Karthikeya : అందరి ముందే ఆ కోరికని తీరుస్తావా అంటూ షాకింగ్ కామెంట్ చేసిన యువ హీరో..!
Karthikeya : యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ కొట్టి ఇప్పుడు స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం భజే వాయు వేగం అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ 8 గా తెరకెక్కుతోంది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను ఓవర్సీస్‌లో శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు..ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం మలయాళ భామ ఐశ్వర్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి రాధన్ సంగీతం అందిస్తుండగా.. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు.
భజే వాయు వేగం మూవీ మే 31న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ చిత్ర హీరోయిన్ ఐశ్వర్య మీనన్, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి సుమ అడ్డా షోకి వచ్చారు. ఇక భజే వాయువేగం టీమ్ పై కామెడీ పంచులు కురిపించింది. సుమ. కార్తికేయ కూడా అసలు తగ్గలేదు. సుమకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ అదరగొట్టాడు. ఆమె పైన కూడా పంచులు కురిపించాడు. ఐపీఎల్ అంటే ఏం గుర్తొస్తుందో… చెప్పాలని సుమ అడిగారు. ఈ ప్రశ్నకు కార్తికేయ, ఐశ్వర్య మీనన్ సమాధానాలు చెప్పారు. కార్తికేయ.. ఐపీఎల్ అంటే యాంటీ మేకప్ ఫోర్స్ అంటూ… షోలో పాల్గొన్న అమ్మాయిల మేకప్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారు .ఇక తెలుగు భాషలో నాకు నచ్చని పదం మేకప్ అన్నాడు. అది తెలుగు పదం కాదని సుమ పంచ్ వేసింది. పక్కనే ఉన్న ఐశ్వర్య గట్టిగా నవ్వేసింది.
Karthikeya : అందరి ముందే ఆ కోరికని తీరుస్తావా అంటూ షాకింగ్ కామెంట్ చేసిన యువ హీరో..!
ఐశ్వర్యను ఉద్దేశిస్తూ… మేకప్ ఆమె వేసుకోవడం కాదు, మేకప్ ఆమెను వేసుకుందని కార్తికేయ అన్నాడు. ఇక సుమ అందరికీ జ్యూస్ ఇచ్చింది. ఇది తాగితే ఏమవుతుందని కార్తికేయ సుమను అడిగారు. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్పింది సుమ. అయితే సుమగారు నా సినిమా ప్రొడ్యూస్ చేయాలని అడిగాడు. దాంతో సుమ షాక్ అయ్యింది. బిత్తర ముఖం వేసుకుని చూసింది. సుమ త్వరలో తన కొడుకుతో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.ఆ చిత్రాన్ని సుమనే నిర్మించనుండగా, పనిలో పనిగా తన సినిమాని కూడా నిర్మించమని కార్తికేయ చెప్పుకొచ్చాడు. దాంతో సుమకి సౌండ్ లేదు
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.