Home » Entertainment » Kaushal Manda About Anchor Suma And Rajeev Kanakala
Entertainment

21 ఏళ్ల క్రితమే అలాంటి పనులా?.. సుమ రాజీవ్ కనకాల వ్యవహారం మామూలుగా లేదు!!

Authored By
Admin
The Telugu News | Updated on: December 8, 2020, 10:14 am
Advertisement

సుమ రాజీవ్ కనకాలది ప్రేమ వివాహామన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు. సుమ రాజీవ్ కనకాల వ్యవహారంపై నిత్యం ఏదో రకమైన రూమర్ వస్తూనే ఉంటుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. విడిపోయారు.. విడాకులు తీసుకున్నారు.. వేర్వేరుగా ఉన్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిపై ఏనాడు కూడా అంత సీరియస్‌గా స్పందించలేదు. అలా సుమ రాజీవ్ మధ్య పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.

Advertisement

Kaushal Manda About Anchor Suma and Rajeev Kanakala

కానీ ఈ మధ్య రాజీవ్ కనకాల సుమ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తామిద్దరం ఎంత సన్నిహితంగా ఉన్నామో పరోక్షంగా చెప్పేందుకు హింట్లు ఇస్తున్నారు. ప్రేమగా దిగిన సెల్ఫీలు షేర్ చేస్తూ.. వీడియోలు చేస్తూ ఒక్కటిగానే ఉన్నామని చెబుతున్నారు. అయితే ఈ మధ్య రాజీవ్ కనకాల తమ మధ్య జరిగిన గొడవల గురించి బయటకు చెప్పాడు. ఏ భార్యాభర్తల మధ్యనైనా జరిగే చిన్న చిన్న గొడవలే మా మధ్య కూడా జరిగాయయని కానీ వాటిని మీడియా పెద్దగా చూపిందని తెలిపాడు.

Advertisement

అయితే రాజీవ్ కనకాల సుమ పెళ్లి కాకముందే అంటే దాదాపు 20 , 21 ఏళ్ల క్రితం చెట్టాపట్టాలేసుకుని తిరిగారట. సుమను బైక్ మీద ఎక్కించుకుని రాజీవ్ కనకాల తిరిగేవాడట. ఆ దృశ్యాలను బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తాజాగా బయటకు వెళ్లడించాడు. క్యాష్ షోలో పాల్గొన్న కౌశల్.. సుమ రాజీవ్ కనకాల గుట్టు విప్పాడు. కానీ మా ఆయన నన్ను ఎప్పుడూ అలా తిప్పలేదే.. అంటే వేరే అమ్మాయిని వేసుకుని తిరిగాడా? అంటూ రివర్స్ కౌంటర్ వేసింది సుమ. మొత్తానికి కౌశల్ భలే పాయింట్ బయటకు తీశాడు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి