karthika deepam 31 august 2022 full episode
karthika deepam 31 august 2022 full episode : కార్తీకదీపం సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1445 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత దగ్గరికి వెళ్లిన దీప కార్తీక్ కోసం ఘర్షణ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. అప్పుడు మౌనిత డబ్బుల కోసం ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. అప్పుడు దీప ఎవరి డబ్బులు కోసం వచ్చింది నేను నా మాంగల్యం కోసం వచ్చాను నా భర్త కోసం వచ్చాను అని అంటుంది..తనని నువ్వు నమ్మకు అని అంటుంది. అప్పుడు నా డాక్టర్ బాబుని ఏం మాయ చేసావే నన్ను గుర్తుపట్ట లేకుండా ఏం చేసావే అని ఏడుస్తూ డాక్టర్ బాబు నేను వంటలక్కని అని కార్తీక్ గతం గుర్తొచ్చేలా అన్ని విషయాలను చెప్తూ ఉంటుంది.
అప్పుడు మౌనిత ఏంటే ఊరుకుంటున్న కొద్ది రెచ్చిపోతున్న ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరు పిల్లలకి ఎవరిని తండ్రిని చేద్దామనుకుంటున్నావే.. అని అంటుండగా దీప ఒక్కసారిగా మౌనితపై దాడి చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న స్టాపు వచ్చి దీపని మౌనితను విడదీస్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట నువ్వు వచ్చి ఇలా పుల్లలు పెడతావ్ ఏంటమ్మా అని స్టాప్ అప్పుడు దీప అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.అప్పుడు కార్తీక్ గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మోనిత శివకు చెప్పి తనని వెళ్ళమని చెప్తుంది. శివ దీప ని లాక్కెళ్తూ ఉండగా.. మౌనిత కూడా అక్కడికి వెళ్లి నేను పంపిస్తాను కానీ నువ్వు సార్ కోసం మందులు తీసుకురా పో అని అంటుంది శివాని. అప్పుడు ఏమందులే నా డాక్టర్ బాబుకి ఏమైంది ఏం చేస్తున్నావ్ నన్ను గుర్తుపట్టలేనంతగా నువ్వేం చేసావు.
karthika deepam 31 august 2022 full episode
ఎందుకే మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాం అని అంటుంది దీప. అప్పుడు పోయిన జన్మలో కార్తీక్ నీ భర్త ఇప్పుడు చావు దగ్గరికి వెళ్లి బ్రతికి వచ్చాడు. ఈ జన్మకి నా భర్త నువ్వేం చేయలేవు నా కార్తిక్ నా నుంచి దూరం చేయలేవు అని అంటుంది మోనిత. అప్పుడు దీప నువ్వు అప్పుడు కూడా ఇలాగే ఎగిరావు ఏం జరిగింది. నా భర్త నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు కూడా అలాగే వస్తాడు నువ్వు సన్యాసి లలో కలిసే రోజు వస్తుంది. తప్పకుండా నా భర్తని నేను గుర్తుపట్టేలా చేస్తా మాది చాలా బలమైన బంధం నా ప్రేమే తను నన్ను గుర్తుపట్టేలా చేస్తుంది. అప్పటివరకు నా డాక్టర్ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కార్తీక్ దీప అన్నమాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో మౌనిత తన దగ్గరికి వచ్చి ఏమైంది కార్తీక్ అని అడుగుతుంది. అప్పుడు అసలు ఆవిడ ఎవరు నీకు తెలియదా.. నిజంగా తెలియదా.. ఆమెని చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది అని అంటాడు.
అప్పుడు తనను చూస్తుంటే జాలి కలుగుతుందా.. శివ తన గురించి ఎంక్వయిరీ చేశాడు ఇలా డబ్బుల కోసం ప్రతి ఇంటికి వెళ్తూనే ఉంటుందట అని అంటుంది. ఎప్పుడైనా నీ దగ్గరకు వస్తే లాగి గూబమీద ఒకటి ఇవ్వు… అంతేకాని తను చెప్పిన మాటలు నమ్మకు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు కూడా ఇదే విధంగా ఏడ్చావు కదా నిన్ను నమ్మాను కదా.. తను ముందు వస్తే తనని నమ్మేవాడినేమో అయినా నా బాధ నీకు ఏం అర్థమవుతుంది.. మర్చిపోయినోడికి తెలిసింది ఆ బాధ ఏంటో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత తనని ఎలాగైనా దక్కించుకోవాలి అని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్లకి జరిగిందంతా చెబుతుంది.
అప్పుడు పెద్ద ఆవిడ ఆశ్చర్యానికి గురై.. ఏం కాదులే దాని పాపం పండే రోజు కచ్చితంగా వస్తుంది. నీకైతే నీ డాక్టర్ బాబు కనిపించాడు కదా నువ్వేం బెంగపడకు అని పెద్ద ఆవిడ ధైర్యం చెబుతూ ఉంటుంది. అప్పుడు దీప డాక్టర్ని గతం మర్చిపోవే మందులు ఉంటాయా.. ఆ మందులు అలా వేస్తుంటే నా డాక్టర్ బాబుకి ఏమైనా జరిగితే ఎలా అని అంటుంది. గుర్తు రావడానికి ఏమైనా మందు ఉందా అన్నయ్య అని అంటుంది. అప్పుడు ఉందమ్మా కేవలం నీ ప్రేమతోనే నీ భర్తని నీ సొంతం చేసుకోగలవు కాబట్టి.. నువ్వు ఆ పనిలో ఉండు అని చెప్తాడు. సరే అని అంటుంది దీప. రేపటి ఎపిసోడ్ లో దీప మౌనిత ఇంటికి ఎదురుగా తిష్ట వేసి బిర్యానీ వండుతూ ఉండగా… ఆ స్మెల్ కార్తీక్ శివ చూస్తూ… మౌనిత అని పిలిచి మన ఇంట్లో పని మనిషిని పెడదాం.. ఇక్కడ ఎవరో బిర్యాని చాలా చక్కగా వండుతున్నారు.
అని తన దగ్గరికి తీసుకొని వెళుతూ ఉండగా.. అక్కడ బిర్యానీ వండే ది దీపనే. అప్పుడు ఆశ్చర్యంగా చూస్తూ కార్తీక్ నువ్వా అని అంటాడు.. మోనిత మాత్రం భయపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.