Karthika Deepam 28 Aug Today Episode : మోనిత క్రిమినల్..అని ఒప్పుకున్న ఏసీపీ.. మోనిత ఇంటికి దీప.. అక్కడి వాళ్లు చెప్పిన విషయాలకు దీప షాక్?

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

Karthika Deepam 28 Aug Today Episode : కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ 28 ఆగస్టు 2021, శనివారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ 1130 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఇంటరాగేషన్ చేస్తానని తెలిసి.. ఇలాంటి నాటకాలు మొదలు పెట్టారా? అంటూ కార్తీక్ ను నిలదీస్తుంది ఏసీపీ రోషిణి. కట్టుకథలు చెప్పడం ఇకనైనా ఆపండి.. అంటుంది. మీ భార్యను ఎందుకు పదేళ్ల నుంచి దూరం పెడుతున్నారు.. అని అంటుంది. అంతా మోనిత వల్లే. కావాలంటే నా ఫోన్ ను తీసుకురండి.. నేను మోనిత అసలు స్వరూపం చూపిస్తాను. వీడియో చూపిస్తాను.. అని కార్తీక్ చెప్పగానే ఆ వీడియో నేను ఎప్పుడో చూశా. మోనిత తప్పు చేసింది ఓకే.. మరి.. మోనితను చంపడం తప్పు కదా? మీరు చేసిన దారుణాన్ని ఒప్పుకోండి.. అంటుంది ఏసీపీ రోషిణి.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

మీరు బలహీనమైన సాక్ష్యాలను పట్టుకొని బలంగా వాదిస్తున్నారు.. అనగానే స్టాపిట్.. మీరు ఆపండి.. ఇది కోర్టు కాదు.. ఇదిగో చూడు..ఫోటో అంటూ మోనిత ఫోటోకు దండ వేసిన ఫోటోను చూపిస్తుంది ఏసీపీ. నీకు కొద్ది గంటలే టైమ్ ఇస్తున్నా. ఇది లాస్ట్ వార్నింగ్. ఈ లోపు నిజాన్ని ఒప్పుకో కార్తీక్.. అని అంటుంది ఏసీపీ.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

ఒక్క మోసగత్తెను పట్టుకొని.. ఫ్యామిలీని వదిలేసి.. తనను గుడ్డిగా నమ్మినందుకు.. తను అక్కడ తంతే.. ఇక్కడ వచ్చి పడ్డాను.. అని కార్తీక్ ఏసీపీకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

Karthika Deepam 28 Aug Today Episode : శ్రావ్యపై సీరియస్ అయిన ఆదిత్య

కట్ చేస్తే ఆదిత్య ఫోన్ లో మాట్లాడుతుంటాడు. తన భార్య అప్పుడే కిందికి వస్తుంది. ఫ్రెండా.. అని అడుగుతుంది తను. చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నట్టున్నావు.. ఇంత సేపు ఫోన్ లో మాట్లాడేంత ఖాళీ ఉంది నీకు. నువ్వు ఒక్కసారి కూడా మీ అన్నయ్యను చూడటానికి వెళ్లలేదు ఏంటి? ఆయన నేరం చేశారని నువ్వు నమ్ముతున్నావా? అని శ్రావ్య అడుగుతుంది. లేదంటే మీ అన్నయ్య చేసిన పనికి సరైన శిక్ష పడిందని అనుకుంటున్నావా? అని అడుగుతుంది. దీంతో తనను కొట్టబోతాడు ఆదిత్య.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

దీంతో.. సౌందర్య, తన భర్త.. అందరూ వచ్చి.. ఏంట్రా.. శ్రావ్య మీద చేయి చేసుకోబోతున్నావు.. అని అంటాడు. టైమ్ ఉంది.. కానీ.. మొహం లేదు. ఏ ముఖం పెట్టుకొని వెళ్లమంటావు. అన్నయ్య జీవితంలో ఏ సమస్యను మాత్రం పట్టించుకున్నాం. ఏం చేసినా అన్నయ్యదే తప్పు అంటూ గుడ్డిగా వాదించాం. వదిన కంటే అన్నయ్యకు మోనితే ఎక్కు అనే అభిప్రాయాన్ని వచ్చేలా చేశాం. చివరకు మోనితనే చంపేలా చేశాం.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

అన్నయ్యను తాగుబోతు అన్నాం. తిరుగుబోతు అన్నాం. అబద్ధాల కోరు అన్నాం. మనిషిలా ఎప్పుడైనా చూశామా? అసలు.. అన్నయ్యను ఏనాడైనా మనిషిలా చూశామా? అందుకే అన్నయ్య ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. మోనిత ఇంటికి వస్తే చాలు.. తన మీద ఎగబడ్డాం.. అని అంటాడు ఆదిత్య.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

నీ భార్య అడిగిందేంటి.. నువ్వు చెప్పేదేంట్రా.. అని అడుగుతుంది సౌందర్య. మరి.. గతాన్ని వదిలేద్దాం.. మరి భవిష్యత్తు ఏంటి.. అన్నయ్య ఇప్పుడు హంతకుడు అయ్యాడంటే దానికి కారణం మనమే. నేనేమీ గంటలు గంటలు ఫోన్ లో కబుర్లు చెప్పడం లేదు. సెంట్రల్ మినిస్టర్ కొడుకు నా క్లాస్ మేట్. ఆయనతో ఫోన్ లో మాట్లాడి.. అన్నయ్యను విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నా.. అర్థం అయిందా? అని శ్రావ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఆదిత్య.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

Karthika Deepam 28 Aug Today Episode : మోనిత ఇంటికి వెళ్లిన దీప

కట్ చేస్తే దీప ఆటోలో ఒక చోటుకు వస్తుంది. అది మోనిత ఇల్లు. చూస్తే లాక్ చేసి ఉంది. పక్కన ఉన్నవాళ్లను అడిగితే.. మోనిత ఎక్కడిదండి.. చనిపోయింది కదా.. అని చెబుతారు. దీంతో నేను మోనితను చూడటం అంతా భ్రమేనా అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

కట్ చేస్తే.. సౌందర్య, తన భర్త.. ఇద్దరూ కలిసి కూర్చొని ఆదిత్య అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంతలో హిమ వచ్చి.. శౌర్యకు బాగా జ్వరం వచ్చింది నానమ్మా.. పిలిస్తే అస్సలు పలకడం లేదు.. అని అంటుంది.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

Karthika Deepam 28 Aug Today Episode : శౌర్యకు జ్వరం రావడంతో కంగారు పడ్డ సౌందర్య

సౌందర్య అక్కడికి వెళ్లి.. చూస్తే.. శౌర్యకు హైఫివర్ వస్తుంది. హాస్పిటల్ కు తీసుకెళ్దాం అని అనగానే.. నేను ఎక్కడికీ రాను. నాన్న వస్తేనే నాకు జ్వరం తగ్గుతుంది. నాన్న ఎప్పుడు వస్తాడు.. అనగానే రెండు రోజుల్లో వస్తాడులే అంటుంది సౌందర్య.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

పోలీసులు తీసుకెళ్లినప్పటి నుంచి రెండు రోజుల్లో వస్తాడు.. అంటున్నారు. కానీ.. రావడం లేదు. నాన్న వస్తే చాలు.. నేను ఎక్కడికీ రాను. నాన్న చాలా మంచోడు. అమ్మ కంటే నాన్నే మంచోడు. మమ్మల్ని ఏమీ అనడు. ఎప్పుడూ విసుగ్గోడు. నవ్వుతూ మాట్లాడుతాడు. అడక్కముందే అన్నీ కొనిపెడతాడు. పాపం.. నాన్న పోలీస్ స్టేషన్ లో కింద పడుకుంటున్నాడు. లోపల నుంచి బయట తాళం పెట్టారు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా?

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

మాకేం బాగోలేదు నానమ్మ. భయంభయంగా ఉంటోంది. డాడీ లేకపోతే ఏదోలా ఉంది. మనమంతా ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాం. కానీ.. డాడీ ఉన్న రూమ్ లో బెడ్ కూడా లేదు. ఫ్యాన్ కూడా లేదు. ఆ పోలీస్ ఆవిడ ఏమో.. డాడీ రూమ్ లోనే ఉండాలి.. అంటుంది.. అనగానే.. ముందు మీరు ఏడుపు ఆపండి. రౌడీ.. నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు దిగులుపడకు.. జ్వరం ఎక్కువవుతుంది.. అనగానే.. జ్వరం ఎక్కువైతే.. నాన్నను విడిచిపెడతారా? నానమ్మ అంటుంది శౌర్య.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

ఎందుకే ఇంకా బాధపెడుతున్నారు. మీ నాన్నను అలాగే వదిలేస్తామా? మేమంతా లేమా? మేము ఎలాగైనా నాన్నను బయటికి తీసుకొస్తాం.. అని అంటుంది సౌందర్య. ఎప్పుడు ఇలాగే అంటాడు. ఇంకా రెండు రోజులకు అంటారు. నాన్న రాడు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లకండి. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లండి.. అంటుంది శౌర్య.

Karthika Deepam 28 Aug 2021 Saturday full episode 1130 highlights

ఈ పరిస్థితుల్లో నిన్ను పోలీస్ స్టేషన్ కు రానివ్వరు. జ్వరంలో అటూ ఇటూ తిరగకూడదు రౌడీ. వద్దు అనగానే.. మరి ఎలా. నాకు నాన్నను చూడాలని ఉంది.. అని అంటుంది శౌర్య. మాకు కూడా నాన్నను చూడాలని ఉంది కానీ.. కుదరదు. అర్జెంట్ గా విడిపించి ఇంటికి తీసుకురావాలని ఉంది. కానీ.. వెంటనే అంటే సాధ్యం కాదు. అర్థం చేసుకో అమ్మా.. అంటాడు సౌందర్య భర్త.

Karthika Deepam 28 Aug Today Episode : వంటలక్క ఏది… అని వెటకారంగా అడిగిన శౌర్య

ఆవిడేది.. అని అడుగుతుంది శౌర్య. ఎవరు.. అనగానే వంటలక్క.. అంటుంది.. శౌర్య. మీ అమ్మ పుట్టగానే వాళ్ల అమ్మ చనిపోయింది. పుట్టింట్లో ఉన్నన్ని రోజులు సవితి తల్లితో బాధలు పడింది. పెళ్లయ్యాక.. నేను కొద్దిరోజులు.. మీ నాన్న కొన్నిరోజులు, నువ్వు కొన్ని రోజులు, హిమ కొన్నేళ్లు.. ఎవరో ఒకరు బాధపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీ అమ్మ.. మీ నాన్నను విడిపించుకోవడం కోసం పిచ్చిదై తిరుగుతుంది.. అని చెప్పి శౌర్యను ఓదార్చుతుంది సౌందర్య. ఆ తర్వాత కార్తీక్ కు కడుపునొప్పి అని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తారు పోలీస్ సిబ్బంది. ఈ విషయం తెలిసి.. ఓవైపు మోనిత.. మరోవైపు దీప.. పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

21 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

1 hour ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago