
Karthika Deepam Fame Premi Viswanath has a rare disease
Karthika Deepam 9 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2021, మంగళవారం 1192 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, సౌందర్య.. ఇద్దరూ పూజ కోసం గుడికి వెళ్తుంటారు. మధ్యలో ఎందుకో కార్తీక్ కారు ఆపేస్తాడు. వెనక్కి వెళ్లిపోదాం మమ్మీ. నా వల్ల కాదు మమ్మీ అంటాడు. ఈ పూజలు ఇవన్నీ నా వల్ల కాదు. నా మనసు ఒప్పుకోవడం లేదు అంటాడు. దీపను మోసం చేస్తున్నానని అనిపిస్తోంది అని సౌందర్యతో అంటాడు. జరగాల్సింది ఇప్పటికే జరిగిపోయింది. దీప కోసం నువ్వు చేసేది ఏదైనా ఉంది అంటే ఇప్పుడు నువ్వు పూజకు రావడమే అంటుంది సౌందర్య.
karthika deepam 9 november 2021 full episode
మీ డాడీయే కరెక్ట్ రా. దీపకు నిజం చెప్పేస్తే భారం తగ్గుతుంది అన్నారు.. అంటుంది సౌందర్య. మమ్మీ దీపకు చెప్పడానికి.. అంటూ ఏదో అనబోయేసరికి.. ఇది సమయం.. సందర్భం కాదు అంటావా? అంటుంది సౌందర్య. ఒకటి చెప్పు.. నీ ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందా? చెప్పు. నువ్వు పూజకు వస్తానంటే కారు పోనియ్. లేదంటే చెప్పు నా పెద్ద కోడలుకు అన్ని విషయాలు చెప్పేస్తా. నువ్వు రాకున్నా పర్వాలేదు. నేనే కారు దిగి వెళ్లిపోతాను అంటుంది సౌందర్య. దీంతో చేసేది లేక.. కార్తీక్ కారును గుడికి పోనిస్తాడు.
మరోవైపు ఫుల్ ఎంజాయ్ మూడ్ లో కారు నడుపుతూ ఉంటుంది మోనిత. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ప్రియమణి అంటుంది మోనిత. నేను గెలిచాను.. నేనే గెలవబోతున్నాను అంటుంది మోనిత. ఆ గెలుపులో ఉండే కిక్కే వేరు ప్రియమణి అంటుంది. ఏంటి ప్రియమణి.. మా మోనితమ్మకు ఏమైంది అని అనుకుంటున్నావా? ఆనందం ప్రియమణి. నేనేంటి కార్తీక్ పక్కన కూర్చొని.. బాబును ఒళ్లో పెట్టుకొని అత్తగారి ముందు పూజ చేయడం.. అబ్బ ఊహించుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అంటుంది మోనిత.
మరోవైపు కారులో దీప.. వెళ్తుంది. పిల్లలను స్కూల్ లో దింపి ఎక్కడికో బయలుదేరుతుంది. ఏంటి అక్కా నువ్వు ఇన్ని రోజులు సరదాగా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అంటాడు. అన్నీ మారిపోతుంటాయిరా.. అని దీనంగా చెబుతుంది దీప. మరోవైపు దీపకు చెప్పకపోవడం చాలా పెద్ద తప్పు.. అంటూ సౌందర్య కార్తీక్ తో అంటుంది. దీప కోసమే నేను ఈ పూజ చేయిస్తున్నాను అంటూ అసలు విషయం చెబుతుంది సౌందర్య.
ఇంతలో గుడికి వస్తారు సౌందర్య, కార్తీక్. పంతులు పూజ కోసం అన్నీ రెడీ చేస్తాడు. అంతలోనే మోనిత, ప్రియమణి వస్తారు. ప్రియమణికి ఏదో పని అప్పగిస్తుంది మోనిత. బాబును తీసుకొని ప్రియమణి, మోనిత గుడి లోపలికి వస్తారు. మరోవైపు తొందరగా పోనివ్వు అని వారణాసితో అంటుంది దీప.
karthika deepam 9 november 2021 full episode
కార్తీక్ ను సంప్రదాయమైన బట్టలు వేసుకోవాలని చెబుతాడు పంతులు. దీంతో బట్టలు వేసుకొని వస్తాడు కార్తీక్. ఇంతలో మోనిత వచ్చి పంతులు గారికి నమస్కారం పెడుతుంది. కార్తీక్, మోనిత పూజలో కూర్చుంటారు. పూజ ప్రారంభం అవుతుంది. ఇంతలో కారును గుడి దగ్గర ఆపమంటుంది దీప. నువ్వు వెళ్లిపో.. నేను ఆ కారులో వస్తాను అని చెప్పి వారణాసిని పంపించేస్తుంది దీప. గుడిలోకి వెళ్లి అక్కడ పూజలో కూర్చున్న కార్తీక్, మోనితను చూసి షాక్ అవుతుంది దీప. తనకు వెంటనే కళ్లు తిరుగుతాయి.
అక్కడ పూజ చేస్తున్నారు కదా.. ఏంటది అని పంతులును అడుగుతుంది. బాబు పేగు మెడకు వేసుకొని జన్మించాడు. దోష నివారణ కోసం ఆ దంపతులు పూజ చేయిస్తున్నారమ్మా.. ఇంతకీ మీరు ఎవరు అని అడుగుతాడు పూజారి. దీంతో దీపకు ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.