెప్పరు. వాళ్లు బాధపడకూడదని చెప్పరు. అంతే కానీ.. అమ్మను అపార్థం చేసుకుంటారా? మీ అమ్మ ఏనాడూ సుఖంగా ఉండలేదు. అంతా బాగుంది. ఇక అందరం కలిసిపోయాం.. అని అనుకుంటున్న సమయంలో మీ నాన్నను పోలీసులు తీసుకెళ్లారు.
నాన్నను విడిపించడానికి కష్టపడుతున్నాను.. అని చెప్పొచ్చు కదా అని ప్రశ్నిస్తుంది హిమ. నువ్వో విషయం గమనించావా? శౌర్య… అసలు.. మోనిత ఆంటీ డాడీని చూడటానికి ఎందుకు రావడం లేదు. నాన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఎందుకు మోనిత ఆంటీ రావడం లేదు.. అంటూ ప్రశ్నించేసరికి.. వాళ్లకు ఏదో ఒకటి సర్దిచెప్పి పంపిస్తుంది సౌందర్య. దేవుడా.. వీళ్లకు ఎలా సమాధానాలు చెప్పాలో అర్థం కావడం లేదు.. అని అనుకుంటుంది సౌందర్య.
కట్ చేస్తే.. వంటలక్క ఆటోలో ఇంటికి వెళ్తుంటుంది. మోనిత కనిపించింది అంటే ఎవ్వరూ నమ్మడం లేదేంటి.. అని అనుకుంటుంది. నిజంగానే మోనిత బతికే ఉంటే.. అది ఎక్కడున్నా సరే.. దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి ఆ ఏసీపీ కాళ్ల మీద పడేస్తాను.. ఎక్కడున్నావే మోనిత అని అనుకుంటుంది దీప.
కట్ చేస్తే.. మోనిత ఇంటికి వచ్చి పెరుగుతో అన్నం తింటూ ఉంటుంది. రత్నసీత కూడా అక్కడే ఉంటుంది. ఏంటి రత్నసీత నువ్వు బిర్యానీ తెచ్చినా నేను సద్దన్నంలో పెరుగు వేసుకొని ఎందుకు తింటున్నాను.. అని చూస్తున్నావా? అక్కడ నా కార్తీక్ కు మీరు పెట్టేది అదే కదా. నా కార్తీక్ ఏం తింటే.. నేనూ అదే తింటాను.. అని మోనిత అనగానే.. మీరు టూమచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు.. అని రత్నసీత అడుగుతుంది.
ఎందుకు అంటావేంటి రత్నసీత.. ఇదంతా నా కార్తీక్ కోసమే. నా కార్తీక్ కోసమే నేను ఇదంతా చేస్తున్నా. నా తపన, తాపత్రయం అంతా ఇదే.. అనగానే.. కావచ్చు.. కరెక్టే కానీ మీరు చాలా రిస్క్ చేస్తున్నారు మేడమ్ అని అంటుంది రత్నసీత.
అక్షరం ముక్క రాని, అందం లేని దీపే తన భర్తను దక్కించుకుంటా అని చెప్పినప్పుడు.. అందం, ఐశ్వర్యం.. అన్నీ ఉన్న నేను ఇంకెంత చేయాలి.. అని చెబుతుంది మోనిత.
కరెక్టే కానీ.. మీరు తొందరపడకండి. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి.. అని చెబుతుంది రత్నసీత. ఏంటి.. రెండు రోజులా.. రెండు రోజులు అంటే కష్టం. ఏం జరిగినా.. ఈ రాత్రికే జరగాలి. ఈ రాత్రికే జరిగి తీరాలి.. అని చెబుతుంది మోనిత.
ఏంటి మేడమ్ మీరు అనేది.. అనగానే నువ్వేం భయపడకు. నేను ఆల్రెడీ నేను ఇంకో ప్లాన్ ఆలోచించి ఉంచా. దాని వల్ల.. నీకేం సమస్య ఉండదు. చెబుతాను విను.. ఆ ప్లాన్.. అంటూ మోనిత చెబుతుంది. మేడమ్.. మీరు ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నారేమో అని అంటుంది రత్నసీత. అవన్నీ నువ్వు పట్టించుకోకు. అన్నీ నేను చూసుకుంటా. నాతోనే చాలెంజ్ చేస్తుందా? దీప.. చెప్తానే నీ పని.. అని అంటుంది మోనిత.
కట్ చేస్తే.. దీప.. తులసి ఇంటికి వెళ్తుంది. దీపను చూసి.. రా దీప. కూర్చో అని చెప్పి… వాటర్ ఇస్తుంది. ఎలా ఉన్నావు తులసి.. అంటే బాగున్నాను. పిల్లలు పుట్టరు అని తెలిసి గుండెను రాయి చేసుకున్నాను.. అని చెబుతుంది తులసి. నువ్వే అన్నీ ఉన్నా ఏం లేనిదానిలా అయ్యావు.. అంటుంది తులసి. నాకు జరిగింది అంతా తెలిసింది. డాక్టర్ బాబు.. ఎందుకు అంత ఆవేశ పడ్డారా? అని ఆలోచించాం. మోనిత చచ్చిపోయిందా? అని నన్ను అడుగుతావేంటి.. ప్రపంచానికంతా తెలిసిన విషయమే కదా.. అని అంటుంది తులసి. ప్రపంచానికి మోనిత చనిపోయిందని తెలుసు కానీ.. నాకు మాత్రం మోనిత చచ్చిపోలేదు. ఎందుకంటే మోనిత నాకు కనిపించింది.. అని అంటుంది దీప.
ఏం జరిగింది దీప.. మోనిత కనిపించడం ఏంటి.. అని తులసి అడగగా.. నాకు మోనిత గుడిలో కనిపించింది.. అని చెబుతుంది దీప. దీంతో.. నాకు నీమీద జాలి వేస్తోంది దీప.. నువ్వు డాక్టర్ బాబు ప్రేమ వల్ల ఆ భ్రాంతిలో బతుకుతున్నావు.. అని చెబుతుంది తులసి. ఆపుతావా? ఇక ఆపుతావా? ఎందుకు అందరూ నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే మాట డాక్టర్ బాబు కూడా అన్నారు. నేనేం చేశాను. నావైపు తప్పు లేదని తప్పుకున్నాను.. ఎవరూ నా మాట కూడా వినడం లేదు. ప్రపంచానికి కనిపించని నిజం.. నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు.. అని అంటుంది దీప.
గుడికి వెళ్లింది నిజం. పూజారి అఖండ దీపం వెలిగించమన్నది నిజం. నేను వెలిగించింది నిజం. మోనిత కనిపించింది కూడా నిజం. కానీ.. ఇవన్నీ నిజం అయి… మోనిత మాత్రం అబద్ధం ఎలా అయిందో అర్థం కావడం లేదు.. అని అంటుంది దీప.
నేను డాక్టర్ బాబును రక్షించుకుంటాను. అందుకోసం.. ఎవ్వరి సలహాలు అవసరం లేదు. భారం అంతా దేవుడి మీదే వేస్తాను.. వస్తాను తులసి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
కట్ చేస్తే భాగ్య.. దేవుడికి ప్రసాదం పెట్టి మొక్కుతుంది. స్వామీ మంచేంటో.. చెడేంటో తెలియనప్పుడు ఎవ్వరికి ఏం జరిగినా నాకు బాధగా ఉండేది కాదు. మా దీప వల్ల.. డాక్టర్ బాబు వల్ల.. మనుషులంటే ఎలా ఉండాలో నేర్చుకున్నాను. నేను మనిషినయ్యాను. కానీ.. ఏం లాభం. డాక్టర్ బాబు తప్పు చేశాడని నేనే చెప్పాల్సి వచ్చింది. వాళ్లకు నావల్లే అన్యాయం జరిగిందని.. రాత్రి పగలు నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను. నావల్ల డాక్టర్ బాబును పోలీసులు పట్టుకెళ్లారు కాబట్టి.. ప్రతి శనివారం నేనే ఉపవాసం ఉంటాను. మా డాక్టర్ బాబు త్వరగా రిలీజ్ అయి రావాలి. దీప సంసారం చక్కబడాలి. అది జరిగేలా చేయి స్వామీ. ఆ ఏసీపీ రోషిణి గారి మనసు కరిగేలా చూడు స్వామీ.. అని మొక్కుతుంది భాగ్య.
ఏంటి.. నేను పిలిపించకముందే.. మీరే వచ్చారు. మోనిత శవం ఎక్కడుందో చెబుతారా? అంటే మోనిత గురించి చెబుతాను అంటాడు కార్తీక్. మోనిత చచ్చిపోయింది కదా.. అంటే లేదు.. మోనిత బతికే ఉంది.. అంటాడు కార్తీక్. ఉంది.. అంటాడు. ఇందాకే ఇక్కడికి వచ్చి వెళ్లింది. ఇందాకా చాయి తెచ్చి ఇచ్చి వెళ్లింది. నాకు తన చేతి స్పర్శ కూడా తగిలింది.. అని మొత్తం చెబుతాడు కార్తీక్.
మీ ఆరోగ్యం బాగుందా కార్తీక్.. ఖచ్చితంగా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నువ్వు వేసే ప్లాన్ ఇది.. మీ ఆవిడకేమో మోనిత.. సోది చెప్పేదానిలా కనిపిస్తోంది అంటారు. నీకేమో.. చాయ్ ఇచ్చే వ్యక్తిలా కనిపించింది అంటున్నారు.. అని చెబుతుంది.
లేదు మేడమ్.. ముందు దీప కూడా నాకు ఈ విషయం చెబితే నేను నమ్మలేదు. కానీ.. నేను చూశాక.. నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మీరు ఆ దిశగా దర్యాప్తు చేయడం అని చెప్పగానే.. స్టాపిట్.. అంటూ గట్టిగా అరుస్తుంది రోషిణి.
మీరు నిజంగా మంచి వాళ్లే అయితే.. దీపను ఎందుకు 10 ఏళ్ల పాటు దూరం పెడతారు. ఎందుకు మోనితను అనుమానిస్తారు.. అని రోషిణి అంటుంది. దీంతో ఆ మోనిత వల్లే.. అంటాడు కార్తీక్.
నాన్న తప్పకుండా వస్తారు అత్తమ్మ.. అని శౌర్యకు చెబుతుంది దీప. ఎప్పుడు.. ఎప్పుడు వస్తారు.. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతావు అమ్మా.. అని అంటుంది శౌర్య. నాకు నాన్నంటేనే ఇష్టం. నువ్వంటే ఇష్టం లేదు. నువ్వంటే ఉన్న కాసింత ఇష్టం కూడా ఇప్పుడు లేదు.. అని షాకిస్తుంది శౌర్య.
కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో ఉన్న కార్తీక్ కు తీవ్రంగా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి తట్టుకోలేడు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని రత్నసీత చెబుతుంది.
నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన నా కార్తీక్ ను నా చేతులతో నేను కష్టపడేలా చేస్తున్నాను. కార్తీక్ వస్తున్నా.. ఇక నిన్నూ నన్నూ ఎవ్వరూ వేరు చేయలేరు.. అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది మోనిత. దీప కూడా ఏడ్చుకుంటూ ఆటోలో బయలు దేరుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.