Karthika Deepam 28 Oct Today Episode : మోనిత కొడుకును తన వారసుడిగా కార్తీక్ ఒప్పుకుంటాడా? దీప జీవితాన్ని నాశనం చేస్తాడా? దీప తీసుకున్న నిర్ణయం ఏంటి?

Karthika Deepam 28 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్ 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నామాటను నమ్ము కార్తీక్. ఇది సహజమైన గర్భం అంటూ చెబుతుంది మోనిత. తనకు మళ్లీ స్పృహ పోతుంటుంది. దీంతో తను బతకదు. వెంటనే సంతకం పెట్టండి అని భారతి అంటుంది. కానీ.. కార్తీక్ ఒప్పుకోడు. పర్వాలేదు భారతి.. నేను చచ్చిపోయినా కడుపులోని బిడ్డను బయటికి తీయి. ఆంటీ.. మీ కళ్ల ముందే కళ్లు మూస్తున్నాను. నేను చెప్పేది నిజం అని నేను చచ్చాక అయినా నమ్ముతారా? మీ ఇంటి కోడలుగా నన్ను దహనం చేస్తారా? ఆ గౌరవాన్ని నాకు ఇస్తారా? అని అంటుంది.

karthika deepam 28 october 2021 full episode

మోనిత ఇంతలా చెబుతోందంటే ఇది నిజంగా నిజమేనా.. అని అనుకుంటాడు కార్తీక్. నేనెందుకు ఇలా చేశాను.. తాగిన మత్తులో.. ఛీ.. ఛీ.. ఇది నిజం కాకపోతే బాగుండు. ఎన్నిసార్లు తాగాను కానీ.. అప్పుడెప్పుడూ కానిది.. అంటూ అనుకుంటాడు కార్తీక్. మోనిత ఇక ఎక్కువ సేపు బతకదు. బతికిస్తావో.. చంపేసుకుంటావో ఇక నీ ఇష్టం అని అంటుంది భారతి. నేను వెళ్తున్నా అంటుంది. సారీ మోనిత అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా సౌందర్య ఆపి.. వెళ్లి పేపర్స్ తీసుకురా అని చెబుతుంది. పేపర్స్ తీసుకురాగానే కార్తీక్ సంతకం చేస్తాడు.

కార్తీక్ సంతకం పెట్టగానే.. త్వరగా ఆపరేషన్ చేయ్ భారతి అని అంటుంది మోనిత. ఆంటీ మీరు బయట వెయిట్ చేయండి అంటుంది భారతి. వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే దీప ఇంటికి వస్తుంది. అసలు.. శాంపిల్స్ ల్యాబ్ లోనే ఉంటే.. మోనితకు గర్భం ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంటుంది.

నాకేం అర్థం కావడం లేదు మమ్మీ అని తన తల్లితో అంటాడు కార్తీక్. తను చెప్పేది చెప్పేసింది. నిర్దారించాల్సింది నువ్వే అంటుంది. నేను తాగిన మాట నిజమే కానీ.. అంటాడు. మోనిత ఇన్నాళ్లు అబద్ధం చెప్పి ఉండొచ్చు. మోసం చేసి ఉండొచ్చు. ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు కానీ.. ఈరోజు తన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది అంటుంది సౌందర్య. అంటే ఏంటి మమ్మీ అంటాడు కార్తీక్. నేనేం మాట్లాడగలను కార్తీక్.. ఏంటోరా.. ఈ విషయంలో నేను ఎలా స్పందించాలో.. దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికే చాలా భయంగా ఉంది.. అంటుంది సౌందర్య.

Karthika Deepam 28 Oct Today Episode : మోనితకు మగపిల్లాడు.. సంతోషంలో మోనిత

ఇంతలో భారతి వచ్చి కంగ్రాట్స్ కార్తీక్.. పండంటి మగ పిల్లాడు పుట్టాడు అంటుంది భారతి. మోనిత కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెబుతుంది. సంతకం పెట్టి మోనితను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది భారతి. ఆ తర్వాత కార్తీక్, మోనిత తిరిగి వస్తుంటారు. ఏం చేయాలి.. దీప పరిస్థితి ఏంటి అని అంటాడు కార్తీక్. ఎన్ని రకాలుగా ఆలోచించినా.. దీపకు తెలిస్తే అది ఎలా తీసుకుంటుందో అనే భయం దగ్గరే ఆగిపోతున్నా అంటుంది సౌందర్య.

కట్ చేస్తే ప్రియమణి ప్లాన్ వేస్తుంది. ఏడుస్తున్నట్టు యాక్షన్ చేస్తుంటుంది. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా.. నువ్వు ఉన్నావు అంటూ అంటుంటే.. దీప వచ్చి ఏమైంది అని అడుగుతుంది. ఏంటి ఏదో దేవుడికి దండం పెడుతున్నావు అంటుంది. అబ్బే అదేం లేదమ్మా అంటుంది. చెప్పు అంటుంది. మోనిత అమ్మకు పురిటి నొప్పులు వచ్చాయంట. పేగు బిడ్డ మెడకు చుట్టుకున్నాడంట. కాన్పు కష్టం అవుతుంది.. ఆపరేషన్ చేయాలి అంటే.. కార్తీక్ వచ్చి తండ్రిగా సంతకం పెడితేనే ఆపరేషన్ చేయించుకుంటాను అందట. ఇదెక్కడి తిరకాసు అమ్మా. అలా అనడం తప్పు కదా. తల్లీబిడ్డలకు ప్రాణం పోయేలా ఉందని తెలిసి కార్తీకయ్య వెళ్లి సంతకం పెట్టి మోనితమ్మను, బిడ్డను కాపాడాడంట.. అని చెబుతుంది.

karthika deepam 28 october 2021 full episode

డాక్టర్ బాబు వెళ్లాడా? సంతకం చేశాడా? అని అడుగుతుంది దీప. అవునంట అమ్మ. సంతకం చేశాడంట. దేవుడు అమ్మ. కార్తీక్ అయ్య దేవుడు కదా. వెళ్లాడు సంతకం చేశాడు. అప్పుడే కదా.. మోనితమ్మకు ఆపరేషన్ చేసింది. గుమ్మడి పండు అంటి మగపిల్లాడు పుట్టాడంట అమ్మ.. అంటుంది ప్రియమణి. దీంతో దీప షాక్ అవుతుంది.

నువ్వు ఎన్నయినా చెప్పు దీపమ్మా.. కార్తీకయ్య మాత్రం దేవుడు అంటూ తన ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎంత కోపం ఉన్నా తండ్రీ బిడ్డల ప్రాణాలు కాపాడాడు.. అంటుంది. ఈ విషయం నేను చెప్పానని కార్తీకయ్యతో అనకండి సరేనా అంటుంది ప్రియమణి. దీంతో దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నాకు తెలియకుండా ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లారా? గుడికని చెప్పి వెళ్లింది అక్కడికా? మోనిత దగ్గరికా? అత్తయ్య కూడా ఇన్ని అబద్ధాలు చెబుతున్నారా? అని అనుకుంటుంది.

ఇంతలో కార్తీక్, సౌందర్య.. ఇంటికి వస్తారు. రాగానే పిల్లలు ఇద్దరూ కార్తీక్ దగ్గరికి వెళ్తారు. ఏంటి ఇంత సడెన్ గా గుడికి వెళ్లారు అని ఆదిత్య అంటాడు. గుడికి వెళ్లడానికి సమయం, సందర్భం ఎందుకు.. దర్శనం బాగా జరిగిందా? అని దీప సెటైర్ వేస్తుంది. ఇంతలో నేనేం పాపం చేశాను అత్తయ్య అంటూ ఏడుస్తుంది. దీంతో దీప ఏడ్వడం చూసి సౌందర్య, కార్తీక్ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Share

Recent Posts

Curry Leaves Benefits : ప్రతి ఉదయం కరివేపాకు నమలడం వల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Curry Leaves Benefits : డయాబెటిస్ నిర్వహణకు అవగాహన మరియు నిరంతర ప్రయత్నాలు అవసరం. నియంత్రణలో లేని డయాబెటిస్ గుండె…

36 minutes ago

AI Analyses X-Ray : ఎక్స్-రేను చూసి జ‌బ్బు ఖచ్చితత్వాన్ని చెప్పిన ఏఐ.. తన ఉద్యోగం పోతుందన్న వైద్యుడు

AI Analyses X-Ray : దుబాయ్‌లో ఉన్న ఒక పల్మోనాలజిస్ట్ వ్యాధులను నిర్ధారించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఖచ్చితత్వాన్ని చూసి…

2 hours ago

Sweets : స్వీట్లు తిన‌గానే నీళ్లు తాగ‌కూడ‌దు, ఎందుకో తెలుసా ?

Why Not Drink Water When You Eat Sweets : స్వీట్లు తిన్నప్పుడు నీళ్లు ఎందుకు తాగకూడదు? స్వీట్లు…

3 hours ago

Yoga Vs Walking : నడక vs యోగా : దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి?

Yoga Vs Walking : చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి, అత్యంత ప్రజాదరణ పొందిన రెండు ఎంపికలు నడక మరియు యోగా.…

4 hours ago

Mango Peels : మామిడి తొక్కల యొక్క అంతగా తెలియని ప్రయోజనాలు..!

Mango Peels : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే పండ్లలో మామిడి ఒకటి. రుచికరమైన మామిడి పండ్లను తినడం కంటే రుచికరమైనది…

5 hours ago

Mars And Ketu Conjunction : శక్తివంతమైన యోగం, 18 ఏళ్ల తర్వాత ఈ రాశుల దశ తిరిగింది

Mars And Ketu Conjunction : వచ్చే నెల ఏడో తేదీన నవ గ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సింహ…

6 hours ago

Actress : ప్ర‌కంప‌నలు పుట్టిస్తున్న హోంమంత్రి హీరోయిన్ లీకులు.. బిగ్ గిఫ్ట్‌లు..!

Actress : బంగారం స్మగ్లింగ్‌ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం…

15 hours ago

Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మ‌హిళ‌.. భ‌ర్త ఇచ్చిన ప‌నిష్మెంట్‌పై ప్ర‌శంస‌లు

Woman  : ఈ రోజుల్లో వివాహేత‌ర సంబంధాలు విచ్చ‌ల‌విడిగా సాగుతున్నాయి. భ‌ర్త‌ల‌ని మ‌బ్బిబెట్టి ప్రియుడితో జ‌ల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే…

16 hours ago