Home » Entertainment » Karthikeya 2 Movie Wanted Pandugadu Tees Maar Khan Matarani Mounamidi Thiru
Entertainment

Karthikeya 2 Movie : కార్తికేయ 2కు కలిసిసొచ్చిందిగా.. ఈ వారం మరీ ఇంత ఘోరమా?

Authored By
aruna
The Telugu News | Published on: August 19, 2022, 6:20 pm
Advertisement

Karthikeya 2 Movie : వారం వారం మారుతూ ఉంటే.. థియేటర్లో బొమ్మలు మారాల్సిందే. అయితే సినిమాలో బలం ఉంటే.. అది రెండు మూడు వారాలు ఆడుతుంది. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయితే నాలుగైదు వారాల వరకు వెళ్తుంది. అయితే గత మూడు వారాలుగా టాలీవుడ్‌కు మంచి శకునాలే కనిపించాయి. వరుసగా హిట్ల మీద హిట్లు పడుతున్నాయి. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 ఇలా అన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇందులో సీతారామం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సీతారామం ఓవర్సీస్‌లో కుమ్మేస్తుండగా.. బింబిసార రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపుతోంది.

Advertisement

ఆ వారం గ్యాప్‌తో వచ్చిన కార్తికేయ 2 అయితే అన్ని చోట్లా హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూడూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరినిచ్చాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన సినిమాలు వచ్చాయి. తమిళం నుంచి తెలుగులోకి తిరు అనే చిత్రం వచ్చింది. ఇది ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చేసింది. ఇక వాంటెడ్ పండుగాడ్, మాటరాని మౌనమిది, తీస్ మార్ ఖాన్ ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి.

Karthikeya 2 Movie Wanted Pandugadu Tees Maar Khan Matarani Mounamidi Thiru

Advertisement

కానీ ఇందులో ఏ ఒక్క చిత్రానికి కూడా భారీ బజ్ లేదు. ఇక కనీసంలో కనీసం అంటే.. తీస్ మార్ ఖాన్ సినిమాకు క్రేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఈ సినిమా వచ్చింది. అయితే కార్తికేయ 2, సీతారామం, బింబిసార వంటి సినిమాలను ఢీకొట్టాంలే ఈ చిత్రాలు సరిపోవు. సో ఈ వారం వచ్చిన ఏ చిత్రాలు కూడా ప్రభావం చూపకపోవడంతే.. కార్తీకేయ 2 సినిమాకు మరోవారం కలిసి వచ్చినట్టు అయింది. ఈ లెక్కన కార్తికేయ 2 డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలవబోతోందన్న మాట.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి