Home » Entertainment » Ketika Sharma Latest Photos In Traditional Look
Entertainment

Ketika Sharma : ట్రెడిషనల్ డ్రెస్‌లో కేతిక శర్మ.. ఈ యాంగిల్లో కేతిక శర్మ పిచ్చెక్కిస్తోందిగా..?

Authored By
mallesh
The Telugu News | Published on: August 26, 2022, 12:00 pm
Advertisement

Ketika Sharma : కుర్రహీరోయిన్ కేతికశర్మ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది.తన కొత్త సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్‌ను తీసుకొచ్చింది. కేతిక శర్మ నటించిన కొత్త మూవీకి విడుదలకు సిద్ధం కావడంతో ఈ అమ్మడు హాట్ నుంచి కాస్త సంప్రదాయ దుస్తులకు షిఫ్ట్ అయ్యింది. కేతిక శర్మ ఈ పేరు వింటే చాలు కుర్రకారు హృదయాలు రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభిస్తాయి. ఢిల్లీలో పుట్టి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన భామ నటించిన ఒకటి రెండు సినిమాలతోనే మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Ketika Sharma : కాస్త ట్రెడిషనల్ టచ్..

కేతికశర్మ ఇటీవల పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఈ అమ్మడు కాస్త బోల్డ్ టచ్ ఇచ్చింది. ఈ మాత్రం దానికే కుర్రకారంతా తమ మతులు పోగొట్టుకున్నారు. కేతికశర్మ అందాలు చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేరు. కత్తులాంటి చూపులతోనే కుర్రాళ్లను తన వెంట తిప్పుకునే అందం ఈ బ్యూటీ సొంతం. కేతిక గతంలో నాగశౌర్య హీరోగా లక్ష్య మూవీలోనూ నటించింది. కానీ అదిపెద్దగా ఈ భామకు పేరు తీసుకురాలేదు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరో వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా చిత్రంలో ఈ బోల్డ్ బ్యూటీ నటిస్తోంది.

Ketika Sharma Latest Photos In Traditional Look

Advertisement

దీనికి సంబంధించి అప్డేట్‌తో కేతిక ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 2 ఈ సినిమా విడుదల అవుతుండగా.. దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఇందులో కేతిక శర్మ, వైష్ణవ్ తేజ్ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు. స్టోరీ కాస్త డిఫరెంట్‌గా ఉన్నట్టు ట్రైలర్ హైలెట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఆధారంగా సినిమా ఉండబోతుందని ఇట్టే అర్థమవుతోంది.అంతేకాకుండా కేతిక మెరున్ కలర్ గగ్రా చోలిలో దిగిన ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో కేతిక శర్మ సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి