Neelakurinji flowers: ప్రకృతి ఎంత అందమైనదో ఒక్కోసారి మాటల్లో వర్ణించలేం..! అందుకే ప్రకృతిని ఎంత ఆస్వాదించినా తనివి తీరదు..! ప్రకృతి అందాలను ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది..! రమణీయమైన ప్రకృతిని చూడగానే ఎంతటి చికాకులో ఉన్న మనిషికైనా మనసు పులకరిస్తుంది..! ఎత్తయిన కొండలు, భారీ లోయలు, పచ్చిక బయళ్లు, పరవశింపజేసే పైరగాలి, రకరకాల చెట్లు, మొక్కలు, అందమైన పూలు.. ఇలా ప్రకృతి రమణీయతను ఊహించుకుంటేనే మనసు పులకరించిపోతుంది.
అలాంటి ప్రకృతి కొన్ని అరుదైన సందర్భాల్లో మరింత అందంగా కనిపిస్తూ మనసుకు గిలిగింతలు పెడుతుంది. అలాంటి అరుదైన ప్రకృతి సౌందర్యమే ఇప్పుడు కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లాలోని శాంతన్‌పారా షాలోమ్ హిల్స్‌లో ఆవిష్కృతమైంది. ఆ కొండల్లో పూసిన అత్యంత అరుదైన నీలకురింజి పూలను చూడటానికి రెండు కండ్లు చాలవు. నేలపై నీలి దుప్పటి కప్పినట్టుగా కడు రమణీయంగా ఆ పుష్ప సోయగం ఉన్నది.
ఈ నీలకురింజి పుష్పాలు ఎప్పుడుపడితే అప్పుడు వికసించవు. సాధారణంగా 12 ఏండ్లకు ఓసారి మాత్రమే వికసించే ఈ నీలకురింజి పువ్వులు.. ప్రస్తుతం శాంతన్‌పారా షాలోమ్ హిల్స్‌ను సందర్శిస్తున్న పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ఈ పూల శాస్త్రీయ నామం స్ట్రోబిలాంథస్ కుంతియానస్. ఇవి సాధారణంగా జూలై-అక్టోబర్ మధ్యలో పూస్తాయి. నీలకురింజి అంటే మలయాళంలో నీలిరంగు పువ్వు అని అర్థం.
ఈ నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలాకాలం అవసరం. అందుకే ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఈ నీలకురింజి మొక్కలు జీవితకాలంలో ఒక్కసారే పూస్తాయి. మొక్కలు మొలకెత్తిన తర్వాత 12 ఏండ్లకు పూతపూసి, ఆ తర్వాత ఎండిపోతుంది. ఆ మొక్క నుంచి రాలిన విత్తనాల నుంచి మళ్లీ మొక్కలు మొలిచి 12 ఏండ్లకు పూతపూస్తాయి. ఈ నీలకురింజి పువ్వులు వికసించే సీజన్‌లో సేకరించే తేనె రుచిగా ఉంటుందట.
పోషకాల పరంగానూ ఈ సీజన్‌లో వచ్చే తేనె చాలా శ్రేష్ఠమైనదట. అందుకే ఈ సీజన్‌లో తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నీలకురింజి మొక్కలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెరుగుతాయట. వీటిలో మొత్తం 250కి పైగా జాతులు ఉన్నాయట. ఆ 250కి పైగా జాతులలో 46 జాతులు భారతదేశంలోనే కనిపిస్తాయట. ఇవి ప్రధానంగా పశ్చిమ కనుమలలో ఉంటాయట. ఈ పూల సోయగానికి సంబంధించిన వీడియోను ఓ జాతీయ మీడియా సంస్థ ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా అయ్యింది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.