Kiara Advani : పెళ్లిపై అలాంటి అభిప్రాయం.. కరణ్ షోలో నోరు విప్పిన కియారా అద్వాణీ
Kiara Advani : బాలీవుడ్ జంటల్లో ఇప్పుడు కాస్త ట్రెండింగ్‌లో ఉన్నది కియారా అద్వాణి సిద్దార్థ్ మల్హోత్రానే. ఎందుకంటే రణ్ బీర్ కపూర్ అలియా భట్, కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌ల పెళ్లిళ్లు అయిపోయాయి. అంతకు ముందు అయితే ఈ మూడు జంటల గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్లు వస్తూనే ఉండేవి. ఇక ఇప్పుడు ఆ రెండు జంటలకు పెళ్లిళ్లు అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి కియారా సిద్దార్థ్ మీద పడింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో భాగంగా కియారా మాట్లాడుతూ పెళ్లి మీద తన అభిప్రాయాన్ని చెప్పింది.
తాను తన ఇంట్లో అందమైన వివాహా వేడుకలను చూశానని, తనకు వివాహ వ్యవస్థ మీద ఎప్పుడూ నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. పెళ్లి అనేది కచ్చితంగా నా జీవితంలో ఉంటుంది.. కానీ నేను దీని గురించి ఇప్పుడే వెల్లడించను. అది కూడా ఈరోజు కాఫీ విత్ కరణ్‌లో అస్సలు చెప్పను అన్నట్టుగా తెలిపింది. కరణ్ – షాహిద్ మరిన్ని వివరాలను కియారా నుంచి రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మీ పెళ్లికి నన్ను ఆహ్వానించరా? అని కూడా కరణ్ కియరాను అడిగాడు. అయితే తనను కచ్చితంగా ఆహ్వానిస్తానని వెంటనే ధృవీకరించింది.
Kiara Advani Opinion on Marriage in Koffee with karan Show
షోలో అనేక ఇతర సెన్సిటివ్ అంశాలు అరుదైన మూవ్ మెంట్స్ ఆకట్టుకున్నాయి. ఇదే టాక్ షోలో కరణ్ తన తదుపరి యాక్షన్ చిత్రంలో అవకాశాన్ని కియారా ధృవీకరించింది. అయితే షాహిద్ మాత్రం కియారా పెళ్లి మీద హింట్ ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో కియారా నుంచి అదిరిపోయే ప్రకటన రాబోతోంది.. కానీ అది మాత్రం కచ్చితంగా సినిమా గురించి కాదంటూ హింట్ ఇచ్చేశాడు. అంటే ఈ ఏడాది చివర్లోనే ఈ ఇద్దరి పెళ్లి ఉండబోతోందని అర్థమవుతోంది.
