Home » Entertainment » Keerthy Bhat Says About Her Past Life
Entertainment

keerthy bhat : రూ.200 ఇస్తే వ‌స్తావా అని నన్ను అడిగారు.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేవారన్న కీర్తి భ‌ట్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 28, 2024, 8:00 pm
Advertisement

keerthy bhat : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కీర్తి భ‌ట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2019లో మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ని ప‌ల‌క‌రించి సంద‌డి చేసింది. ఇందులో భానుగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్రలో కనిపించి చాలా పాపులారిటీ ద‌క్కించుకుంది. ఇక బిగ్ బాస్ షోలోను పాల్గొని సంద‌డి చేసింది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ హ‌డావిడి చేస్తుంది. అలానే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా పాల్గొంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంది. తాజాగా కీర్తి సురేష్ కొన్ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. కీర్తి జీవితంలో ఎన్నో కష్టాలు.. చేదు రోజులు ఉన్నాయి. సీరియల్స్ లోకి రాకముందే ఆమె జీవితంలో పెను విషాదం నెలకొంది.

Advertisement

keerthy bhat : లైంగిక వేధింపులు

కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఈ ప్రమాదంలో కీర్తి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. తీవ్రగాయాలైన కీర్తి చాలాకాలం పాటు కోమాలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న కీర్తి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. మంగుళూరు నుంచి బెంగుళూరు చేరుకుని అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. అయితే కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగుళూరుకు తీసుకువెళ్లి అక్కడే 35 రోజులపాటు చికిత్స అందించారని తెలిపింది.

keerthy bhat : రూ.200 ఇస్తే వ‌స్తావా అని నన్ను అడిగారు.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేవారన్న కీర్తి భ‌ట్..!

Advertisement

అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడో టచ్ చేసేవారని తెలిసినప్పటికీ ..స్పర్శలేకపోవడం వల్ల నెట్టేయడానికి బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎక్కడకైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే 200 ఇస్తా వస్తావా అంటే సరే వస్తానని అనేదాన్ని. ఆ తర్వాత వాళ్ల లుక్స్ చూసి అర్థమయ్యేది అంటూ తన బాధను చెప్పుకుంది.కీర్తి భట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కీర్తికి కన్నడ పరిశ్రమకు చెందిన విజయ్ కార్తీక్ తో నిశ్చితార్థం జరిగింది. ఏపీకి చెందిన కార్తీక్ కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. సేడు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌ర‌గ‌నుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి