Home » Entertainment » Karthika Deepam 29 August 2022 Full Episode
Entertainment

Karthika Deepam 29 Aug Today Episode : కార్తీక్ మోనిత దగ్గరే ఉండడం చూసిన దీప… ఇక కార్తీక్ దీపని ఏమంటాడు…

Authored By
aruna
The Telugu News | Published on: August 29, 2022, 10:00 am
Advertisement

Karthika Deepam 29 Aug Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1443 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌందర్య, హీమ ఆనంద్రావు లు హోటల్లో కూర్చుని సౌర్య గురించి ఆలోచిస్తూ ఉండగా.. మౌనిత అదే హోటల్ కి వచ్చి కూర్చుని కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య వాళ్లు మౌనితని చూసి ఇది మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది ఎక్కడుంటే అక్కడ ప్రళయం వస్తుంది అని అంటూ ఉంటుంది సౌందర్య. అంతలో మౌనిత కూడా వాళ్ళని చూసి కంగారు పడుతూ ఉంటుంది. నేను ఇలా కంగారు పడితే వాళ్లకి డౌట్ వస్తుంది అని తనే వెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది. అప్పుడు సౌందర్య మౌనిత నీ కొన్ని ప్రశ్నలు అడగగా.. మౌనిత కొత్త డ్రామా ప్లే చేసి వాళ్ళని నమ్మించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత ఇంటికి వెళ్తుంది. కార్తీక్ తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

Advertisement

అంతలో మౌనిత కార్తీ దగ్గరికి వెళుతూ ఉండగా.. తన ఎదురుగా వచ్చి నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎందుకు తీయలేదు.. అని తనతో గొడవ పడతాడు. చివరగా మోనిత కార్తీక్ సారీ కార్తీక్ అసలు ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది. అప్పుడు మనం హైదరాబాద్ కి వెళ్ళిపోదాం. మన బిజినెస్ అక్కడ చాలా బాగుంటుంది. నేను బయటికి వెళ్లి తిరగడానికి కూడా నీకు భయం ఉండదు అని అంటాడు. అప్పుడు మౌనిత కంగారు పడిపోతూ తనకి ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ వెళ్లకుండా ఆగిపోయేలా చేస్తుంది. కట్ చేస్తే దీప కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి డాక్టర్ వస్తాడు. ఏమైందమ్మా ఎందుకు బాధగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈ మౌనిత నుండి నా డాక్టర్ బాబు ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాను అన్నయ్య అని అంటుంది. మౌనిత నుంచి కాపాడడానికి నేనున్నానమ్మా అని డాక్టర్ దీపక్ ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే సౌర్య ఇల్లు మారి వేరే ఇంటికి వస్తారు.

Karthika Deepam 29 August 2022 Full Episode

Advertisement

గండ ఆటో పైన అమ్మానాన్నలు ఎక్కడున్నారు.. అనే టైటిల్ రాయించుకొని తీసుకొని వస్తాడు. అప్పుడు దానిని చూసి సౌర్య ఎక్కడున్నారు అమ్మానాన్న అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే దీప పిల్లల గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూ.. పిల్లలకి ఫోన్ చేసి చెప్తామంటే నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు.. వాళ్లేమో హైదరాబాద్నుంచి అమెరికాకి వెళ్లిపోయారు.. ఇప్పుడు ఎలా బాధపడుతూ… ముందు నేను ఎలాగైనా డాక్టర్ బాబుని కలవాలి. తర్వాత అంత డాక్టర్ బాబే చూసుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఆటోలో వెళుతుండగా కార్తీక్ ని చూసి తన దగ్గరికి వెళ్లే లోపు కార్తీక్ వెళ్లిపోతారు. అప్పుడు దీప బాధపడుతూ తనని ఫాలో అవుతుంది. కార్తీక్ ఒక ఇంట్లోకి వెళుతుండగా దీప అక్కడికి వెళ్లి కార్తీక్ నీ డాక్టర్ బాబు అని పట్టుకుంటూ ఉండగా.. కార్తీక్ దీపని ఆగు ఆగు అని అంటుండగా.. అంతలో మౌనిత బయటికి వస్తుంది. దీప మౌనిత ని చూసి ఆశ్చర్యానికి గురవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి