Karthika Deepam 7 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 7 అక్టోబర్ 2021, గురువారం 1164 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.హిమ.. స్కూల్ కు వెళ్లకుండా ఓ చోట కారు దిగి.. కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మోనిత ఆంటి చెబుతుంటే డాడీ ఏం మాట్లాడలేదంటే అవన్నీ నిజాలే కదా. డాడీ బ్యాడ్ బాయ్ కదా.. అని హిమ అనుకుంటుంది. డాడీ మంచివాడని అనుకున్నా. ఇలా అబద్ధాలు చెబుతాడని అనుకోలేదు. అలా అంటే డాడీ చెబుతున్నవన్నీ అబద్ధాలన్నీ అమ్మ, నానమ్మకు తెలిసి కూడా వాళ్లు ఊరుకుంటున్నారా? అసలు ఎవరు నిజం చెబుతున్నారో? ఎవరు అబద్ధం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు.. అని అనుకుంటుంది హిమ.
కట్ చేస్తే.. అనుకున్నదే జరిగిందా అని అంటుంది సౌందర్య. పిల్లలు పేపర్ చూడకూడదు అనుకుంటే చూసేశారా.. అంటుంది సౌందర్య. అప్పటికే నేను పేపర్ ను బెడ్ కింద దాచిపెట్టాను అత్తయ్య.. కానీ వాళ్లు పేపర్ చూసేశారు అంటుంది దీప. మరి.. ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది సౌందర్య. ఆ మోనిత తెచ్చుకున్న కృత్రిమ గర్భం గురించి ఏం చెప్పగలం.. అలా అని అబద్ధం కూడా చెప్పలేం.. అంటుంది సౌందర్య. నువ్వంటే నాన్నకు ఇష్టం లేదా.. అని శౌర్య అడిగింది.. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు అని దీప అంటుంది.
ఈ కుటుంబం ఎటు పోతుందో నాకు అర్థం కావడం లేదు. 11 ఏళ్లు నా పెద్ద కోడలు ఇంట్లో లేదు. ఆ తర్వాత మోనిత చేసిన విషయాలు.. ఒక ప్రశ్నకు సమాధానం ఆలోచించేలోగా.. 10 ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.. అని సౌందర్య అంటుంది. శౌర్య ఓకే కానీ.. హిమను ఒప్పించడం మాత్రం చాలా కష్టం అని అంటుంది దీప.
ఇంట్లో వాళ్లను ఒప్పించలేక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది అత్తయ్య అంటుంది దీప. ఇంకా నయం.. భాగ్యం, శ్రావ్య మారారు కాబట్టి ఇంకా గొడవలు లేవు కానీ.. లేదంటే వాళ్లను ఒప్పించలేక పరిస్థితి చేయి దాటి ఉండేది అని అంటుంది సౌందర్య.
కట్ చేస్తే మోనిత జైలులో చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా కార్తీక్ ను చూశాను.. నా కార్తీక్ తో మాట్లాడాను. కలర్ శారీలో కార్తీక్ తో మాట్లాడాను. దేవుడా నువ్వు ఉన్నావు అని అనుకుంటుంది మోనిత. ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి ఏంటి ఇంత హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది. మేడమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు అంటుంది. అవును సుకన్య.. ఫుల్ గా హ్యాపీగా ఉన్నా.. అంటుంది.
నీకు డ్యూటీ పడకున్నా నువ్వు నాకు సపోర్ట్ గా కానిస్టేబుల్స్ ను పంపించావు. ఫుల్ హ్యాపీ అంటుంది. సోడాలు తెచ్చి ఇస్తుంది. ఇద్దరూ ఎంజయ్ చేస్తూ సోడా తాగుతారు. అవును సోడాలు తగ్గించమన్నాను తగ్గించలేదా.. అంటే తగ్గిద్దామనే చూస్తున్నాను మేడమ్ అంటుంది సుకన్య.
జైలులో నాకు ఎంతో హాయిగా ఉంది తెలుసా.. అంటుంది. మేడమ్ ఇది మీ ఇల్లు అనుకోండి అంటుంది.. సుకన్య. ఏంటో నాకు అన్నీ అలా కలిసి వస్తున్నాయి. కార్తీక్ ను కలవడం ఆ హిమ చూసింది. అది చాలు.. మిసైల్ పేలినట్టే.. అని అనుకుంటుంది.కట్ చేస్తే.. శౌర్యతో మాట్లాడేందుకు సౌందర్య ట్రై చేస్తుంది. మీ నాన్న మంచోడు అని అంటే.. మీ అబ్బాయి గురించి నువ్వు మంచి కాకుంటే ఇంకే చెబుతావు నానమ్మ అంటుంది. నిన్ను కొట్టానంటే అని అంటుంది. నువ్వు కొట్టవులే నానమ్మ అంటుంది.. శౌర్య.
ఆ మోనిత వేసిన వెధవ ప్లాన్ లో మీ నాన్న చిక్కుకున్నాడు. మీ నాన్న తప్పు చేస్తే మేం ఊరుకోం కదా. వాడితో మాట్లాడం కదా. మేమంతా బాగానే ఉన్నాం కదా.. మీ నాన్న మంచోడు.. ఈ ముక్క హిమకు అర్థం అయ్యేలా చెప్పు.. అని చెబుతుంది సౌందర్య. సరే నానమ్మా నేను నమ్ముతున్నాను అంటుంది శౌర్య.
అప్పుడే హిమ ఇంటికి వస్తుంది. ఆదిత్య, శ్రావ్య తీసుకొని వస్తారు. దారిలో కనిపించింది తీసుకొని వచ్చాను. ఏం అడిగినా సమాధానం చెప్పడం లేదు.. అంటుంది. ఇది ఈ ఇంట్లో పిల్లల సంగతి.. అని అంటాడు ఆదిత్య. దీపను చూసి కూడా హిమ మాట్లాడకుండా వెళ్లిపోతుంది.
హిమకు ఏమైంది.. అలా మాట్లాడకుండా వెళ్లిపోతోంది. ఏమైంది.. స్కూల్ కు వెళ్లలేదా అని దీప అడుగుతుంది. దారిలో కనిపించింది.. అయినా ఎవరూ మాట్లాడరు కదా. ఎటూ కాకుండా శ్రావ్య అడిగితే నన్ను వదిలేయ్ పిన్ని అంది. ఊ అంటే అలుగుతారు. ఏడుస్తారు.. అనగానే పిల్లలిద్దరూ మోనిత గురించి చదివారు ఆదిత్య. అందుకే.. పిల్లలు అలా ప్రవర్తిస్తున్నారు అంటుంది దీప.ఇదే జరిగేది. మోనిత ఇలా చేసింది.. ఇది అబద్ధం అని ఓపెన్ గా చెబితే అయిపోతుంది కదా. దాచిపెడితే పది మంది చెప్పేవే నమ్ముతారు వాళ్లు అంటాడు ఆదిత్య. నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు అది. నిజం చెబితే అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ.. ఈ పిల్లలు వంద ప్రశ్నలు వేస్తారు.. అని అంటుంది సౌందర్య. మీరు ఏదైనా అనండి.. నిజం చెప్పేస్తే అయిపోతుంది అని అంటాడు ఆదిత్య. ఒకవేళ నిజం చెప్పకపోతే అమెరికా వెళ్లడమే ఉత్తమం కదా అంటాడు ఆదిత్య.
కట్ చేస్తే.. ఆసుపత్రిలో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. మోనిత గురించి ఆలోచిస్తుంటాడు. ఒక నోట్ బుక్ తీసుకొని దాంట్లో క్వశ్చన్ మార్క్ రాసి.. ఏం చేయాలి.. అని అనుకుంటాడు. మోనిత జైలు నుంచి సరాసరి నా ఆసుపత్రికే రాగలిగిందంటే ఏదైనా చేయగలదు. మోనిత వచ్చిన విషయం దీపకు చెబితే.. నో నో.. చెప్పి తనను టెన్షన్ పెట్టడం తప్ప సాధించేదేమీ ఉండదు. దీపకు చెప్పకపోవడమే మంచిది. చెప్పను.. అని అనుకొని వెంటనే డాక్టర్ భారతికి ఫోన్ చేస్తాడు. ఒకసారి క్యాబిన్ కు రా అంటాడు.
ఇంట్లోకి వెళ్లగానే హిమ.. శౌర్యతో అన్ని విషయాలు చెబుతుంది. ఆసుపత్రికి మోనిత వచ్చిన విషయాలు అన్నీ చెబుతుంది. నిజంగా నాన్న మోనిత ఆంటితో మాట్లాడారా.. అని అడుగుతుంది శౌర్య. అయ్యో శౌర్య.. నేను చూశాను అని చెబుతున్నాను కదా.. అంటుంది. జైలుతో ఉన్న మోనిత ఆంటి.. నాన్నను ఎలా కలుస్తుంది అంటే.. ఏమో.. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను చూశాను. మనిద్దరినీ అబద్ధాలతోనే పెంచారు శౌర్య. నాన్న, మోనిత ఆంటీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు. షైనీ చెప్పినట్టు ఇంకేదో ఉంది. డాడీ గుడ్ బాయ్ ఏం కాదు తెలుసా.. అని హిమ అంటుంది.
అవును శౌర్య.. మనం విజయనగరంలో ఎక్కడ ఉన్నామో చెబితే డాడీ మోనిత ఆంటీని పెళ్లి చేసుకుంటా అన్నాడట తెలుసా.. అంటుంది. నాన్న మోనిత ఆంటీని పెళ్లి చేసుకోవడం ఏంటి. అలా ఎలా చేసుకుంటాడు తప్పే కదా.. అంటుంది శౌర్య.కార్తీక్ బర్త్ డే రోజున పిల్లలు విష్ చేస్తారేమో అని అనుకుంటాడు కార్తీక్. కానీ.. పిల్లలు మాత్రం కార్తీక్ కు విష్ చేయరు. శౌర్య.. కూడా విష్ చేయదు. హిమ అయితే కార్తీక్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దీపకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.